ఆదివారం
27 జులై 2025
65-1204
ఎత్తబడుట

ప్రియమైన షరతులులేని వధువా,

గడచిన వారము ప్రభువు మనకు ఆయనయొక్క వాక్యమును బయలుపరచుచుండగా క్యాంపు వద్ద ఆయన మనకు ఎంతో అద్భుతమైన సమయమును అనుగ్రహించాడు. ఆయన, ఆయనయొక్క వాక్యము ద్వారా, మనయొక్క సంపూర్ణత: ఆయనయొక్క వాక్యము, ఈ వర్తమానము, టేపులలో ఉన్న దేవుని స్వరమేనని ఋజువు చేసాడు; అవన్నియు ఒక్కటే, యేసుక్రీస్తు నిన్నా, నేడు మరియు నిరంతరము ఒక్కటేరీతిగా ఉన్నాడు.

వర్తమానము నుండి వర్తమానికుడిని వేరుచేయడానికి దయ్యము ఏ విధంగా ప్రయత్నిస్తుందో మనము విన్నాము, అయితే ప్రభువైన యేసునకు స్తుతి చెల్లును గాక, స్వయంగా దేవుడు తానే ఆయనయొక్క బలమైన దూత ద్వారా మాట్లాడి మరియు మనకు ఇట్లు చెప్పాడు:

ఒక మనిషి, దేవునిచేత పంపబడి, దేవునిచేత అభిషేకించబడి, ఒక నిజమైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు తో వచ్చినప్పుడు, ఆ వర్తమానము మరియు ఆ వర్తమానికుడు ఒక్కటే అని మనము కనుగొంటాము. ఎందుకనగా అతడు వాక్యము వెంబడి వాక్యము, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు కు ప్రాతినిథ్యం వహించడానికి పంపబడ్డాడు, కావున అతడు మరియు అతని వర్తమానము ఒక్కటే.

మీరు వర్తమానికుడి నుండి వర్తమానమును వేరుచేయలేరు, రెండూ ఒక్కటే, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. అబద్ధపు అభిషేకము గలవారు ఎవరైనా ఏమి చెప్పినా లెక్కలేదు, వారు ఒక్కటే అని మరియు వేరుచేయబడలేరని దేవుడు చెప్పాడు.

పిదప ఈ వర్తమానములో పురుగులు గాని లేదా పురుగుల రసము గాని లేదు గనుక, మనము టేపులను వినుచున్నప్పుడు పురుగులను పట్టుకోడానికి ఎటువంటి వడపోత వస్త్రము మనకు అవసరములేదని ఆయన మనతో చెప్పాడు. అది ఎల్లప్పుడూ స్వచ్ఛముగా మరియు శుభ్రముగా పారుచున్న ఆయనయొక్క ఊటయైయున్నది. నిరంతరము ఉబుకుతుంది, ఎన్నడూ ఎండిపోదు, కేవలం ఉబుకుచు మరియు ఉబుకుచు ఉంటుంది, మనకు ఆయన వాక్యముయొక్క ప్రత్యక్షతను అధికముగా మరియు ఇంకా అధిముగా ఇస్తుంది.

ఆయన మనతో చేసిన నిబంధన తిరస్కరించబడలేనిది, మార్చబడలేనిది, అయితే అన్నిటికి పైగా షరతులు లేనిది అని ఎన్నడూ మర్చిపోకూడదని ఆయన మనకు జ్ఞాపకము చేశాడు.

అది ప్రేమయైనా, సహకారమైనా, లేదా సమర్పణయైనా, ఏదైనా గాని షరతులు లేనిదైతే అది సంపూర్ణతయైయున్నది మరియు ఎటువంటి ప్రత్యేకమైన నియమ నిబంధనలకు బద్ధమైనదిగా ఉండదు: ఏమి జరిగినా గాని అది మాత్రం నెరవేరుతుంది.

పిదప ఆయన ఆ మేకు గట్టిగా పట్టుకొనియుండునట్లు దానిని వంచాలనుకున్నాడు, కావున ఆయన ఈ దినమున మన కన్నులయెదుట ఆయనయొక్క లేఖనములు నెరవేర్చబడుచున్నవని మనకు చెప్పాడు.

తూర్పున ఉదయించే అదే సూ-ర్యు-డు పశ్చిమమున అస్తమించే సూ-ర్యు-డై-యున్నాడు. మరియు తూర్పునకు వచ్చి మరియు తననుతాను శరీరధారియైన దేవునిగా నిర్ధారించుకున్న అదే దేవుని కు-మా-రు-డు, ఇక్కడ ఈ పశ్చిమ తీరానికి వచ్చి, ఈ రాత్రి సంఘములో తననుతాను, నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటేరీతిగా ఉన్నవానిగా గుర్తింపజేసుకుంటున్న అదే దేవుని కు-మా-రు-డై యున్నాడు. కుమారునియొక్క సాయంకాలపు వెలుగు వచ్చియున్నది. ఈ దినము ఈ లేఖనము మనయెదుట నెరవేరినది.

మనుష్యకుమారుడు మరలా మన దినమున శరీరములో వచ్చాడు, సరిగ్గా ఆయన వాగ్దానము చేసినట్లే, తన వధువును బయటకు పిలచుటకు వచ్చాడు. అది యేసుక్రీస్తే నేరుగా మనతో మాట్లాడుటయైయున్నది, మరియు దానికి ఏ మనుష్యుని అనువాదము అవసరము లేదు. మనకు అవసరమైనదంతయు, మనకు కావలసినదంతయు, టేపులలో మాట్లాడుతూ స్వయంగా దేవునియొద్ద నుండి వస్తున్నట్టి దేవుని స్వరమే.

అది వాస్తవము చేయబడిన వాక్యముయొక్క నెరవేర్పుయొక్క బయలుపాటైయున్నది. మరియు మనము ఆ దినములో జీవిస్తున్నాము; దేవునికి స్తుతి కలుగును గాక; ఆయనను గూర్చిన మర్మముయొక్క ప్రత్యక్షత.

కుమారునియొక్క సన్నిధిలో ఉంటూ, పరిపక్వము చెందుతూ, వధువు ఎంతో మహిమకరమైన సమయమును కలిగియుంటున్నది. గోధుమ తిరిగి మరలా గోధుమ వద్దకు ఎదిగినది, మరియు మన మధ్య పులిసినదేదియు లేదు. దేవునియొక్క స్వచ్ఛమైన స్వరము మాత్రమే మనతో మాట్లాడుచు, వాక్యమైయున్న క్రీస్తుయొక్క రూపములోనికి, మనల్ని మలచుచు తయారుచేస్తున్నది.

మనము దేవుని కుమారులము మరియు కుమార్తెలమైయున్నాము, ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప కాలమైనట్టి ఈ కాలములో మనము రావడానికి, ఆయన ముందుగా నిర్ణయించుకున్న ఆయనయొక్క గుణలక్షణమైయున్నాము. మనము విఫలము కాము అని, మనము రాజీపడము అని, అయితే మనము ఆయనయొక్క నమ్మకమైన విశ్వాసనీయమైన వాక్య వధువైయుంటామని, అబ్రాహాముయొక్క రానైయున్న అతీతమైన రాజసంతానమైయున్నాము అని ఆయనకు తెలుసు.

ఎత్తబడుట సమీపములో ఉన్నది. కాలము ముగింపునకు వచ్చియున్నది. తననుతాను సిద్ధపరచుకున్న ఆయనయొక్క వధువు కొరకు ఆయన వచ్చుచున్నాడు, ఆమె కుమారునియొక్క సన్నిధిలో కూర్చొని, ఆయనయొక్క స్వరము ఆయనయొక్క వధువునకు వస్త్రధారణ చేయుటను వినుచున్నది. త్వరలోనే మనము కాలమనే తెరకు ఆవలనున్న మన ప్రియులను చూడటం ప్రారంభిస్తాము, వారు మనతో ఉండుటకై వేచియుంటూ పరితపించుచున్నారు.

ఈ టేపులు ఆయనయొక్క వధువును పరిపూర్ణము చేయడానికి దేవుడు ఏర్పాటుచేసిన మార్గమైయున్నవి. ఈ టేపులు మాత్రమే ఆయనయొక్క వధువును ఐక్యపరుస్తాయి. ఈ టేపులు ఆయనయొక్క వధువునకు దేవుని స్వరమైయున్నవి.

ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారముగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, మనమంతా అతి త్వరలో జరుగబోవుచున్నదాని గురించి వినుచుండగా, మీరు వచ్చి మరియు మాతో, ఆయనయొక్క వధువులోని ఒక భాగముతో ఐక్యమవ్వాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను: ఎత్తబడుట 65-1204.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్