భద్రము చేయబడిన ఉత్తరములు
14, మార్చి 2026, శనివారం

ప్రియమైన శ్రీమతి. యేసుక్రీస్తు,

ఇదియే దినము. ఇదియే సమయము. తనయొక్క శ్రీమతి. యేసుక్రీస్తును బయటకు పిలిచి, ఆమెతో మాట్లాడి మరియు, “నేను ఎన్నుకున్నది నిన్నే. నేను ప్రేమించుచున్నది నిన్నే. నీవు నాయొక్క పరిపూర్ణ వాక్యపు కన్యక వధువైయున్నావు. మనము ఒక్కటైయున్నాము,” అని ఆమెతో చెప్పడానికి దేవుడు తనయొక్క బలమైన పక్షిరాజును భూమి మీదకు పంపించాడు.

కేవలం ఆ మాటలు వినడంతోనే, మన హృదయములు ఆనందముతో గంతులు వేస్తాయి. ప్రపంచమంతటిలో, మిలియన్లు మరియు మిలియన్ల కొలది ప్రజలు ఉండగా, ఒకే ఒక్క శ్రీమతి. యేసుక్రీస్తు ఉన్నది, మరియు ఆయన ఎవరికొరకైతే వస్తున్నాడో, అట్టి ఆమె మీరేయైయున్నారు అనేది ఆలోచించడానికే ఎలాగున్నది కదా.

ఎన్నుకోబడిన ఆరాధనా స్థలము ఒకే ఒక్కటి ఉన్నది. ఎన్నుకోబడిన పరిపూర్ణమైన వర్తమానము ఒకే ఒక్కటి ఉన్నది. ఎన్నుకోబడిన ఒకే ఒక్క పరిపూర్ణమైన వధువు ఉన్నది…మరియు అది మనమేయైయున్నాము!!

తండ్రి ఎన్నుకున్న ఒకే ఒక్క ఆరాధనా స్థలమును కలిగియున్నాడు, అది ప్రభువైన యేసుక్రీస్తుయైయున్నాడు; ఆయన వాక్యమైయున్నాడు. ఈ రోజు, ఆత్మసంబంధమైన మరణము తాకలేని స్థలము ఒకే ఒక్కటి ఉన్నది: అది వాక్యమైయున్నది. వాక్యమును మరణము తాకలేదు, ఎందుకనగా అది దేవునియొక్క సజీవ వాక్యమైయున్నది.

ఆ సజీవ వాక్యముయొక్క సంపూర్ణ ప్రత్యక్షత శ్రీమతి. యేసుక్రీస్తుకు మాత్రమే బయలుపరచబడినది. ఎక్కడికైతే శ్రీమతి. యేసుక్రీస్తు వెళ్ళి మరియు పరిపూర్ణ వాక్యము పలుకబడుటను వినగలదో అట్టి స్థలము ఒకే ఒక్కటి ఉన్నది. దేవునియొక్క స్వరముగా ఉండుటకు ఎన్నుకోబడిన ప్రవక్త ఒకే ఒక్కడు ఉన్నాడు. శ్రీమతి. యేసు వెళ్ళి మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును వినగల స్థలము ఒకే ఒక్కటి ఉన్నది: అది ప్లే ను నొక్కడమేయైయున్నది.

అస్తమయ కాలమున వెలుగు కలుగును, ఆరాధించడానికి దేవుడు ఎన్నుకున్న ఒకే ఒక్క స్థలము. ఓ, ఈ వర్తమానము ఎందుకు వచ్చినది, ఆయన ఏమి చేయబోతున్నాడు? మరియు ఆయన దినములో అస్తమయ కాలమున వెలుగు కలుగును, మరియు (ఏమిటి?) అరణ్యముగుండా ఇశ్రాయేలీయులను నడిపించిన అదే అగ్నిస్తంభము యొక్క సూచన ద్వారా, ఆయనయొక్క పిల్లలను తిరిగి గృహమునకు అసలైన వాగ్దాన దేశమునకు స్వాగతించుటకైయున్నది.

ఆమె భర్తయొక్క స్వరము ఆమెతో మాట్లాడుటను వినుచు మరియు వెంబడించడానికి ఆయనయొక్క వధువు ఎంత జాగ్రతగా ఉండవలసియున్నది కదా. మనము ఎక్కడికైతే వెళ్ళి మరియు 100% నిశ్చయతను కలిగియుండగలమో అట్టి స్థలము ఒకే ఒక్కటి ఉన్నది. మనము మన నిత్యమైన గమ్యమును ఆధారము చేసుకున్నట్టి స్వరము ఒకే ఒక్కటి ఉన్నది.

శ్రీమతి. యేసుక్రీస్తు తాను టేపులలో వింటున్న మాటలు ఆమె భర్తయొక్క మాటలని నమ్ముతుంది. ఆయనయొక్క మాటలకు ఎటువంటి అనువాదము అవసరంలేదని ఆమె నమ్ముతుంది. కావున, తాను ఎక్కడికైతే వెళ్ళి మరియు ప్రతీ మాటకు ఆమేన్ చెప్పగలదో అట్టి ఏర్పాటుచేయబడిన స్థలము ఒకే ఒక్కటి ఉన్నదని, అది టేపులలో ఉన్న ఆమె భర్తయొక్క స్వరమని ఆమె నమ్ముతుంది.

మరొకసారి, ప్రపంచమంతటి నుండి, శ్రీమతి. యేసుక్రీస్తు, ఇట్లు చెప్పగలదు, “ఈ దినము, ఈ పలుకబడిన వాక్యము, నెరవేరుచున్నది”.

ప్రియమైన దేవా, ఆ దిగువున టూసాన్ ఎడారులలో, ఇంకా క్యాలిఫోర్నియాలో, పైన నవాడాలో మరియు ఐడహోలో, ఆ తూర్పు ప్రాంతమున మరియు చుట్టుప్రక్కల, దిగువున టెక్సాస్ లో; ఈ ఆహ్వానము ఇవ్వబడుతుండగా, ప్రజలు చిన్న సంఘములలో, పెట్రోల్ బంకులలో, గృహములలో కూర్చొని, వింటున్నారు.

దేవుడు తన వధువుతో మాట్లాడుతూ: "దేవుడు ఎన్నుకున్న ఆరాధనా స్థలము" 65-0220 అనే వర్తమానమును పలుకడాన్ని మేము వినుచుండగా, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, మీరు బ్రెన్హామ్ టెబర్నికల్ తో కలిసి వినడానికి ఆహ్వానించబడుతున్నారు.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

లేఖనములు: ద్వితియోపదేశకాండము16:1 to 3.

 

 

7, మార్చి 2026, శనివారం

ప్రియమైన అతీతమైన రాజ సంతానమా,

మనం ఎంతో ఆసక్తితో వేచియుండి మరియు ఎంతోకాలంగా ఎదురుచూసిన సమయం వచ్చియున్నది. మనం చేరుకున్నాము. అది మన కన్నులయెదుట విప్పబడటాన్ని మనం చూస్తున్నాము. అనుదినము ప్రవచనము నెరవేర్చబడుచున్నది, మరియు మనము ఇట్లు చెప్పగలము: ఈ దినము ఈ లేఖనము మన కన్నులయెదుట నెరవేరినది.

వధువులో ప్రత్యక్షత వలన ఎటువంటి ఒక ఉత్తేజము కలుగుచున్నది కదా. మనము వింటున్న ప్రతీ వర్తమానముతో, మన హృదయాలలో మరియు అంతరాత్మలలో ఇట్లు అనుభూతి చెందుతున్నాము, “ప్రభువా, ఇది ఇక ఇంతకంటే గొప్పదిగా మరియు ఇంతకంటే అద్భుతంగా మారడం అసలు సాధ్యమా?” అప్పుడు ఆయన మరొకసారి మన మధ్యకు వచ్చి మరియు మనం ఆయనయొక్క స్వరము మనల్ని పిలిచి మరియు, “నీవు నా ప్రియురాలవు. నా వధువుగా ఉండుటకు నేను నిన్ను ఎన్నుకున్నాను. నేను నీకు వాగ్దానము చేసినట్లుగా, నేను నీ కొరకు వస్తున్నాను. నేను దారిలో ఉన్నాను. త్వరలో మనము కలుసుకొని ఇక నిత్యమూ కలిసేయుంటాము,” అని చెప్పడాన్ని మనము వింటుండగా మనల్ని అభిషేకిస్తాడు.

ప్రపంచవ్యాప్తంగా మనము కేకలు వేస్తున్నాము, మన హల్లెలూయలతో, మహిమలతో, స్తుతులతో, మరియు ఆయనకు చేసే ఆరాధనతో పరలోకాన్ని ముంచెత్తుతున్నాము. సాతానుడు ఓడించబడ్డాడు. తండ్రి మన సందేహములన్నిటినీ, మన అనిశ్చయతలన్నిటినీ, ఊహాగానములన్నిటినీ తొలగించినాడు. కాబట్టి మనమే అబ్రాహాముయొక్క అతీతమైన రాజ సంతానమని, మన పూర్ణహృదయము మరియు అంతరాత్మతో మనము ప్రకటించగలము. వాగ్దానము చేయబడిన రాజ కుమారునికి ఒక రాజ వధువైయున్నాము.

ముందెన్నడూ లేనివిధంగా ఆయన తన వాక్యమును బయలుపరుస్తుండగా దేవునియొక్క సన్నిధి ఎంతో అద్భుతంగా ఉన్నది. ఆయన తన వాక్యముచేత ఆయనయొక్క వధువును ఐక్యము చేశాడు, మరియు మనల్ని ఏకమనస్సు మరియు ఏకాత్మగల వారిగా ఒక్కటిగా ఉంచి, దేవునియొక్క స్వరము మాట్లాడుటను వినుచుండగా మనల్ని తన వాక్యముచేత పరిపూర్ణులుగా చేస్తున్నాడు.

మనము వింటున్న ప్రతీ వర్తమానము మన అంతరాత్మలో పొంగిపొర్లుతున్న ఒక బుగ్గబావి వలె ఉన్నది; అది దేవునియొక్క సింహాసనము నుండి తాజాగా ఉబుకుతూ, జోరుగా ప్రవహిస్తూ, మరియు ఉరకలు వేస్తూ ఉన్నది. మనము ఎడతెగక దానిని త్రాగుతూ, మన అంతరాత్మలను నూతనపరచుకుంటున్నాము.

నా సహోదరులారా మరియు సహోదరీలారా, ఆయన ఒక కన్యకయైన వాక్య వధువును కలిగియుంటాడని చెప్తున్న లేఖనములకు నెరవేర్పు మనమే అయ్యున్నాము. మనము: ఈ దినము ఈ లేఖనము నెరవేరినది అయ్యున్నాము.

స్వయంగా దేవుడే పరలోకమునుండి తన ఏడవ దూతతో మాట్లాడి మరియు ఇట్లు చెప్పాడు, “క్రీస్తుయొక్క మొదటి రాకడను పరిచయం చేయడానికి బాప్తిస్మమిచ్చు యోహాను పంపబడినట్లే, నీ వర్తమానము ప్రపంచమంతటికీ, ఆయనయొక్క రెండవ రాకడను పరిచయం చేస్తుంది.” వధువు ఇట్లు చెప్పగలదు: ఈ దినము ఈ లేఖనము నెరవేరినది.

సాక్షాత్తు దేవునియొక్క స్వరమే మన దినములో మానవ పెదవుల ద్వారా పలుకబడి, రికార్డు చేయబడి, భద్రపరచబడి, మరియు ఆయన మనలో ప్రతియొక్కరితో యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును పలుకగలుగునట్లు అది నిలువ చేపించబడినది అన్న విషయమును మనము అసలు గ్రహించగలమా? మనము ఎవరి మాటను, ఎవరి తలంపులను, ఎవరి ఆలోచనలను తీసుకోవాల్సిన అవసరం లేకుండా, కేవలం కూర్చొని మరియు ఆయన స్వరము నేరుగా మనతో ఆయనయొక్క స్వచ్ఛమైన వాక్యమును మాట్లాడుటను వినడం సాధ్యపడేలా ఆయన చేశాడు.

ఈనాడు ఏమి జరుగుచున్నది?

మరియు తూర్పు దిక్కున వచ్చి మరియు తననుతాను శరీరములో ప్రత్యక్షపరచబడిన దేవునిగా నిర్ధారించుకున్న అదే దేవుని కు-మా-రు-డు, ఇక్కడ పశ్చిమ దిక్కున, ఈ రాత్రి సంఘము మధ్యన తననుతాను, నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటేరీతిగా ఉన్నవాడిగా గుర్తింపజేసుకుంటున్న అదే దేవుని కు-మా-రు-డై-యున్నాడు. కుమారునియొక్క సాయంకాల వెలుగు వచ్చియున్నది. ఈ దినము ఈ లేఖనము మన ఎదుట నెరవేరినది.

“టేపులను ప్లే చేయడమనేది దేవుడు తన వధువు కొరకు ఏర్పాటుచేసిన మార్గమైయున్నది”: అని చెప్పడం ద్వారా మరియు నమ్మడం ద్వారా మనము దేవునియొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉన్నామా?

టేపులు వినడంకంటే గొప్పది ఏదైనా ఉన్నదా?

గత రాత్రి నేను చెప్పినట్లుగా, దేవుడు ఎల్లప్పుడూ, మూడుల్లో ప్రదర్శించబడ్డాడు. అక్కడ సొదొమీయులు ఉన్నారు, లోతీయులు ఉన్నారు, మరియు అబ్రాహామీయులు ఉన్నారు. అది ఈ రాత్రి అదే పరిస్థితిలో ఉన్నది, ప్రపంచం సరిగ్గా అట్లే ఉన్నది.

గమనించండి, అబ్రాహాముతో నిలిచియున్న ఆయన స్వయంగా దేవుడేయైయున్నాడు. మిగిలిన ఇద్దరు దూతలైన వర్తమానికులైయున్నారు.

కాబట్టి టేపులలో మనతో మాట్లాడుచున్నది ఎవరు?

నన్ను మిమ్మల్ని ఒక విషయమును అడుగనివ్వండి. ఇప్పుడున్న ఈ పరిస్థితిని చూడండి. తనతో మాట్లాడిన ఈ వ్యక్తిని అబ్రాహాము, “ఎలోహిం” అని పిలిచాడు. ఎలోహిం అనే హెబ్రీ పదమునకు “సర్వసమృద్ధి గలవాడు, నిత్యుడైనవాడు” అని అర్థము, ఎలోహిం, స్వయంగా దేవుడేయైయున్నాడు!

ప్లే ను నొక్కడం ఎంత ప్రాముఖ్యము?

...“ఒక దినమున పరిశుద్ధాత్మ వచ్చి అదే కార్యమును చేస్తాడు, మరియు దానికి వ్యతిరేకముగా ఒక్క మాట మాట్లాడినా అది ఎన్నడూ క్షమించబడదు.” అది, ఏ సమయములోనైతే ప్రతీ వాక్యము ఒకదానితో ఒకటి ఇమిడిపోవలసియున్నదో అట్టి ఈ దినమేయైయున్నది. “దానికి వ్యతిరేకముగా ఒక్క మాట మాట్లాడినా; అది ఈ యుగమందైనను లేదా రాబోవు యుగమందైనను ఎన్నడూ క్షమించబడదు.”

వధువు మరొకసారి ఏకమై మరియు దేవుడు మనల్ని ప్రోత్సహించుటను మరియు మనము ఆయనయొక్క ఎన్నుకోబడినవారమని, మరియు మనల్ని మన గొప్ప వివాహ విందునకు, పిదప మన భవిషత్తు గృహమునకు తీసుకెళ్ళడానికి ఆయన త్వరలో వస్తున్నాడని చెప్తూ మనకు భరోసా ఇవ్వడాన్ని వినుచుండగా, గడిచిన వారములోని మన హల్లెలూయలు మరియు ప్రభువును స్తుతించడము కేవలం ఈ ఆదివారము ఏమి జరుగబోతున్నదో దానికి ఒక సిద్ధపాటుయైయున్నది.

ఇది యెహోవా ఏర్పాటుచేసిన దినము; దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

వర్తమానము: 65-0219 - "ఈ దినము ఈ లేఖనము నెరవేరినది"

 

లేఖనములు:

పరిశుద్ధ. యోహాను 16వ అధ్యాయము
యెషయా 61:1-2
పరిశుద్ధ. లూకా 4:16

 

 

దయచేసి ఈ వారము జఫర్సన్విల్ లో సమయ మార్పు గురించి మర్చిపోకండి.

 

 

28, ఫిబ్రవరి 2026, శనివారం

ప్రియమైన కన్య వాక్య వధువా,

ఈ ఉదయము నేను ఇక్కడ కూర్చొని, ఆదివారము వధువు వినబోయే ఈ వర్తమానము వింటూ, చదువుతూ మరియు అధ్యయనము చేస్తుండగా, మహత్తరమైన అభిషేకమును నేను అనుభూతి చెందుతున్నాను. నా సమస్తము అభిషేకించబడినది. ప్రపంచమంతటి నుండి మనమందరమూ ఇదే అభిషేకముతో కూడివస్తామని ఎరిగియుండి, నా హృదయము అత్యానందముతో ఉబుకుచున్నది. ఆయన మనలో ప్రతి ఒక్కరితో మాట్లాడి మరియు ఆయనయొక్క వాక్యమును బయలుపరుస్తుండగా, ఒకే సమయములో, మనమందరమూ సంతోషిస్తూ మరియు ప్రభువును స్తుతిస్తూ ఉంటాము.

అభిషేకము ఎంత గొప్పగా ఉంటుందంటే, మనము మన స్తుతులతో మరియు ఆరాధనతో పరలోకమును ముంచెత్తుతుండగా, ప్రపంచమంతటా ఒకే సమయములో, “హల్లెలూయా, ఆమేన్, ప్రభువు నామమునకు స్తుతి కలుగునుగాక” అని అరవడము మరియు కేకలువేయడము ఉంటుంది.

ఏమి జరుగుతుంది? దేవుడు ఆయనయొక్క వధువును ఐక్యపరుస్తూ మరియు ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన తననుతాను బయలుపరచుకుంటూ మరియు తననుతాను మనకు ప్రత్యక్షపరచుకొనుచుండగా మనము ఒక్కటైయుంటాము, ఏక మనస్సుతోను మరియు ఏక ఆత్మతోను ఉంటాము.

మీరు వెళ్ళగల మరే గొప్ప స్థలము లేదు, మీరు వినగల మరే గొప్ప స్వరము లేదు; టేపులలో దేవునియొక్క స్వరము నేరుగా మీతో మాట్లాడటం కాకుండా మరే గొప్ప అభిషేకము లేదు.

దేవుడు ఆదినుండి ఆయనయొక్క వాక్యమును కనిపెట్టుకొనియున్నాడు మరియు తన పిల్లలందరూ వెళ్ళి ఆయన మాట్లాడటాన్ని మరియు ఆయన తన స్వంత వాక్యమును అనువదించడాన్ని వినగలుగునట్టి ఒక స్థలమును ఏర్పాటుచేశాడు. అది ఎటువంటి అంచనాలు, ఎటువంటి ఆశించడాలు, ఎటువంటి ఆలోచించడాలు లేనట్టి ఒక స్థలమైయున్నది; అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును వినుటకు దేవుడు ఏర్పాటుచేసిన స్థలమైయున్నది.

అది మీకు బయలుపరచబడినప్పుడు, అది మీ హృదయములో మరియు మీ అంతరాత్మలో ఆన్ చేయబడినట్టి ఒక గొప్ప వెలుగుగా ఉన్నది…మీరు ఇట్లు కేకవేస్తారు, “విషయం ఇదే. నేను దానిని చూస్తున్నాను. నేను వాక్యముతో ఒక్కటైయున్నాను. నేనే వాక్యమైయున్నాను. నేను వధువైయున్నాను. నేను చేరుకున్నాను.”

అది జరుగుతున్నది, మరియు వారు దానిని ఎరుగకయున్నారు. చూడండి, విషయం అదే. చూశారా? అవును, అయ్యా. “ఏలయనగా శరీరము ఎక్కడుండునో, పక్షిరాజులు అక్కడ పోగవును,” అది ఎంతో ఖచ్ఛితమైయున్నది. చూశారా? అది దానినే చెప్పింది. శరీరము అంటే ఏమిటి? వాక్యమైయున్నది. ఆయనే వాక్యమైయున్న, ఆ శరీరమైయున్నాడు, క్రీస్తు! “మీలో ఉన్న క్రీస్తేయైయున్నాడు,” నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటేరీతిగా ఉన్నవాడైయున్నాడు. అది ఎంత సత్యము కదా!

వాక్యమును వినడానికి మనము కూడివస్తుండగా, మన చింతలన్నీ, మన ఒత్తిడిలన్నీ, మన సమస్యలన్నీ, మటుమాయమైపోతాయి. మనము చింతించడానికి ఏదియు లేదని; మనము ఆయనయొక్క వధువైయున్నామని మనము గుర్తిస్తూండగా మనము సంతోషిస్తాము. ఆయన మనతో మాత్రమే కాదు గానీ, ఆయన మనలో ఉన్నాడు. మనము విత్తనపు వాక్య వధువైయున్నాము. సమస్తమూ సరిగ్గా ఉన్నది. ఆయన సమయము ఖచ్చితమైనది. మనము పరిపూర్ణులమైయున్నాము.

మనము ఆయనయొక్క కన్యక-జన్మ ద్వారాయైన శరీరధారియైన వాక్యమైయున్నామని చెప్పుటకు మనము ఎంతో తృప్తిచెందియున్నాము మరియు కృతజ్ఞులమైయున్నాము; నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటేరీతిగా ఉన్న యేసుక్రీస్తు, మనలో జీవిస్తూ నివసిస్తున్నాడు. హల్లెలూయా!

మనము ఒక్క మాట విషయంలో కూడా రాజీపడలేము. మనము టేపులలో ఉన్న దేవునియొక్క స్వరమును వినవలసియున్నాము.

ఒక పక్షిరాజు రాజీపడటాన్ని మీరెన్నడైనా చూశారా? లేదు, అయ్యా. దానిలో రాజీపడటమనేది ఏదీ లేదు. అలాగే ఒక అసలైన క్రైస్తవుడు కూడా రాజీపడడు. అతడు మృదువుగా ఉండడు. అతడు దానిని కనుగొనేవరకు వేటాడుతాడు. ఆమేన్. అవును, అయ్యా. అతడు తన మాంసమును కనుగొంటాడు. అతనికి తాజా మన్నా కావాలి. అతడు అక్కడికి వెళ్ళి మరియు దానిని కనుగొనేవరకు త్రవ్వుతాడు. అతడు పైకి మరియు ఇంకా పైకి ఎగురుతాడు. ఈ లోయలో ఏదీ లేనట్లైతే, అతడు ఇంకొంచెం పైకి ఎగురుతాడు. మీరు ఎంత పైకి వెళ్తే, అంత ఎక్కువ చూడగలుగుతారు. కావున ఈ దినముయొక్క పక్షిరాజులు సంవత్సరాల క్రితం చంపబడిన ఈ రాబందు ఆహారము తింటూ జీవించకుండా, ఇంకా పైకి ఎగురుతూ, దేవునియొక్క వాగ్దానములలోనికి త్రవ్వుతూ ఉండే సమయం వచ్చినది; దానిలోనుండి బయటకు రండి.

వధువా సిద్ధపడుము, ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, మనము: 65-0218 విత్తనము తొక్కతో వారసత్వము పొందదు అనుదానిని వినుచుండగా, అత్యంత గొప్ప అభిషేకము క్రింద కూర్చొని, ఆ తాజా మన్నాను భుజిస్తాము.

ఈ దినమునకు దేవుడు ఏర్పాటు చేసిన పరిపూర్ణమైన మార్గముపై విందునారగించుటకు ప్రపంచమంతటినుండి వధువును మేము ఆహ్వానిస్తున్నాము. అదియే వధువు ప్రతీ మాటకు ఆమేన్ చెప్పగల ఏకైక స్థలమైయున్నది. ప్లే ను నొక్కి మరియు వాక్యమును వినుచు మరియు దానిని స్వీకరించడం ద్వారా అక్కడ పరిశుద్ధాత్మయొక్క సర్వోన్నతమైన అభిషేకము మాట్లాడి మరియు ఆయన వధువును పరిపూర్ణము చేస్తుంది.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

లేఖనములు:

పరిశుద్ధ. మత్తయి 24:24
పరిశుద్ధ. లూకా 17:30
పరిశుద్ధ. యోహాను 5:24 / 14:12
రోమా 8:1
గలతి 4: 27-31
హెబ్రీ 13:8
1 యోహాను 5:7
ప్రకటన 10
మలాకీ 4

 

 

21, ఫిబ్రవరి 2026, శనివారం

ప్రియమైన గొర్రెపిల్లలారా,

“మనము దేవుని గొర్రెలమైయున్నాము, మనల్ని బయటకు పిలిచి మరియు మనల్ని ఆయనయొక్క భద్రము-చేయబడి మరియు దాచబడిన మన్నాతో పోషించడానికి ఆయన తన ఏడవ దూత వర్తమానికుడిని పంపించాడు,” అని చెప్పడానికి అది ఎంత గౌరవప్రదముగా మరియు ఎటువంటి భాగ్యముగా ఉన్నది కదా.

ఈ వర్తమానము ఆయనయొక్క వధువును పరిపూర్ణము చేయడానికి పంపబడిన దేవునియొక్క స్వరమైయున్నదని మనము సంపూర్ణముగా తృప్తిపరచబడి మరియు దానిని నమ్ముతున్నాము. గోధుమ నుండి పొట్టు వేరైపోతున్నదని మనము నమ్ముతున్నాము, మరియు ఇప్పుడు ఆయనయొక్క వధువు పరిపక్వము చెందడానికి కుమారునియొక్క సన్నిధిలో పడియుండి, ప్లే ను నొక్కుచున్నది.

మరియు స్నేహితుడా, దానికొరకే మనమిక్కడ ఉన్నాము, ఇక్కడున్న ప్రజలయొక్క మన చిన్న గుంపు, అది క్రీస్తునకు పరిపక్వము చెందునట్లు, కుమారునియొక్క సన్నిధిలో ఉండండి, ఎంతగా అంటే అది ఆయన బల్ల మీద రొట్టెగా మారాలి. అది దానిని చేయాలనే నేను కోరుతున్నాను.

ప్లే ను నొక్కి మరియు దేవునియొక్క నిర్ధారించబడిన స్వరము మాట్లాడుటను వినడమే మీరు వినవలసిన అత్యంత ముఖ్యమైన స్వరమైయున్నదని నమ్మని ఎవరైనా, అతడు దేవుని సన్నిధినుండి పారిపోవుచున్న వ్యక్తియైయున్నాడు.

మీరు దానిని ఎదుర్కొని నిలబడవలసియున్నారు, లేదా దాని విషయములో ఏదో ఒకటి చేయవలసియున్నారు. మీరు ఒక బాధ్యతను కలిగియున్నారు, ప్రతీయొక్కరు కలిగియున్నారు, మరియు మీరు ఈ సంగతులను ఎదుర్కొని నిలబడవలసియున్నారు.

ఈ దినమునకు ఈ కొటేషన్ ఎంత సత్యమైనదిగా మరియు ఎంత ప్రాముఖ్యమైనదిగా ఉన్నది కదా. దేవునిచేత బయటకు పిలువబడినవారిలో ఎంతో విభజన ఉన్నది. దేవునియొక్క స్వరమును వినడానికి సంఘములో టేపులను ప్లే చేయడం అవసరమైయున్నదా, లేదా ఇప్పుడు సేవకులు వాక్యోపదేశము చేయడం అవసరమైయున్నదా?

వాక్యమును ప్రజల ఎదుట ఉంచడానికి దేవుడు పిలిచి మరియు పరిచర్యను ఇక్కడ ఉంచాడు. వారు కాపరులైయున్నారు. వాక్యము దీనిని బోధిస్తున్నది. దేవుడు పిలిచి మరియు నియమించిన పురుషులుగా వారు గౌరవించబడి మరియు సత్కరించబడవలసి యున్నారు.

వారు వధువు కాదని, మనము ఎన్నడూ చెప్పలేము, మరియు అలా చెప్పకూడదు కూడా. అది తప్పైయున్నది మరియు అది ప్రవక్త మనకు నేర్పించినదానికి విరుద్ధమైయున్నది. ప్రజలు: “వారు వారి సంఘములలో టేపులను ప్లే చేయకపోతే, వారు వాక్య-విరోధులు” అని చెప్పడాన్ని నేను విన్నాను.” ఆ విధంగా మీరెన్నడూ అనకూడదు. మీరు తప్పుడు ఆత్మను కలిగియున్నారని అది నాకు చూపిస్తుంది.

ఇంకా ఇతరులు, “వారందరూ బ్రెన్హామ్ టెబర్నికల్ తో పాటు లైవ్ ప్రసారమును వినాలి లేదా వారు దేవుని చిత్తములో లేనట్లే” అని చెప్పారని నేను విన్నాను. మీరు ఆ విధంగా ఎన్నడూ అనకూడదు. ఎవరు వధువు మరియు ఎవరు వధువు కాదు అనేది దేవుడు మాత్రమే ఎరిగియున్నాడు. ఆ విధంగా మాట్లాడటం అది వధువు ఆత్మ కాదు.

బ్రెన్హామ్ టెబర్నికల్ తో లైవ్ ప్రసారమును వింటున్న కొందరు ప్రజలు కూడా, “మీరు టేపులు వినడానికి సంఘానికి వెళ్ళి మరియు మీ ఇంటి వద్ద లైవ్ ప్రసారమును విననట్లైతే మీరు తప్పైయున్నారు!” అని చెప్తున్నారు. సహోదరులారా మరియు సహోదరీలారా అది సరి కాదు. మీరు గనుక అలా చెప్తున్నట్లే, అలా చెప్పడం ఆపివేయండి, మీరు తప్పు చెప్తున్నారు. ప్రతియొక్కరు తాము ప్రభువుచేత ఎలా నడిపించబడుతున్నారని భావిస్తున్నారో అలాగే చేయవలసియున్నారు.

ప్రసంగించడమే ఈ దినమునకు దేవుడు ఏర్పాటుచేసిన మార్గమని అనేకమంది సేవకులు భావిస్తున్నారు. మనము కేవలం సంగతులను భిన్నముగా చూస్తున్నాము, అది పర్వాలేదు. సహోదరుడు బ్రెన్హామ్ గారు ఇటువంటిదానినే ఎన్నిసార్లు చెప్పారు? ఈ మధ్యనే ప్రశ్నలు మరియు జవాబులలో ఆయన చెప్పినది మనము విన్నాము, జాక్సన్ సహోదరుడు తప్పైయుండటం గురించి ప్రజలు మాట్లాడుతున్నప్పుడు, అతనికి గానీ అతని సంఘమునకు గానీ వ్యక్తిరేకముగా మాట్లాడినవారిని ఆయన ఖండించారు.

బ్రెన్హామ్ టెబర్నికల్ కు దేవుడు ఏర్పాటుచేసిన మార్గము ఏమిటని నేను నమ్ముతున్నానో కేవలం దానిని ఈ లేఖ విధానములో నేను బోధిస్తున్నాను. వారును మన సహోదరులు మరియు సహోదరీలైయున్నారు. వారు ప్రభువును మరియు ఈ వర్తమానమును ప్రేమిస్తారు. ప్రభువు వారిని ఆ విధంగా నడిపిస్తున్నాడని వారు భావిస్తున్నారు. ప్రభువునకు స్తుతి కలుగును గాక.

వారు దానిని ఒక విధంగా చూస్తున్నారు మరియు మనము దానిని మరొక విధంగా చూస్తున్నాము, అది పర్వాలేదు. వారు చూసే విధంగా నేను దానిని చూడలేను మరియు నేను చూసే విధంగా వారు దానిని చూడలేరు. నా విషయానికి వస్తే, దేవుడు ఏర్పాటుచేసిన అనేక మార్గములు ఉన్నాయి, కానీ పరిపూర్ణమైన మార్గము ఒకేఒక్కటి ఉన్నది, మరియు నాకైతే, అది ప్లే ను నొక్కడమేయైయున్నది.

ఇక్కడ నేను చెప్పేదానిని తప్పుగా అర్థంచేసుకోరని నేను ఆశపడుతున్నాను. చేతులుంచి మరియు ప్రజల కొరకు ప్రార్థించడమనేది 100% వాక్యప్రకారమైనదే. నూనెతో అభిషేకించి మరియు రోగుల కొరకు ప్రార్థించడమనేది లేఖనానుసారముగా దేవునియొక్క వాక్యమైయున్నది. ఆ రెండూ వాక్యమేయైయున్నవని సహోదరుడు బ్రెన్హామ్ గారు మనకు బోధించి నేర్పించారు. కానీ నాకైతే దేవుడు ఏర్పాటుచేసినట్టి ఆయనయొక్క పరిపూర్ణమైన మార్గము కావాలి….మరది కేవలం దేవుడు ఆలాగు చెప్పాడు గనుక దానిని నమ్మడమైయున్నది. నేను దానిని చేయడానికే ప్రయత్నిస్తున్నాను.

అయితే ఇప్పుడు స్వస్థత విషయమైతే, అది కేవలం దేవునియొక్క కనికరమైయున్నది ఆయన, “ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థతనొందితిరి.” ఇప్పుడు, మొదటిగా వాక్యము అలాగు చెప్తున్నది, అది సరిపోవలసియున్నది, కానీ వాక్యములో మీరు దానిని నమ్మనట్లైతే, అప్పుడు సంఘములో వరములు ఉన్నాయి, ఎటువంటివనగా దానిని మీకు ఎంతో తేటపరచి, అది, మరియు నమ్మడానికి విశ్వాసమును కలిగించే విధంగా దానిని ఎలా ఉపదేశించాలో ఎరిగియుండుటకు ప్రేరేపణ కలిగియున్న పురుషులు ఉన్నారు.

నేను 5-రకముల పరిచర్యను నమ్ముతాను. వాక్యమును బోధించడానికి మరియు ఉపదేశించడానికి మనుష్యులు దేవునిచేత పిలువబడటాన్ని నేను నమ్ముతాను. కానీ, టేపులలో ఉన్న దేవుని స్వరమును వినడమే నాకు దేవునియొక్క పరిపూర్ణమైన మార్గమైయున్నదని నేను నమ్ముతాను.

టేపులను వినడంలోయైతే, నాకు అవి అర్థమవ్వాల్సిన అవసరము కూడా లేదు, కేవలం నేను వినే ప్రతీ మాటను నమ్మవలసియున్నాను. ఎక్కడైతే నేను ప్రతీ మాటను నమ్మి మరియు నా నిత్యమైన గమ్యమును ఆధారము చేసుకోగలనో, అటువంటిది, టేపులు తప్ప ఏ వ్యక్తి, ఏ సేవకుడు, వేరే ఏ స్థలము లేదు.

కాలము ప్రారంభమైనది మొదలుకొని ఆయనయొక్క స్వరము నేరుగా తమతో మాట్లాడుటను స్వయంగా తామే వినే అవకాశమునైనా లేదా సామర్థ్యతనైనా దేవుడు తన ప్రజలకు ముందెన్నడూ ఇవ్వలేదు. టేపులలో ప్రతీ మర్మము బయలుపరచబడినది, టేపులలో ప్రతీ ప్రశ్నకు జవాబు ఇవ్వబడినది. వధువు పరిపూర్ణమవ్వడానికి అవసరమైయున్న ప్రతీది టేపులలో ఉన్నది.

టేపులలో పలుకబడిన ప్రతీ మాట దేవునియొక్క మాటయైయున్నది. దానంతటినీ నేను గ్రహించలేకపోవచ్చును లేదా వివరించలేకపోవచ్చును, అయితే నేను అలా చేయవలసిన అవసరము కూడా లేదు. నేను కేవలం ప్రతీ మాటకు ఆమేన్ చెప్పాలని ఆయన కోరుతున్నాడు, మరియు నేను అలా చేయగల ఏకైక చోటు టేపులలో మాత్రమేయైయున్నది.

కానీ ఎప్పుడైతే—ఎప్పుడైతే మీరు ఒక భిన్నమైనదానిని చేయాల్సివస్తుందో, మీరు ఏది సత్యమని ఎరిగియున్నారో అట్టి మీ దృఢ విశ్వాసము పక్షమున నిలబడవలసిన సమయం వస్తుందో, మరక్కడే కష్టంగా ఉంటుంది, సరిగ్గా అక్కడే, అసలైన సవాలు మొదలవుతుంది.

మనము దేవునియొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉన్నామని మరియు నీనెవెకి వెళ్ళే ఓడలో ఉన్నామని, నాలోని సమస్తముతో నేను నమ్ముతున్నాను. ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, దేవుడు తన గొర్రెలతో మాట్లాడుటను మేము వినుచుండగా, ప్రపంచం వచ్చి మాతో కలిసి మా ఓడలో ప్రయాణము చేయాలని నేను కోరుతున్నాను.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

వర్తమానము: 65-0217 "ప్రభువు సన్నిధినుండి పారిపోవుచున్న ఒక మనుష్యుడు"

 

చదువవలసిన లేఖనములు:

యోనా 1:1-3
మలాకీ 4
పరిశుద్ధ. యోహాను 14:12
లూకా 17:30

 

 

14, ఫిబ్రవరి 2026, శనివారం

ప్రియమైన రాజ కుటుంబమా,

ప్రభువు ఆయనయొక్క దూత ద్వారా మీతో మాట్లాడి మరియు, “ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీరు దేవుని పిల్లలైయున్నారు, రాజవంశపు రక్తముగల రాజ కుటుంబమైయున్నారు. ప్రపంచములో మీ రక్తము కంటే శ్రేష్ఠమైన రక్తము లేదు. మీరు నా పిల్లలైయున్నారు, ప్రపంచమంతటా వ్యాపించియున్నారు, నేను క్రీస్తునకు కనినవారైయున్నారు” అని చెప్పడాన్ని వినడానికి మీరు వెళ్ళగల ఒకే ఒక్క స్థలము ఉన్నది.

మనము దేవునియొక్క రాజ కుటుంబమైయున్నాము మన నరములలో రాజవంశపు రక్తము ప్రవహిస్తున్నది. దేవునియొక్క స్వరము తన బలమైన ప్రవక్తగుండా మాట్లాడుటచేత క్రీస్తునకు జన్మించిన పిల్లలమైయున్నాము. స్నేహితులారా ఇంతకంటే శ్రేష్ఠమైనది లేదు.

బ్రెన్హామ్ సహోదరుడా, ఎత్తబడుటలో ఉండటానికి వధువు జఫర్సన్విల్ కు గాని లేదా ఆరిజోనాకు గాని వెళ్ళవలసిన అవసరమున్నదా?

“ఇద్దరు మంచము మీద ఉందురు; నేను వారిలో ఒకరిని తీసుకొని ఒకరిని విడిచిపెట్టెదెను; మరియు ఇద్దరు పొలములో ఉందురు; నేను వారిలో ఒకరిని తీసుకొని ఒకరిని విడిచిపెట్టెదెను.” చూశారా? కావున వారు…ప్రపంచవ్యాప్తంగా ఉంటారు, విషయములను ఒకే విధంగా కలిగియుండటానికి వారు ఒకే చోట గుమిగూడియుండరు. కానీ వారు చిన్న గుంపులుగా భూమియందతటా వ్యాపించియుంటారు.

కావున భౌతికంగా, మనము ఒకే సమయములో ఒకే స్థలములో ఉండము. అయితే దేవునికి మహిమ, ఆయన తన వధువును సమకూర్చడానికి ఇంకా గొప్ప ప్రణాళికను కలిగియున్నాడు.

దేశవ్యాప్తంగా అంతటా, పశ్చిమ తీరమువరకు, పైన అరిజోనా కొండలలోను, టెక్సాస్ మైదాన ప్రాంతములలోను, తూర్పు తీరములోను, దేశవ్యాప్తంగా అంతటా, ప్రభువా, వారు ఎక్కడ కూడుకున్నా గాని, ఆ—ఆ—ఆ చిన్న మైక్రోఫోనుల చుట్టు కూడుకొనియున్న సంఘములన్నిటి కొరకు మరియు సంఘసమూహముల కొరకు మేము ప్రార్థిస్తున్నాము. కాల వ్యవధిలో చూస్తే, మేము అనేక గంటల వ్యత్యాసములో ఉన్నాము, కానీ, ప్రభువా, ఈ రాత్రి మేము ఒక్క మొత్తముగా కలిసియున్నాము, మెస్సీయాయొక్క రాకడ కొరకు ఎదురుచూస్తున్న, విశ్వాసులమైయున్నాము.

ఈ రోజు, ఆయన తన వధువును ఈ దేశము నుండి మాత్రమే కాదు గాని, ఆయన మనలను 7 ఖండాల నుండి సమకూర్చుచున్నాడు. ఆఫ్రికా మొదలుకొని అంటార్కిటికా నుండి సమకూర్చుచున్నాడు. ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా మరియు యూరప్ నుండి సమకూర్చుచున్నాడు. దేవునియొక్క స్వరమును వినడానికి ఆయన తన వధువును ఒక్క మొత్తముగా సమకూర్చుచున్నాడు.

ఎక్కడైతే వారు సంపూర్ణ వాక్యమును బోధిస్తారో అటువంటి ఒక సంఘమును మనము కనుగొనేవరకు; సగం వాక్యమును బోధించే సంఘమైనా, అక్కడికి వెళ్ళమని ఆయన మనకు చెప్పాడు. వధువు ఇప్పుడు ఆ స్థలమును కనుగొన్నది గనుక దేవునికి స్తుతి కలుగును గాక, టేపులలో ఉన్న దేవునియొక్క స్వరమే సంపూర్ణ వాక్యమైయున్నది.

మీరు మీ గృహ టేపు సంఘములో ఉన్నాగాని, అనేక కుటుంబాలు కూడుకునే మీ సంఘములో ఉన్నాగాని, లేదా అమేజాన్ లేదా ఆఫ్రికాయొక్క అడవులలో ఒక గుడిసెలో ఉన్నాగాని, దేవునియొక్క స్వరము మీతో నేరుగా మాట్లాడటాన్ని వినుటకు మీరు ప్లేను నొక్కగల ఏ స్థలములో ఉన్నాగాని, మీరు ఒక సంపూర్ణ వాక్య సంఘములో ఉన్నట్లే.

మేము ఆ సంపూర్ణ వాక్య సంఘమును కనుగొన్నాము మరియు ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు మేము: ప్రశ్నలు మరియు జవాబులు #4 64-0830E ను వినుచుండగా మాతో చేరమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

 

సంబంధిత కూడికలు