ఆదివారం
19 జనవరి 2025
61-0611
Revelation, Chapter Five Part I

ప్రియమైన దత్తపుత్రులారా,

పరిశుద్ధాత్మ ముందెన్నడూ లేని విధంగా వధువునకు ఆయనయొక్క వాక్యమును ప్రకాశిస్తుండగా మనము ఎటువంటి ఒక అద్భుతమైన చలికాలమును కలిగియుంటున్నాము కదా. బహుశా మనము మన జీవితమంతా విని, చదివి మరియు ధ్యానించిన విషయాలే అయ్యుండవచ్చును, అయితే ముందెన్నడూ లేని విధంగా ఇప్పుడు ముసుగు తొలగించబడుతున్నాయి మరియు బయలుపరచబడుతున్నాయి.

సరిగ్గా ఈ దినము కొరకే మానవుడు కొన్ని వేల సంవత్సరాలు వేచియున్నాడు. మనం చూస్తున్నవాటిని చూడటానికి మరియు మనం వింటున్నవాటిని వినడానికి వారందరూ పరితపించారు మరియు ప్రార్థించారు. నెరవేర్పును మరియు ప్రభువుయొక్క రాకడను చూడటానికి వారెంతగా కోరుకున్నారో. పాత కాలపు ప్రవక్తల సైతం ఈ దినము కొరకు పరితపించారు. వారు ప్రభువుయొక్క రాకడను మరియు నెరవేర్పును ఎంతగానో చూడగోరారు.

చివరికి యేసుయొక్క శిష్యులైన, పేతురు, యాకోబు, మరియు యోహాను కూడా, ఆయనతో నడిచి మరియు ఆయనతో మాట్లాడిన ప్రజలు కూడా, దాచబడినదానంతటినీ చూడటానికి మరియు వినడానికి పరితపించారు. వారి దినములో, వారి కాలములో అది ప్రత్యక్షపరచబడి బయలుపరచబడాలని వారు ప్రార్థన చేసారు.

ఏడు సంఘకాలముల గుండా, ప్రతీ వర్తమానికుడు, పౌలు, మార్టిన్, మరియు లూథర్, దాచబడిన మర్మములన్నిటినీ తెలుసుకొనగోరారు. వాక్యముయొక్క నెరవేర్పు వారి కాలములో జరుగుటను చూడాలన్నదే వారి కోరికయైయుండెను. వారు ప్రభువుయొక్క రాకడను చూడగోరారు.

దేవుడు ఒక ప్రణాళికను కలిగియున్నాడు. దేవుడు ఒక సమయమును కలిగియున్నాడు. తాను ఎదురుచూస్తున్నట్టి కొందరు ప్రజలను దేవుడు కలిగియున్నాడు…అది మనమే. కాలములన్నిటి గుండా, అందరూ విఫలమయ్యారు. కానీ ఆయనయొక్క మహిమకరమైన, పరిపూర్ణ వాక్య వధువైనట్టి: ఒక జనము ఉంటారని, ఆయనయొక్క ముందుజ్ఞానము ద్వారా, ఆయన ఎరిగియున్నాడు. వారు ఆయనను విఫలపరచరు. వారు ఒక్క వాక్యముపై కూడా రాజీపడరు. వారు ఆయనయొక్క స్వచ్ఛమైన కన్యక వాక్య వధువైయుంటారు.

ఇదే ఆ సమయమైయున్నది. ఇదే ఆ కాలమైయున్నది. ఆదాము పడిపోయి మరియు అతని హక్కును పోగొట్టుకున్నప్పటినుండి ఆయన ఎదురుచూసినటువంటి ఆ ఎన్నుకోబడినవారము మనమే. మనమే ఆయనయొక్క వధువైయున్నాము.

దేవుడు జరుగనైయున్నవాటన్నిటి గురించి ఒక ముందు ప్రదర్శనను యోహానుకు ఇచ్చాడు, కానీ అతనికి అన్ని అర్థాలు తెలియవు. అతడు పైకి పిలువబడినప్పుడు, సింహాసనమందు ఆసీనుడైనవాని కుడి చేతిలో వ్రాయబడియున్న ఒక గ్రంథము, ఏడు ముద్రలతో ముద్రించబడియుండుటను, అయితే దానిని తెరచుటకు యోగ్యులెవరూ లేకపోవుటను అతడు చూసాడు.

ఇక సమస్తము నశించిపోయినట్లేయని, ఏ నిరీక్షణ లేనందున యోహాను కేకవేసి బహుగా ఏడ్చాడు. కానీ ప్రభువుకు స్తోత్రం, పెద్దలలో ఒకరు అతనితో ఇట్లు చెప్పారు, “ఏడ్వకుము, ఏలయనగా ఇదిగో, దావీదు వేరైన, యూదా గోత్రపు సింహము, ఏడు ముద్రలను తీసి, మరియు ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెను”.

అది ఆ సమయమైయున్నది. అది ఆ కాలమైయున్నది. అతడు తాను చూసినదానంతటినీ వ్రాయడానికి దేవుడు ఎన్నుకొనిన మానవుడైయున్నాడు. కానీ అయినను, దానియొక్క అర్థమంతయు తెలియపరచబడకుండా ఉన్నది.

దేవుడు ఆయనయొక్క ఎన్నుకోబడిన పాత్ర, అనగా ఆయనయొక్క ఏడవ దూత వర్తమానికుడు, భూమి మీదికి రావడం కొరకు ఎదురుచూస్తూ వేచియున్నాడు, తద్వారా ఆయనయొక్క వధువునకు ఆయనయొక్క స్వరముగా ఉండునట్లు అతని స్వరమును ఉపయోగించుకొనుటకైయున్నది. ఆయన ఎటువంటి అపార్థములు ఉండకుండునట్లు నేరుగా నోటినుండి చెవికి మాట్లాడగోరాడు. ఆయన స్వయంగా తానే మాట్లాడి మరియు ఆయనయొక్క ప్రియులకు, ముందుగా నిర్ణయించబడినవారికి, పరిపూర్ణమైన, ప్రియమైన వధువునకు...మనకు ఆయనయొక్క మర్మములన్నిటినీ బయలుపరచగోరాడు!!

ఈ అద్భుతమైన సంగతులన్నిటినీ మనకు చెప్పడానికి ఆయన ఎంతగా పరితపించాడో. ఒక పురుషుడు తన భార్యకు అతడు ఆమెను ప్రేమిస్తున్నాడని మరలా మరలా ఎలాగైతే చెప్తాడో, మరియు దానిని వినడానికి ఆమెకు ఎలాగైతే ఎన్నడూ విసుగు రాదో, అలాగే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని, మనల్ని ఎన్నుకున్నాడని, మనకొరకు వేచియున్నాడని మరియు ఇప్పుడు మనకొరకు వస్తున్నాడని మనతో మరలా మరలా చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నాడు.

ఆయన దానిని మరలా మరలా చెప్పుటను వినడానికి మనమెంతగా ఇష్టపడతామో ఆయనకు తెలుసు, అందుకే ఆయన ఆయనయొక్క స్వరమును రికార్డు చేపించాడు, తద్వారా ఆయనయొక్క వధువు ‘ప్లేను నొక్కి’ ప్రతిరోజు, రోజంతా, ఆయనయొక్క వాక్యము తమ హృదయములను నింపడాన్ని వినగలుగుటకైయున్నది.

ఆయనయొక్క వాక్యముపై పోషించబడుట ద్వారా ఆయనయొక్క ప్రియమైన వధువు తననుతాను సిద్ధపరచుకున్నది. ఆయనయొక్క స్వరమును తప్ప, మరి దేనిని వినదు. ఏర్పాటు చేయబడిన ఆయనయొక్క స్వచ్ఛమైన వాక్యమును మాత్రమే మనము ఆరగించగలము.

మనము గొప్ప ఎదురుచూపులతో ఉన్నాము. మనము దానిని మన అంతరాత్మలలో అనుభూతి చెందుతున్నాము. ఆయన వచ్చుచున్నాడు. వివాహ సంగీతము వాయించబడటాన్ని మనము వింటున్నాము. ఆ నడవగుండా వచ్చుటకు వధువు సిద్ధంగా ఉన్నది. అందరూ లేచి నిలబడండి, వధువు తన వరుడితో ఉండటానికి వచ్చుచున్నది. సమస్తము సిద్ధము చేయబడినది. ఆ క్షణము వచ్చియున్నది.

ఆయన మనల్ని ఎవరూ ప్రేమించని విధంగా ప్రేమిస్తున్నాడు. మనము కూడా ఎవరినీ ప్రేమించని విధంగా ఆయనను ప్రేమిస్తున్నాము. మనము ఆయనతోను, మరియు మనము ప్రేమిస్తున్న వారందరితోను, నిత్యత్వమంతా ఏకమైయుండబోవుచున్నాము.

ఈ ఆదివారం జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు దేవుని స్వరము దీనిని బయలుపరచడాన్ని మేము వింటుండగా మాతో కలిసి మిమ్మల్ని మీరు వివాహమునకు సిద్ధపరచుకోడానికి మీరు ఆహ్వానించబడ్డారు, ప్రకటన గ్రంథము, ఐదవ అధ్యాయము భాగము I 61-0611.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్