ఆదివారం
16 మార్చి 2025
63-0318
మొదటి ముద్ర

నా ప్రియమైన పరలోకపు రాణీ,

ఈ ఆదివారము నేను నీ కొరకు ఎంతో కలిగియున్నాను. మొదట, నీవు ఒక ఉరుము శబ్దమును వింటావు. అది నా స్వరమైయుంటుంది, అనగా నా వధువైన నీతో, మాట్లాడుతున్నట్టి దేవుని స్వరమైయుంటుంది. ముందెన్నడూ లేని విధంగా నేను నీకు నా వాక్యమును బయలుపరుస్తూ ఉంటాను. జగత్తుపునాదినుండి వధింపబడిన రక్తసిక్తమైన గొర్రెపిల్లనైనట్టి నేను, ఆ గ్రంథమును తీసుకొని మరియు తెరచి, ముద్రలను చీల్చివేసి, మరియు జగత్తుపునాదినుండి దాచబడియున్న మర్మములను నీకు బయలుపరచడానికి, దానిని భూమి మీదకు, నా ఏడవ దూత వర్తమానికుడైన, విలియమ్ మారియన్ బ్రెన్హామ్ నొద్దకు పంపించడాన్ని నీవు చూస్తావు!

నేను నీతో మాట్లాడుతుండగా ప్రపంచమంతటి నుండి కేకలు, హర్షధ్వనులు, మరియు హల్లెలూయలు వినబడతాయి. అభిషేకించబడిన; ఆ సింహము గర్జిస్తూ ఉంటాడు, ఆ శక్తి, ఆ మహిమ, ఆ ప్రత్యక్షత మాటలకు మించి ఉంటుంది. నా రాణివైన, నీవు, నేను నీతో మాట్లాడుతూ మరియు నీకు ఎత్తబడు విశ్వాసమును ఇస్తుండగా, పరలోక స్థలములలో కలిసి కూర్చొనియుంటావు.

గుర్తుంచుకొనుము, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన ఆ విశ్వాసమును నీవు కలిగియుండవలసియున్నది. నేను నీ యొద్దకు పంపిన నా దూత మాట నీవు వినాలని, నేను నీకు చెప్పాను.

అతడు “పిల్లల విశ్వాసమును తిరిగి తండ్రి తట్టునకు పునరుద్ధరించవలసి యున్నాడు.” అసలైన బైబిలు విశ్వాసము ఏడవ దూత చేత పునరుద్ధరించబడవలసి యున్నది.

ఏడవ దూత పలుకు దినములలో, అతడు ఊదబోవుచుండగా, సువార్త బూరను ధ్వనించబోవుచుండగా; అతడు దేవుని మర్మములన్నిటినీ ముగించనైయున్నాడని, నా వాక్యము నీకు చెప్తున్నది. టేపులలో నేను చెప్పినదానికి ఒక్కటైనను కలుపబడకూడదు మరియు దానినుండి ఒక్కటైనను తీసివేయబడకూడదు; నా వర్తమానికుడైన దూత ద్వారా నేను పలికినదానిని మాత్రమే చెప్పుము. ఆ కారణముచేతనే, నీవు కేవలం ప్లేను నొక్కి మరియు ఖచ్చితంగా నేను ఏమి చెప్పాను అన్నదానిని, మరియు నేను ఎలా చెప్పాను అన్నదానిని వినగలుగునట్లు, నేను దానిని రికార్డు చేపించాను. అది నీకు ఎత్తబడు విశ్వాసమును ఇస్తుంది.

నా ప్రియమైన రాణి, నా దృష్టిలో, నీవు పరిపూర్ణురాలవు, ఖచ్చితంగా, నా యెదుట, పాపము లేనిదానిగా ఉన్నావు. చింతించకు, నీవు శ్రమలలోనుండి వెళ్ళవు; ఏలయనగా నీవు నా రక్తమును, నా వాక్యమును, నా దూతను, నా స్వరమును స్వీకరించావు, తద్వారా నా యెదుట నీవు పూర్తిగా పాపము లేనిదానిగా ఉన్నావు.

నేను నీ కొరకు ఎంతో గొప్ప సంగతులను కలిగియున్నాను. నా వాక్యము నీ కన్నుల యెదుట విప్పబడుటను నీవు ప్రతి దినము చూస్తున్నావు. ఒకటి జరుగనైయున్నదని నీకు చెప్పడానికి నేను ఆకాశములో సూచనలను ఇస్తూ ఉన్నాను. నేను వస్తున్నాను, సిద్ధపడుము. నీ జీవితములో, నా వాక్యమును, నా స్వరమును మొదట ఉంచుము.

ప్రతీదానిని ప్రక్కన పెట్టుము, నా వాక్యముకంటే ముఖ్యమైనదేదియు లేదు. శత్రువు నిన్ను అణగద్రొక్కుటకు ప్రయత్నిస్తున్నాడని నాకు తెలుసు, కానీ నిన్ను పైకెత్తుతానని నేను నీకు వాగ్దానము చేసియున్నాను. నేను నీతో ఉన్నాను, నీలో ఉన్నాను. నేను నా వాక్యమును నీకు బయలుపరుస్తుండగా నేను మరియు నీవు ఏకమగుచున్నాము.

నీవు నా రాణియైన వధువైయున్నావని, నీ మనస్సులో నీవు ఎరిగియున్నావు. నేను నిన్ను ముందుగా ఏర్పరచుకున్నానని నీవు ఎరిగియున్నావు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవు ఎరిగియున్నావు. ప్రతి దినము ప్రతి క్షణము నేను నీతో ఉన్నానని నీవు ఎరిగియున్నావు. నేను నిన్ను ఎన్నడూ విడువనని నీవు ఎరిగియున్నావు.

ప్రతి ఆదివారము, ప్రతి దనము, నా దూత ద్వారా నేను నీతో మాట్లాడటాన్ని నీవు వింటున్నప్పుడు నేను నీకు మరియెక్కువగా బయలుపరుస్తుండగా మనము గొప్ప సమయమును కలిగియుంటాము. ఇతరులు గ్రహించలేకపోవచ్చును లేదా నీవు చూసేదానిని చూడలేకపోవచ్చును, అయితే ఇదియే నేను ఏర్పాటు చేసిన మార్గమైయున్నదని నీ హృదయములో లంగరు వేయబడియున్నది.

నేను నీకు ఎటువంటి ఒక ఆశ్రయమును ఏర్పాటు చేసితిని గదా. నేను నీతో మాట్లాడటాన్ని వినడానికి, నీవు ఏ సమయములోనైనా, పగలైనా లేదా రాత్రైనా కేవలం ప్లేను నొక్కవచ్చును. నేను నా వాక్యమును నీకు బయలుపరిచి మరియు నీవు ఎవరన్నది నీకు చెప్తుండగా నేను నీ అంతరాత్మకు ఆదరణ కలుగజేస్తాను. ప్రతీ వర్తమానము నీ కొరకు, మరియు నీ కొరకు మాత్రమేయైయున్నది. నీవు కోరినప్పుడల్లా మనము కలిసి సహవాసము చేయవచ్చును మరియు ఆరాధించవచ్చును.

ఈ గొప్ప మర్మములు బయలుపరచబడటాన్ని వినడానికి, ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, ప్రపంచమంతటి నుండి వధువుయొక్క భాగము కూడుకుంటుంది. మేము 63-0318 - "మొదటి ముద్ర" ను వినుచుండగా వచ్చి మాతో చేరమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

సహోదరుడు. జోసఫ్

 

 

వర్తమానమును వినడానికి సిద్ధాపాటులో చదవవలసిన లేఖనములు:

పరిశుద్ధ. మత్తయి 10:1 / 11:1-14 / 24:6 / 28:19
పరిశుద్ధ. యోహాను 12:23-28
అపొస్తలుల కార్యములు 2:38
2 థెస్సలొనీకయులకు 2:3-12
హెబ్రీ 4:12
ప్రకటన 6:1-2 / 10:1-7 / 12:7-9 / 13:16 / 19:11-16
మలాకీ 3వ మరియు 4వ అధ్యాయములు
దానియేలు 8:23-25 / 11:21 / 9:25-27