
ప్రియమైన శ్రీమతి. యేసు క్రీస్తు,
మన జీవితములో దేనిగురించియైనా ఒక ప్రశ్నను మనము అడిగినట్లైతే, దానికి ఒక సరియైన జవాబు ఉండవలసియున్నది. దానికి దగ్గరలో ఏదైనా ఉండవచ్చును, కానీ ప్రతీ ప్రశ్నకు ఒక నిజమైన, తిన్నని జవాబు ఉండవలసియున్నది. కావున, మన జీవితంలో ఎదురయ్యే ప్రతీ ప్రశ్నకు, ఒక నిజమైన, సరియైన జవాబు ఉండవలసియున్నది.
మనకు ఒక బైబిలు ప్రశ్న ఉన్నయెడల, అప్పుడు ఒక బైబిలు జవ్వాబు ఉండవలసియున్నది. అది ఒక గుంపు మనుష్యుల నుండో, ఫలానా సహవాసము నుండో, లేదా ఒక విద్యావంతుడి నుండో, లేదా ఏదైనా సంస్థ నుండో రావాలని మనం కోరుకోము. అది నేరుగా లేఖనము నుండి రావాలని మనం కోరుకుంటాము. మనం దీనిని తెలుసుకోవలసియున్నది: దేవుడిని ఆరాధించుటకు ఆయనయొక్క నిజమైన మరియు సరియైన స్థలము ఏది?
ఒక సంఘములో కాదు, ఒక సంస్థలో కాదు, ఒక ఆచారములో కాదు కానీ; దేవుడు క్రీస్తులోనే మానవుడిని కలుసుకొనుటకు ఎన్నుకున్నాడు. దేవుడు మానవుడిని కలుసుకునే చోటు అది మాత్రమేయైయున్నది, మరియు అతడు దేవుడిని ఆరాధించగలిగేది, క్రీస్తులోనేయైయున్నది. ఆ స్థలములో మాత్రమే. నీవొక మెథడిస్టువైనా, బ్యాప్టిస్టువైనా, క్యాథలిక్కువైనా, ప్రొటెస్టెంటువైనా, నీవు ఏదైనా గాని, నీవు సరిగ్గా దేవుడిని ఆరాధించగలుగుటకు ఒకే ఒక్క స్థలము ఉన్నది, అది క్రీస్తులోనేయైయున్నది.
దేవుడిని ఆరాధించుటకు ఆయనయొక్క సరియైన, మరియు ఎన్నుకోబడిన ఆరాధనా స్థలము యేసుక్రీస్తులో మాత్రమేయైయున్నది; అది మాత్రమే ఆయన ఏర్పాటు చేసిన మార్గమైయున్నది.
బైబిలు గ్రంథము మలాకీ 4 లో మనకు ఒక పక్షిరాజును వాగ్దానము చేసినది; మనము వెంబడించవలసిన ఒక అగ్నిస్తంభమును వాగ్దానము చేసినది. తప్పిపోయిన సంఘమునకు ఆయన హెబ్రీ 13:8 అయ్యున్నాడని చూపిస్తాడు, యేసు క్రీస్తు నిన్నా, నేడు, నిరంతరము ఒక్కటేరీతిగా ఉన్నాడని చూపిస్తాడు. లూకా 17:30 లో మనకు ఇది కూడా వాగ్దానం చేయబడినది అదేదనగా మనుష్యకుమారుడు (పక్షిరాజు) తననుతాను ఆయనయొక్క వధువుకు బయలుపరచుకుంటాడు.
ప్రకటన 4:7లో, నాలుగు జీవులు ఉన్నవని అది మనకు చెప్పుచున్నది, మొదటిది సింహమైయున్నది. తరువాతది దూడయైయున్నది. పిదప, తరువాతది మనుష్యుడు; ఆ మనుష్యుడు సంఘసంస్కర్తలైయున్నారు, మనుష్యునియొక్క విద్య, వేదాంతము, మరియు మొదలగునవి.
అయితే సాయంకాల సమయములో, రానైయున్న చివరి జీవి ఒక ఎగురుచున్న పక్షిరాజైయున్నదని బైబిలు చెప్పినది. దేవుడు తన అంత్యకాల వధువునకు ఒక పక్షిరాజును అనగా; స్వయంగా మనుష్యకుమారుడే, తన వధువును నడిపించుటకు తననుతాను శరీరములో ప్రత్యక్షపరచుకొనుటయైయున్నది.
పాత నిబంధనలో ఉన్న ఆ పాత సంగతులన్నియు, రానున్న సంగతులకు ఛాయలైయున్నవని కూడా బైబిలు గ్రంథము చెప్పుచున్నది. ఆ ఛాయ దగ్గరవుతున్నాకొద్దీ, నీడ నిజస్వరూపము చేత మింగివేయబడుతుంది. అప్పుడు జరిగినది ఏమిటంటే ఈనాడు జరుగబోయేదాని యొక్క ఛాయయే.
I సమూయేలు 8 లో, ప్రజలను నడిపించుటకు దేవుడు సమూయేలు ప్రవక్తను ఏర్పాటు చేసాడని పాత నిబంధన మనకు చెప్పుచున్నది. ప్రజలు అతని వద్దకు వచ్చి మరియు వారికి ఒక రాజు కావాలని అతనితో చెప్పారు. సమూయేలు ఎంతగా దిగులుపడ్డాడంటే అతని గుండె దాదాపు ఆగిపోయినది.
సమర్పించుకొని, లేఖనముచేత-నిర్ధారించబడిన ఈ ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలను నడిపించుచున్నాడు మరియు అతడు తృణీకరించబడ్డాడని అతనికి అనిపించినది. అతడు ప్రజలను సమకూర్చి మరియు చిన్నపిల్లలవలె వారిని మోసుకొని, మరియు వారిని అభివృద్ధి చేసి మరియు వారిని ఆశీర్వదించిన దేవుడినుండి దూరముగా వెళ్ళవద్దని వారిని బ్రతిమాలాడు. కానీ వారు పట్టువీడలేదు.
వారు సమూయేలుతో ఇట్లన్నారు, “నీవు నీ నడిపింపులో ఎన్నడూ తప్పిపోలేదు. ఆర్ధిక విషయాలలో నీవెల్లప్పుడూ నిజాయితీగా ఉన్నావు. మమ్మల్ని దేవుని వాక్యవరుసలో ఉంచుటకు నీవు నీ సాయశక్తులా ప్రయత్నించావు. దేవునియొక్క అద్భుత కార్యములను, జ్ఞానమును, నియమమును మరియు కాపుదలను మేము అభినందిస్తున్నాము. మేము దానియందు నమ్మికయుంచుచున్నాము. మేము దానిని ఇష్టపడుచున్నాము. మరియు అంతేకాకుండా మేము అది లేకుండా ఉండగోరడంలేదు. అయితే కేవలం విషయమేమిటంటే యుద్ధమునకు నడిపించడానికి మేము ఒక రాజును కోరుచున్నాము.
ఇప్పడు మేము యుద్ధమునకు వెళ్ళినప్పుడు యూదా వెంబడించుచుండగా యాజకులు ముందుగా వెళ్ళాలనేదే ఇంకనూ మా ఉద్దేశ్యమైయున్నది, మరియు మేము బూరలు ఊదుచూ మరియు కేకలు వేయుచు మరియు పాడుతూ ఉంటాము. మేము దానిలో ఏదియు ఆపాలని ఉద్దేశించడంలేదు. కానీ మమ్మల్ని నడిపించుటకు మాలో ఒకడైన ఒక రాజు మాకు కావలెను.”
వీరు ఆ దినపు సంఘసంస్థ ప్రజలు కారు. వీరు వాస్తవానికి ఆయన వారిని నడిపించడానికి దేవునిచేత ఎన్నుకోబడిన దేవునియొక్క ప్రవక్త అని నమ్మిన ప్రజలే.
“అవును, నీవు ఒక ప్రవక్తవు. వర్తమానమును మేము నమ్ముచున్నాము. దేవుడు తన వాక్యమును నీకు బయలుపరుస్తాడు, మరియు మేము దానిని ఇష్టపడుచున్నాము, మరియు అది లేకుండా మేము ఉండగోరడంలేదు, కానీ మమ్మల్ని నడిపించుటకు; నీవే గాక మాలో ఒకరు మాకు కావలెను. నీవు మాకు తీసుకొనివచ్చిన వర్తమానమును మేము ఇంకనూ నమ్మగోరుచున్నాము. అది వాక్యమైయున్నది. నీవు ప్రవక్తవైయున్నావు, కానీ నీవు మాత్రమే ప్రాముఖ్యమైన స్వరము కాదు.”
ఈనాడు లోకములో చక్కని ప్రజలు ఉన్నారు, చక్కని సంఘాలు ఉన్నవి. కానీ ఒకే ఒక్క శ్రీమతి. యేసుక్రీస్తు ఉన్నది, మరియు మనమే ఆమెయైయున్నాము, ఆయన ఎవరికొరకైతే వచ్చుచున్నాడో అట్టివారమైయున్నాము; యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని దేవునిచేత నిర్ధారించబడి మరియు ఋజువు చేయబడిన ఒకే ఒక్క స్వరముతో నిలిచియుండే ఆయనయొక్క పవిత్రమైన కన్యక వాక్య వధువైయున్నాము.
ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు మీరు మాతో చేరగోరినయెడల, ప్రపంచవ్యాప్తంగా మేము ఫోను-ద్వారా వింటూ ఉంటాము. ఇది జరుగబోవుచున్నది.
ఈ రాత్రి ఇక్కడ ఈ స్థలములో మరియు బయట ఆవలిన ఫోను ద్వారా వింటున్న, నా సహోదరులపై, సహోదరీలపై, నా స్నేహితులపై కదలాడుము. తూర్పుతీరము నుండి పశ్చిమతీరము వరకు, అనేక భిన్నమైన రాష్ట్రములనుండి వినుచున్నారు. ప్రియమైన దేవా, టూసాన్ లోని ఎడారులకు ఆవలిన, క్యాలిఫోర్నియాలో, నెవాడా మరియు ఐదహోలో, తూర్పున మరియు ఆ చుట్టూరా, టెక్సస్ లో; ఈ ఆహ్వానము ఇవ్వబడియుండగా, చిన్న సంఘములలో—లో, పెట్రోలు బంకులలో, గృహములలో కూర్చొని వింటున్న ప్రజల గురించి నేను ప్రార్థిస్తున్నాను. ఓ దేవా, తప్పిపోయిన ఆ పురుషుడు లేదా స్త్రీ, అబ్బాయి లేదా అమ్మాయి, ఈ ఘడిలో, నీయొద్దకు వచ్చెదరు గాక. ఇప్పుడే దీనిని అనుగ్రహించుము. సమయముండగనే ఈ భద్రతా స్థలమును వారు కనుగొనెదరని, యేసు నామములో మేము దీనిని అడుగుచున్నాము.
ఇప్పుడు, ప్రభువా, ఈ సవాలు కలుసుకోబడినది, ఆ సాతానుడు, ఆ పెద్ద మోసగాడు, దేవుని కుమారుడిని పట్టుకొనుటకు ఏ హక్కును కలిగిలేడు. వాడు ఓడిపోయినవాడై యున్నాడు. ఒకే ఒక్క నిజమైన నామము, ఒకేఒక్క ఆరాధనా స్థలమైయున్న యేసుక్రీస్తు, కల్వరి వద్ద వాడిని ఓడించాడు. మరియు ఇప్పుడు మేమాయన రక్తమును ఒప్పుకొనుచున్నాము, ఆయన ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును ఓడించాడని ఒప్పుకొనుచున్నాము.
మరియు ఈ సమూహమును విడిచిపెట్టవలెనని నేను సాతానుడికి ఆజ్ఞాపిస్తున్నాను. వారు స్వతంత్రులగునట్లు, యేసుక్రీస్తు నామములో, ఈ ప్రజల నుండి బయటకు రమ్ము.
వ్రాయబడిన వాక్యమును ఆధారముచేసుకొని తమ స్వస్థతను స్వీకరించే ప్రతిఒక్కరూ, లేచి నిలబడి, “యేసుక్రీస్తు నామములో ఇప్పుడు నేను నా స్వస్థతను స్వీకరించుచున్నాను,” అని చెప్పుట ద్వారా మీ సాక్ష్యమును ఇవ్వండి. మీ కాళ్ళ మీద లేచి నిలబడండి.
దేవునికి స్తోత్రం! అదిగో మీరు లేచుచున్నారు. ఇక్కడ చూడండి, క్రుంటివారు మరియు అటువంటివారు లేచుచున్నారు. దేవునికి స్తోత్రం! అంటే. కేవలం నమ్మండి. ఆయన ఇక్కడున్నాడు.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
దేవుడు ఏర్పరచుకొనిన ఆరాధనా స్థలము 65-0220
వర్తమానమును వినడానికి ముందు చదువవలసిన లేఖనములు:
ద్వితియోపదేశకాండము 16:1-3
నిర్గమకాండము 12:3-6
మలాకీ 3 & 4వ అధ్యాయములు
లూకా 17:30
రోమా 8:1
ప్రకటన 4:7