ఆదివారం
02 మార్చి 2025
63-0317M
దేవుడు సామాన్యతలో తనకుతాను మరుగుచేసికొని అటుతరువాత, ఆవిధముగనే తనకుతాను బయలుపరచుకొనును

ప్రియమైన కొలను లిల్లీలారా,

1963, ఫిబ్రవరి 28 న, అది ఉరిమినది. ఫ్యూ-ఫ్యూ, ఏడు దూతలు నిత్యత్వము నుండి వచ్చి మరియు దేవునియొక్క ఏడవదూత వర్తమానికుడికి ప్రత్యక్షమయ్యారు. పిరమిడ్ వలెనున్న ఆ సమూహములోనికి ఆయన కొనిపోబడ్డాడు. అప్పుడు, ఆరిజోనాకి పైగా ఒక సహజాతీతమైన మేఘము ఆకాశములో ప్రత్యక్షమైనది. అది ఒక సూచనైయున్నది, ఏడు ముద్రలను విప్పడానికి దేవుడు తన ఏడవ దూతను తిరిగి జఫర్సన్విల్ కు పంపిస్తున్నాడు.

2025, ఫిబ్రవరి 28 న, ఏడు గ్రహాలు ఆకాశములో ఒకే వరుసలోనికి రావడం. సమకూడి ఏడు ముద్రలను వినడానికి వధువు తననుతాను సిద్ధపరచుకుంటున్నది.

ప్రపంచ వ్యాప్తంగానున్న వధువుతో సమకూడి, దేవునియొక్క స్వరము ఏడు ముద్రల ప్రత్యక్షతను బయలుపరచడాన్ని వినుటకు, స్వయంగా ప్రభువు చేతనే, మీరు ఆహ్వానించబడుచున్నారు.

కాలము ప్రారంభమైనప్పటినుండి ప్రవక్తలు మరియు పరిశుద్ధులు పరితపించి మరియు ఎదురుచూసినట్టి దినము, ఇప్పుడు సంభవించుచున్నది. అంత్య దినములలో ఎవరిని భూమి మీదికి పంపుతానని దేవుడు చెప్పాడో ఆ బలిష్ఠుడైన దూత దేవునియొక్క దాచబడిన మర్మములను తెరచి మరియు బయలుపరచడానికి వచ్చాడు, తద్వారా మన ప్రభువైన యేసు ఆయనయొక్క విశ్వాసనీయమైన వధువు కొరకు తిరిగి వచ్చి మరియు మనల్ని మన పెండ్లి విందునకు తీసుకెళ్ళగలుగుటకైయున్నది.

నూతన సంఘములోనికి నేను వచ్చియుండగా, నేను నిర్వర్తించిన నా మొదటి కర్తవ్యం ఏమిటంటే, ఆఫీసు గదిలో నిలబడియున్న ఒక యవ్వన పురుషుడు మరియు ఒక యవ్వన స్త్రీకి నేను వివాహము చేశాను. ఆ దినముయొక్క విందునకై ఒక వధువును సిద్ధపరచునట్లు, నేను క్రీస్తునకు ఒక నమ్మకమైన సేవకునిగా ఉంటానన్నదానికి, అది సాదృశ్యముగా ఉండును గాక.

ఈ దినమున, ఈ వాక్యము నెరవేర్చబడుచున్నది. దేవుడు ఆయనయొక్క దూత ద్వారా మాట్లాడుచున్నాడు, ఆ దినపు విందునకై ఆయనయొక్క వధువును సిద్ధపరచుచున్నాడు. అక్షరాలా ఉన్నది ఉన్నట్లే మనము ఆయనయొక్క సూచనలను వెంబడిస్తున్నాము. టేపులలో ఉన్న దేవుని స్వరముతో నిలిచియుండుట ద్వారా వధువు తననుతాను సిద్ధపరచుకున్నది.

ఇటీవలనే కలలు మరియు దర్శనముల ద్వారా మనము ఏమి విన్నాము? ఆహారము, ఇదిగో అది ఇక్కడున్నది, ఇదియే ఆ స్థలమైయున్నది. ఒక స్వరము ఆయనతో ఇట్లు చెప్పినది, “ఆహారమును లిపలికి తీసుకొనిరమ్ము. దానిని లోపల భద్రపరచుము. వారిని ఇక్కడ ఉంచడానికి ఒకే ఒక్క మార్గము అదేయైయున్నది, అది వారికి ఆహరమునివ్వడమేయై యున్నది.”

“కేవలం వాక్యముతో నిలిచియుండండి,” అని మాత్రమే ఆయనయొక్క భావము అని అనేకమంది నమ్ముతారు, మరియు అది సత్యమే, ఆయన దానిని చెప్తున్నాడు; అయితే పెండ్లికుమారుడు ఆయనయొక్క పెండ్లికుమార్తెతో మాట్లాడుచుండగా పెండ్లి కుమార్తె ఆ మాటలలో దాగియున్నదానిని కూడా గ్రహిస్తుంది.

ఆఖరికి ఇక్కడ ఈ స్థలములో దేవుడు ఇచ్చే దర్శనములు కూడా, అవి ఎంతగానో అపార్థము చేసుకొనబడుచున్నవి. ఆ కారణముచేతనే “టేపులు ఏమి చెప్తున్నాయో దానినే చెప్పండి, దర్శనములు ఏమి చెప్తున్నాయో దానినే చెప్పండి,” అని నేను అనడాన్ని టేపులలో మీరు వింటుంటారు. ఇప్పుడు, మీరు బాగా మెలుకువగా ఉన్నయెడల, మీరు ఒకదానిని చూస్తారు. చూశారా? నేను దానిని నా చేతిలో పట్టుకొని మీకు చూపించవలసిన అవసరంలేదని నేను ఆశపడుచున్నాను.

ఆఖరికి ఆ దర్శనములు, ఆయన వాటికి అనువాదమునిచ్చిన తర్వాత కూడా అవి అపార్థము చేసుకొనబడినవి. ఆయన మనకు దానినే చెప్తున్నాడు, మీరు గందరగోళమవ్వకుండా ఉండాలనుకుంటే, లేదా అపార్థము చేసుకోకుండా ఉండాలనుకుంటే, ప్లేను నొక్కి మరియు దేవుని స్వరము సరిగ్గా ఏమి చెప్తున్నదో వినండి.

వాక్యము వివిధ అర్థములను కలిగియుంటుందని నాకు తెలుసు, అయితే ఇది నా అనువాదమైయున్నది: ఆ కలలు మరియు దర్శనములన్నీ ఒకే విషయమును చెప్పినవి; టేపులతో నిలిచియుండండి. మీకొక ప్రశ్న ఉన్నయెడల, టేపులయొద్దకు వెళ్ళండి. టేపులు దేవునియొక్క-భద్రపరచబడిన ఆహారమైయున్నవి. కేవలం టేపులలో ఏమున్నదో దానినే చెప్పండి; దానికి ఏమియు కలపకండి. టేపులు వధువునకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నది. వాక్యము ప్రవక్తనొద్దకు మాత్రమే, వస్తుంది. ప్రవక్త మాత్రమే వాక్యముయొక్క దైవీకమైన అనువాదకుడైయున్నాడు. ప్రవక్త వధువును పిలచి మరియు ఆమెను నడిపించుటకైయున్నాడు. టేపులలో చెప్పబడినదాని ప్రకారంగా నేను తీర్పు తీర్చబడతాను.

ప్రతీది నాకు ఆ టేపులనే చూపిస్తున్నది.

నా ప్రియమైన కొలను లిల్లీలారా, నాకైతే, ప్లేను నొక్కడమనేది ఈ దినమునకు దేవుడు సామాన్యతలో ఉండుటయైయున్నది.

వర్తమానమును వినడానికి ఆయనయొక్క వధువు కూడుకొనుచుండగా ఈ రోజు ఏమి బయలుపరచబడనైయున్నదో? అని నేను ప్రతివారము; ఇంకా ఎక్కువ ఉత్సాహభరితుడనగుచున్నాను. ముందెన్నడూ లేని విధంగా ఆయన తన వాక్యమును బయలుపరుస్తుండగా పరిశుద్ధాత్మ మనలో ప్రతి ఒక్కరినీ అభిషేకిస్తాడని నాకు తెలుసు. అసలు ఏ క్షణములోనైనా, అయన వచ్చి మరియు మన పెండ్లి విందునకై మనల్ని తీసుకెళ్ళిపోతాడని, నాకు అనిపించుచున్నది.

మనము, దేవుని కుమారులము మరియు కుమార్తెలమైయున్నాము. మనము, దేవునినుండి వచ్చిన పిల్లలమైయున్నాము. మనము, భూమికి వారసులమైయున్నాము. మనము ప్రకృతిని నియంత్రిస్తాము మనము ఉనికిలోనికి పలుకుతాము. మనము వధువైయున్నాము!

మనల్ని మనము నూతనముగా పనికొరకు ప్రతిష్ఠించుకొని, మరియు మనల్ని మనము క్రీస్తుకు సమర్పించుకుందాము.

సహోదురుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

తేదీ: ఆదివారము, మార్చి 2, 2025
వర్తమానము: దేవుడు సామాన్యతయందు తననుతాను మరుగుచేసుకొని, పిదప దానియందే తననుతాను బయలుపరచుకొనుట 63-0317M
సమయము: 12:00 P.M., జఫర్సన్విల్ కాలమానం ప్రకారము.