ఆదివారం
11 జనవరి 2026
64-0802
పరలోకపు పెండ్లికుమారుడు, భూలోకపు పెండ్లికుమార్తె యొక్క భవిష్యత్ గృహము
కూడిక ఇంత సమయంలో ప్రారంభమవుతుంది:
0
రోజులు
19
గంటలు
40
నిమిషములు
35
క్షణములు

Sun Apr 26, 2020 10:00 AM EDT

నాయొక్క ప్రియాతి ప్రియమైనవారలారా,

నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. మీరు నా మాంసములో మాంసము, మరియు నా ఎముకలో ఎముక అయ్యున్నారు. నేను నక్షత్రములను, చంద్రుడిని, నా సృష్టియంతటినీ సృష్టించకముందే, నేను మిమ్మల్ని చూసి మరియు అప్పుడే మిమ్మల్ని ప్రేమించాను. మీరు నాలో ఒక భాగమైయున్నారని, నా ఏకైక ప్రియురాలైయున్నారని నేను ఎరిగియున్నాను. మీరు మరియు నేను ఒక్కటైయున్నాము.

అప్పుడు నేను మిమ్మల్ని చూసినది మొదలుకొని నేను ఏ దినము కొరకైతే పరితపించి ఎదురుచూసానో ఆఖరికి ఆ దినము వచ్చినది. ఇప్పుడు నేను మిమ్మల్ని తూర్పు నుండి మరియు పశ్చిమము నుండి, ఉత్తరము నుండి మరియు దక్షిణము నుండి నా స్వరముచేత పిలుస్తూ మరియు మిమ్మల్ని ఐక్యపరుస్తున్నాను. మీరు ప్రత్యక్షపరచబడినట్టి నా తలంపులు, నా వాక్యము, నా వధువైయున్నారు.

నా హృదయములో ఉన్నదానంతటినీ మీతో చెప్పడానికి నేను పరితపించాను, కావున నేను దానిని నా ప్రవక్తల ద్వారా వ్రాసి మరియు వేలకొలది సంవత్సరాలుగా మీ కొరకు దానిని భద్రము చేపించాను. శతాబ్దాల తరబడి అనేకులు దానిని చదివారు, మరియు దానిని నమ్మారు, కానీ మీరు వచ్చేవరకు నేను అనేక సంగతులను రహస్యముగా ఉంచాను. నేను మీకు మాత్రమే చెప్తాను.

నేను దాచిపెట్టినట్టి ఈ అద్భుతమైన సంగతులన్నిటినీ వినడానికి మరియు తెలుసుకోడానికి వారు పరితపించారు, కానీ నేను మీకు వాగ్దానము చేసినట్లుగా, కేవలం నా సర్వస్వమైయున్న మీ కొరకే, నేను వేచియుండి, మరియు ఇప్పటివరకు వాటిని రహస్యముగా ఉంచాను.

నేను ఈ సంగతులన్నిటినీ మీకు చెప్పి, మరియు వాటిని మీకు బయలుపరచగలుగునట్లు, నేను వచ్చి మరియు మరొక్కసారి నన్ను నేను మానవ శరీరములో బయలుపరచుకుంటానని మీకు వాగ్దానము చేశాను. నా స్వరము నేరుగా మీతో మాట్లాడుటను మీరు వినాలని నేను కోరాను.

నా ప్రేమ గురించి మీతో చెప్పడానికి నేను ఇతరులను అనేకులను నా పరిశుద్ధాత్మతో అభిషేకించాను, కానీ నేను ఎల్లప్పుడూ చేసినట్లే, మరియు నేను ఎన్నడూ మారనివాడైయుండగా, నేను ఒక్క మానవుడిని ఎన్నుకున్నాను: నేను మీతో యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును మాట్లాడగలుగునట్లు నా స్వరముగా ఉండుటకై, నా దూతను, నా ప్రవక్తను ఎన్నుకున్నాను.

మీరు ఏదో ఒక ఫలానా దినమున రక్షించబడలేదని, నేను మీకు చెప్పగోరాను. మీరు ఎల్లప్పుడూ రక్షించబడేయున్నారు. నేను కేవలం మిమ్మల్ని తిరిగి విమోచించడానికి వచ్చాను. మీరు ఆదిలోనే నిత్యజీవమును కలిగియున్నారు గనుక మీరు ముందునుండే రక్షించబడియున్నారు. తద్వారా, నా కన్నులలో, మీ పాపములన్నీ నాకు అసలు కనబడవు, నేను వినేది కేవలం మీ స్వరమును మాత్రమేయైయున్నది. నేను మీ ప్రాతినిథ్యమును మాత్రమే చూస్తాను.

నేను మీతో అనేక విషయాలను చెప్పడానికి ఎంతగానో పరితపించాను. నా హృదయము ఉత్సాహముతో ఉబుకుచున్నది. మన పెండ్లి విందు కొరకు, మనం కలిసి ఉండే మన వెయ్యేండ్ల-పాలన కొరకు నేను ఎంతగా ఎదురుచూశానో. మనం కలిసి ఉండే మన భవిష్యత్తు గృహము గురించి వివరంగా మీతో చెప్పడానికి; ఏ విధంగా సమస్తమును మీ కొరకు సిద్ధపరిచానో, ప్రతిదానిని మీకు నచ్చినట్లుగా ఎలా సిద్ధపరిచానో చెప్పడానికి ఎంతగా ఎదురుచూశానో.

నా ప్రియమైనవారలారా, ఇప్పుడు నా స్వరము మీతో మాట్లాడుటను వినడం అద్భుతంగా ఉందని మీరనుకుంటే, కేవలం వేచియుండండి, మనము కలిసి ఆ పట్టణములో జీవించినప్పుడు ఎలాగుంటుంది అనేదానికి ఇది కేవలం ఒక ఛాయ మాత్రమే. మీ ప్రవక్త కూడా మీ ఇంటి ప్రక్కనే నివసిస్తాడు; అతడు మీకు పొరుగువాడైయుంటాడు.

మనము ఆ బంగారు వీధులలో నడుస్తూ మరియు కలిసి ఆ ఊట నుండి త్రాగుతాము. దేవదూతలు భూమిపై ఎగురుతూ, జయగీతములను పాడుతుండగా మనము దేవుని పరదైసులలోనికి నడిచి వెళ్తాము….అది ఎటువంటి ఒక రోజుగా ఉంటుంది కదా!

మార్గము కరుగుగా అనిపిస్తుందని, మరియు కొన్నిసార్లు మీకు అది చాలా కష్టముగా మారుతుందని నాకు తెలుసు, కానీ మనము ఒకరితోనొకరము కలిసి ఉన్నప్పుడు, అది చాలా, చాలా స్వల్పమైనదిగా అనిపిస్తుంది.

ఇప్పటికైతే, నేను మిమ్మల్ని మరొకసారి సమకూర్చి మరియు ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, మీతో మాట్లాడి, మరియు “పరలోకపు పెండ్లికుమారుడు మరియు భూలోకపు పెండ్లికుమార్తె యొక్క భవిష్యత్తు గృహము” గురించి అంతా మీకు చెప్పబోతున్నాను. అప్పుడు మీతో ఐక్యమవ్వడానికి నేను వేచియుండలేకపోతున్నాను.

గుర్తుంచుకోండి, మరియు ఎన్నడూ మర్చిపోకండి, నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను.

ఆయన తరఫున,

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

లేఖనములు:

పరిశుద్ధ. మత్తయి 19:28
పరిశుద్ధ. యోహాను 14: 1-3
ఎఫెసీ 1:10
2 పేతురు 2:5-6 / 3వ అధ్యాయము
ప్రకటన 2:7 / 6:14 / 21:1-14
లేవీయకాండము 23:36
యెషయా 4వ అధ్యాయము / 28:10 / 65:17-25
మలాకీ 3:6