
ప్రియమైన నినెవె ప్రయాణస్తులారా,
తండ్రీ, నీ శరీరము ఎక్కడున్నదో, అక్కడ నీ పక్షిరాజులు కూడుకొనుచున్నవి. నీయొక్క దైవికమైన మన్నాతో నీవు మమ్మల్ని పోషిస్తున్నావు. మాకు నిజముగా అవసరమైనదానిని మా అంతరాత్మలకు దయచేయుము. తండ్రీ, మేము నీ కొరకు దప్పిగొనుచున్నాము. మేము నీ చేతులలో ఉన్నాము.
మేము నీ సన్నిధిలో ఉన్నాము, నీ స్వరము వినుట ద్వారా పరిపక్వము చెందుచున్నాము. వధువైయున్నవారు తమ నిర్ణయమును తీసుకొని మరియు తేల్చుకోవలసియున్నారు. అది సరియా కాదా అని గ్రహించవలసియున్నారు. వధువు చేయవలసిన అత్యంత ప్రాముఖ్యమైన పని అదియేనా కాదా? నీయొక్క నిర్ధారించబడిన స్వరమును వినడమనేది నీ వధువు చేయవలసిన ప్రాముఖ్యమైన విషయమా కాదా? అది సరియైనదైతే, మనము దానిని చేద్దాము. ఇక ఎంతమాత్రము వేచియుండకండి, ఏది సత్యమో ఏది సరియైనదో ఇప్పుడు కనుగొనండి, మరియు సరిగ్గా దానితో నిలిచియుండండి. అది సత్యమని మేమెరుగుదుము, అది ఈ దినమునకై నీవు ఏర్పాటు చేసిన మార్గమని మేమెరుగుదుము.
నేను ఈ విధంగా కేక వేయవలసియున్నది, “సింహము గర్జించెను, భయపడనివాడెవడు? దేవుడు ఆజ్ఞ ఇచ్చియున్నాడు, ప్రవచింపకుండువాడెవడు?” మేము దానిని వాక్యములో చూస్తున్నాము. నీవు దానిని వాగ్దానము చేసియున్నావు. మౌనముగానుండి ఊరకుండువాడెవడు?
మాకు ప్రఖ్యాతిగాంచిన ఆలోచన వద్దు. మాకు సత్యము కావలెను. మరియు మేము, మేము (కోరుచున్నాము) దేవుడు సత్యమని చెప్పినదానిని గాక మేము—వేరే దేనినీ స్వీకరించగోరడంలేదు.
మీరు ఏ ఓడలో ఉన్నారో నిర్ణయించుకోవలసిన సమయము వచ్చియున్నది. మీరు నేరుగా మనుష్యకుమారుని నుండి పలుకబడిన మాటను వింటున్నారా, లేదా వేరే దేనినో వింటున్నారా? ఆయనయొక్క వధువుగా ఉండుటకు మీరు వేరే స్వరములను వినవలసియున్నదని ఎవరైనా మీకు చెప్పుచున్నారా? మీ గృహములలో లేదా మీ సంఘములలో టేపులు ప్లే చేయడమనేది వధువు చేయవలసిన అత్యంత ప్రాముఖ్యమైన పని కాదని చెప్పుచున్నారా?
మీరు ఎవరి స్వరమును వింటున్నారు? మీకు చెప్పుచున్న ఆ స్వరము ఏ స్వరము? మీయొక్క, మరియు మీ కుటుంబముయొక్క నిత్యమైన గమ్యమును మీరు ఏ స్వరముపై ఉంచుతున్నారు?
అది నేను కాదు, అది ఏడవ దూత కాడు, ఓ, కాడు; అది మనుష్యకుమారుడు ప్రత్యక్షపరచబడుటయైయున్నది. అది ఒక వర్తమానికుడు, మరియు అతని వర్తమానము కాదు; అది దేవుడు విప్పినట్టి మర్మమైయున్నది. అది ఒక మానవుడు కాదు; అది దేవుడే. ఆ దూత మనుష్యకుమారుడు కాడు; అతడు కేవలం మనుష్యకుమారుని వద్దనుండి వచ్చిన వర్తమానికుడైయున్నాడు. మనుష్యకుమారుడు క్రీస్తైయున్నాడు; మీరు పోషించబడుచున్నది ఆయన పైనే. మీరు ఒక మనుష్యుని మీద పోషించబడుటలేదు; ఒక మానవుడైతే, అతని మాటలు విఫలమౌతాయి. కానీ మీరు మనుష్యకుమారుని యొక్క విఫలముకాని వాక్య-దేహముపై పోషించబడుచున్నారు.
మొదటిగా ఆ స్వరమును, మనుష్య కుమారునియొక్క విఫలము కాని వాక్య-దేహముగా, మీ ముందు ఉంచనటువంటి ఏ స్వరమునైనా వినకండి. వారు ప్రసంగించగలరు, బోధించగలరు, మరియు దేవుడు వారిని దేనికొరకు పిలిచాడో దానంతటినీ చేయవచ్చును, కానీ మీరు వినవలసిన అతిముఖ్యమైన స్వరము వారిది కాదు.
వారు దానిని నమ్మినట్లైతే, మీరు కూడుకున్నప్పుడు వారు ఆ స్వరమును ప్లే చేసి మరియు ఇట్లు చెప్తారు, “టేపులలో ఉన్న, ఈ స్వరమే, వినవలసిన అతిముఖ్యమైన స్వరము. అదే మరియు అది మాత్రమే, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుయైయున్నది.”
మీరు ఏ స్వరముతో ప్రేమలో ఉన్నారు? ఎందుకని ఆయన స్వరము రికార్డు చేయబడి మరియు భద్రపరచబడటాన్ని మనము కలిగియున్నాము? మన దినమునకైన వాక్యమును మాట్లాడుటకు దేవుడు ఎవరి స్వరమును ఎన్నుకున్నాడు?
ఆ దిగువకు వెళ్ళి మరియు ఆ వర్తామనమును చెప్పుటకు ఆయన నియమించినవాడైన, ఆయనయొక్క ఏర్పాటు చేయబడిన ప్రవక్త ద్వారా, ఇప్పుడు, ఆయన వేరొక ప్రవక్తను పంపించవచ్చును అన్నట్లు అగుపించినది, కానీ ఆయన యోనాను నియమించాడు, మరియు ఏలీయా అయినాసరే దానిని చేసియుండలేడు, యిర్మియా దానిని చేసియుండలేడు, మోషే దానిని చేసియుండలేడు, నినెవెకు వెళ్ళవలసినది యోనాయే. అది అంతే. ఆయన అతనికి ఆజ్ఞ ఇచ్చి మరియు వెళ్ళమని చెప్పాడు. మరియు, “యోనా, అక్కడికి వెళ్ళుము, నినెవెకు వెళ్ళుము,” అని ఆయన చెప్పినప్పుడు యోనా తప్ప దానిని చేయగలిగేవారు ఎవ్వరూ లేరు.
దేవుడు మనల్ని జీవమునకై ముందుగా ఏర్పరచుకున్నాడు. ఈ స్వరము మనతో నిత్యజీవము మాటలను పలుకుతుంది. మనకైతే, ఇదే దేవుడు ఏర్పాటు చేసిన మార్గమైయున్నది. ఇదే మన ఓడయైయున్నది. మీరు తర్షీషునకు వెళ్ళే ఓడలో ఉన్నట్లైతే, ఎంతో ఆలస్యమైపోకముందే దానిలోనుండి దిగండి.
మీరు ఆలోచిస్తూ, లేదా ఏ వైపుకు వెళ్ళాలి లేదా ఏమి చేయాలనేదాని గురించి ఏవైనా ప్రశ్నలు కలిగియున్నయెడల, వచ్చి మాతో కూడా పాల్గొనండి. మాతోపాటు ఓడలోనికిరండి. కేక వేయడానికి, మేము నినెవెకు వెళ్ళుచున్నాము. వారు వెళ్ళగోరినయెడల మేము ఆ తర్షీషు ఓడను వెళ్ళనిచ్చుచున్నాము. మేము దేవునియెదుట ఒక కర్తవ్యమును కలిగియున్నాము, అది మేము బాధ్యతకలిగియున్న ఒక వర్తమానమైయున్నది.
టేపులు ప్లే చేయనటువంటి ఒక సంఘమునకు మీరు వెళ్ళుచున్నట్లైతే అది తర్షీషుకు వెళ్ళే ఓడ అని నేను చెప్పడంలేదు, కానీ ఎవరైనాసరే టేపులలో ఉన్న దేవునియొక్క స్వరమును మీరు వినవలసిన ప్రాముఖ్యమైన స్వరముగా ఉంచనియెడల, అప్పుడు మీరు మీ ఓడయొక్క చుక్కాని వద్ద ఎవరు ఉన్నారన్నది మరియు మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారన్నది సరిచూసుకోవడం మంచిది.
ఈ ఆదివారము, జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M. గంటల సమయమప్పుడు, మన ఓడయొక్క నాయకుడు మనతో మాట్లాడుచు మరియు: ప్రభువు సన్నిధినుండి పారిపోవుచున్న ఒక మనుష్యుడు 65-0217 అనే వర్తమానమును మనకు అందించుచుండగా మాతో చేరమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.
మనము ఈ ఉజ్జీవమును సరిగ్గా ప్రారంభించుదాము. సరిగ్గా! మీరు దేనికై వేచియుంటున్నారు? ప్రభువుయొక్క రాకడ సమీపములో ఉన్నదని మనము నమ్ముచున్నాము గదా, మరియు ఆయన ఒక వధువును కలిగియుండబోవుచున్నాడు, మరియు ఆమె సిద్ధముగా ఉన్నది. మరియు ఏ తర్షీషునకైనా వెళ్ళుచున్నట్టి ఏ ఓడలు మనకు వద్దు. మనము నినెవెకు వెళ్ళుచున్నాము. హహ్! మనము మహిమలోనికి వెళ్ళుచున్నాము. ఆమేన్. అది నిజము. దేవుడు ఎక్కడైతే ఆశీర్వదించబోవుచున్నాడో మనము అక్కడికి వెళ్ళుచున్నాము, మరియు మనము దానినే చేయగోరుచున్నాము.
Bro. Joseph Branham
Scriptures to read:
Jonah 1:1-3Malachi 4
St John 14:12
Luke 17:30