ఆదివారం
03 ఆగస్టు 2025
65-1205
జరుగనైయున్న సంగతులు

దేవునియొక్క ప్రియమైన గుణలక్షణములారా,

ఈ వర్తమానములో పలుకబడిన ప్రతియొక్క మాట ఆయనయొక్క వధువునకు ఒక ప్రేమ లేఖయైయున్నది. పరలోకమందున్న మన తండ్రి, మనము ఆయనయొక్క వాక్యమును చదవాలని మాత్రమే కాదు గాని, ఆయన: “మీరు నాయొక్క సజీవమైన పత్రికయైయున్నారు, నేను లోకానికి ప్రదర్శించగలిగే, నాయొక్క సజీవమైన గుణలక్షణమైయున్నారు,” అని మనతో చెప్పగలుగునట్లు ఆయనయొక్క స్వరము మన హృదయములతో మాట్లాడుటను మనము వినాలని కోరేంతగా మనల్ని ప్రేమిస్తున్నాడని ఆలోచించుటకే ఎట్లున్నది కదా.

పిదప ఇక్కడ భూమి మీద ఆయన చేసిన త్యాగములన్నిటి తర్వాత, ఆయన జీవించిన జీవితము తర్వాత, ఆయన నడచిన మార్గము తర్వాత, ఆయన కేవలం ఒక్క విషయం కొరకు అడిగాడని ఆలోచించుటకే ఎట్లున్నది కదా:

“నేను ఉండు స్థలములో, వారును ఉందురు గాక.” ఆయన మన సహవాసము కొరకు అడిగాడు, ప్రార్థనలో ఆయన తండ్రిని కోరిన ఒకేఒక్కటి అదేయైయున్నాది, ఎప్పటికీ మీయొక్క స్నేహము.

నేను అనగా, “ఆయనయొక్క వాక్యము” ఉండు స్థలములో, మనమును ఉండాలనియైయున్నది, ఎప్పటికీ, ఆయనయొక్క సహవాసమును, ఆయనయొక్క స్నేహమును పొందుకొనుటకైయున్నది. కావున, ఆయనయొక్క కన్యక వాక్య వధువుగా ఉండుటకు టేపులలో ఆయన మనతో మాట్లాడిన ప్రతి మాట ప్రకారముగా మనము జీవించవలసియున్నాము, అది మనల్ని పెండ్లి కుమారునిలో భాగముగా చేస్తుంది.

అది ఈ గడియలో యేసుక్రీస్తుయొక్క ప్రత్యక్షతయైయున్నది. వేరొక గడియలో ఆయన ఏమైయున్నాడో కాదు, ఇప్పుడు ఆయన ఎవరైయున్నాడు అనేదియైయున్నది. ఈ దినమునకైన వాక్యము. ఈ దినమున దేవుడు ఎక్కడ ఉన్నాడు. అదియే ఈ దినమునకైన ప్రత్యక్షతయైయున్నది. అది ఇప్పుడు వధువులో ఎదుగుచున్నది, మనలను పరిపూర్ణ కుమారులు మరియు కుమార్తెలయొక్క రూపములోనికి తెచ్చుచున్నది.

మనల్ని మనము ఆయనయొక్క వాక్యములో చూసుకొనుచున్నాము. మనము ఎవరమో మనకు తెలుసు. మనము ఆయనయొక్క ప్రణాళికలో ఉన్నామని మనకు తెలుసు. ఇది ఈ దినమునకై దేవుడు ఏర్పాటు చేసిన మార్గమైయున్నది. ఎత్తబడుట సమీపములో ఉన్నదని మనకు తెలుసు. త్వరలో మన ప్రియులు ప్రత్యక్షమవుతారు. అప్పుడు మనము దీనిని ఎరుగుతాము: మనము చేరుకున్నాము. మనమందరము పరలోకమునకు వెళ్ళుచున్నాము…అవును, పరలోకము, సరిగ్గా ఈ స్థలము ఎంత వాస్తవమైనదో అంతే వాస్తవమైన ఒక స్థలము.

మనము ఎక్కడైతే పనులు చేయబోవుచున్నామో, ఎక్కడైతే జీవించబోవుచున్నామో అటువంటి ఒక నిజమైన స్థలమునకు మనము వెళ్ళబోవుచున్నాము. మనము పని చేయబోవుచున్నాము. మనము ఆనందించబోవుచున్నాము. మనము జీవించబోవుచున్నాము. మనము జీవమునకు, ఒక వాస్తవమైన నిత్యజీవమునకు వెళ్ళుచున్నాము. మనము పరలోకమునకు, ఒక పరదైసుకు వెళ్ళుచున్నాము. పాపము ప్రవేశించకముందు ఏదెను తోటలో, సరిగ్గా ఆదాము మరియు హవ్వ పనిచేసి, జీవించి, మరియు తినుచు, మరియు ఆనందించినట్లే, మనము తిరిగి సరిగ్గా అక్కడికే, సరిగ్గా, సరిగ్గా ఆ వెనుకకు మన దారిలో ఉన్నాము. మొదటి ఆదాము, పాపము ద్వారా, మనల్ని బయటకు తీసుకెళ్ళాడు. రెండవ ఆదాము, నీతి ద్వారా, మనల్ని తిరిగి లోపలకు తీసుకొనివస్తున్నాడు; మనల్ని నీతిమంతులుగా తీర్చి మరియు తిరిగి లోపలికి తీసుకొనివస్తాడు.

ఇది మనకు ఎంత విలువైనదో మాటలలో ఎవరైనా ఎలా చెప్పగలరు? మనము ఎక్కడైతే కలిసి నిత్యత్వమంతా జీవించగలమో అటువంటి పరదైసుకు మనము వెళ్ళుచున్నాము అనేదానియొక్క వాస్తవికత. ఇక ఏ విచారమైనా, నొప్పియైనా లేదా బాధయైనా ఉండదు, కేవలం పరిపూర్ణతపై పరిపూర్ణత.

మన హృదయములు సంతోషించుచున్నవి, మన అంతరంగములో మన అంతరాత్మలు మండుచున్నవి. ప్రతి రోజు సాతానుడు మన మీద ఇంకా ఇంకా ఎక్కువ ఒత్తిడిని పెట్టుచున్నాడు, కానీ అయినను మనము సంతోషిస్తాము. ఎందుకు:

• మనము ఎవరమో, మనకు తెలుసు.
• మనము ఆయనను, విఫలపరచలేదని, మరియు విఫలపరచమని, మనము ఎరిగియున్నాము.
• మనము ఆయనయొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉన్నామని, మనము ఎరిగియున్నాము.
• తన వాక్యముయొక్క నిజమైన ప్రత్యక్షతను ఆయన మనకు అనుగ్రహించాడని, మనము ఎరిగియున్నాము.

సహోదరుడా జోసఫ్, నీవు ప్రతీ వారము ఒకే విషయమును వ్రాస్తావు. మహిమ, నేను దానిని ప్రతీ వారము వ్రాస్తాను ఏలయనగా ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడనేది మీరు తెలుసుకోవాలని ఆయన కోరుచున్నాడు. మీరు ఎవరు. మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారు అనేది తెలుసుకోవాలని కోరుచున్నాడు. ఛాయ నిజస్వరూపముగా మారుచున్నది. మీరు వాక్యముగా మారుచున్న వాక్యమైయున్నారు.

ప్రియమైన ప్రపంచమా, ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు వచ్చి, అనుసంధానములో మాతో చేరండి, “నేను” మిమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు కాదు, కానీ “ఆయన” మిమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకై యున్నది. “నేను” టేపును ఎన్నుకున్నందుకు కాదు, కానీ ప్రపంచవ్యాప్తంగానున్న వధువులోని భాగముతోకలిసి అందరమూ ఒకే సమయములో వాక్యమును వినుట కొరకైయున్నది.

ప్రపంచవ్యాప్తంగా వధువు, అందరూ ఒకే సమయములో దేవునియొక్క స్వరమును వినడము సాధ్యపడుతుందని మనము గ్రహించగలమా? అది దేవుడైయుండవలసి యున్నది. దేవుడు తన దూతయైన ప్రవక్త ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అతనిచేత దానిని జరిగించాడు. అందరూ అదే జఫర్సన్విల్ కాలమానం ప్రకారముగా, 9:00, 12:00, 3:00 గంటల సమయమప్పుడు ప్రార్థనలో ఐక్యమవ్వడానికి, అతడు వధువును ప్రోత్సహించాడు; దేవునియొక్క స్వరము వారందరితో ఒకే సమయములో మాట్లాడుటను వినడానికి వధువు ఒక్కటిగా ఐక్యమవ్వగలగడం, ఇప్పుడది ఇంకెంత గొప్పగా ఉన్నది కదా?

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

వర్తమానము: జరగనైయున్న సంగతులు 65-1205

 

లేఖనములు:

పరిశుద్ధ. మత్తయి 22:1-14

పరిశుద్ధ. యోహాను 14:1-7

హెబ్రీ 7:1-10