ఆదివారం
14 జులై 2024
65-0711
సిగ్గుపడుట

ప్రియమైన సిగ్గుపడని వధువా,

ఈ దినము వంటి సమయమైనా లేదా ప్రజలైనా ఎన్నడూ లేరు. మనము ఆయనలో ఉన్నాము, ఆయన మన కొరకు కొన్నదానంతటికీ వారసులమైయున్నాము. ఆయన తన పరిశుద్ధతను మనతో పంచుకుంటున్నాడు, ఎంతగా అంటే, ఆయనలో మనము స్వయంగా దేవునియొక్క నీతి అయ్యాము.

మనము ఆయనయొక్క వధువు అవుతామని, దైవ నిర్ణయము ద్వారా ఆయన మనలను ముందుగానే ఎరిగియున్నాడు. ఆయన మనలను ఎన్నుకున్నాడు, మనమెన్నడూ ఆయనను ఎన్నుకోలేదు. మనంతట మనము రాలేదు, అది ఆయనయొక్క ఎన్నికయైయున్నది. ఇప్పుడు ఆయన తన వాక్యమును గూర్చిన సంపూర్ణ ప్రత్యక్షతను మన హృదయములోను మరియు మన అంతరాత్మలోను పెట్టాడు.

దినము వెంబడి దినము, ఆయన మనకు తన వాక్యమును బయలుపరచుచున్నాడు, తన ఆత్మను మనపై కుమ్మరించుచున్నాడు, స్వయంగా ఆయనయొక్క జీవమునే మనలో ప్రత్యక్షపరచుచున్నాడు. ఆయనయొక్క వాక్యముతో నిలిచియుండుట ద్వారా, ఆయన స్వరమును వినుట ద్వారా, వారు ఆయనయొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉన్నారని ఎరిగియుండి ఆయనయొక్క వధువు ఇంత కంటె ఎక్కువగా ఎన్నడూ లంగరు వేయబడిలేదు.

దేవునియొక్క ప్రేమ మరియు ఈ వర్తమానము పొంగి పొర్లుచుండెంతగా మన హృదయములలో నిండుచున్నవి. ఇది గాక మనము వినగోరేది, మాట్లాడగోరేది, సహవాసము కలిగియుండగోరేది మరేదియు లేదు, లేదా మనమప్పుడే వినిన ఒక కొటేషన్ ను పంచుకొని మరియు ప్రభువును స్తుతించాలన్న ఇది గాక మరేదియు లేదు.

మనము మోషేవలె ఎడారి వెనుక భాగమున ఉన్నాము. మనము సర్వశక్తిమంతుడైన దేవుని సముఖమునకు వచ్చాము, మరియు ఆ స్వరము మనతో మాట్లాడుటను మనము చూస్తున్నాము; అది వాక్యముతోను మరియు ఈ ఘడియయొక్క వాగ్దానముతోను ఖచ్చితంగా సరితూగుచున్నది. అది మనకు దేనినో చేసినది. మనము దాని విషయమై సిగ్గుపడటంలేదు. దానిని లోకానికి ప్రకటించుటకు మనము ఇష్టపడుచున్నాము. ప్రభువైన యేసు ఈ ఘడియయొక్క వర్తమానమైయున్నాడని మరియు మనము ఆయనయొక్క వధువైయున్నామని మనము నమ్ముచున్నాము.

ఆయనయొక్క వాక్యముతో ఆయన మనకు కంచెను వేశాడు. ఇదే దేవుడు ఏర్పాటు చేసిన మార్గమైయున్నదనుటలో ఎటువంటి సందేహము లేదు. దేవుడు తన వాక్య విషయమై తన మనస్సును ఎన్నడూ మార్చుకోడు. ఆయనయొక్క వధువును బయటకు పిలిచి, మరియు పిదప ఆమెను వాక్య వరుసలో ఉంచుటకు ఆయన ఏడవ దూత వర్తమానికుణ్ణి ఎన్నుకున్నాడు.

ఆయన మరియు ఆయనయొక్క వాక్యము తప్ప ఈ జీవితములో ఇంకేదియు లేదు. మనము దానిని ఎంతగానో ప్రేమించుచున్నాము. అది మనకు జీవము కంటే విలువైనది. సర్వశక్తిమంతుడైన దేవుని శక్తి మరియు సువార్త ముందెన్నడూ లేనివిధంగా ప్రపంచమంతటికీ వ్యాపించినది. వాక్యము ఇప్పుడు వధువుయొక్క చేతులలో ఉన్నది మరియు ఆమె చెవిన పడినది. దేవుడు ఒక వధువును పిలుచుచు, మరియు దయ్యము ఒక సంఘమును పిలుచుచున్న, వేర్పాటు సమయము ఇప్పుడు జరుగుచున్నది.

ప్రభువా, మేము నిన్ను మరియు నీ వాక్యమును ప్రేమించుచున్నాము. మాకు అది ఎంతైనా సరిపోదు. మేము అనుదినము నీ వాక్యముయొక్క సన్నిధిలో కూర్చొని, పరిపక్వము చెందుతూ, నీ యొక్క త్వరితమైన రాకడ కొరకు సిద్ధపడుచున్నాము. తండ్రీ, అది అతిత్వరలోయై యుండవలసియున్నది. ప్రభువా, మేము దానిని అనుభూతి చెందగలుగుచున్నాము. గొప్ప ఎదురుచూపుతో మేము వేచియుంటున్నాము.

తండ్రీ, మేము ఇంకా యదార్థంగా ఉండి మరియు మా ప్రమాణాలను పునఃప్రారంభం చేయుదుము గాక. నీ వాక్యమందు మాకున్న విశ్వాసము మా హృదయములో మండుచున్నదని మాకు తెలియును. నీవు సందేహములన్నిటినీ తొలగించివేసితివి. నీ వాక్యము తప్ప మరేదియు లేదు. మేము నిశ్చయతను కలిగియున్నాము, మరియు మేము నీయొక్క టేపు వధువైయున్నామని, లోకానికి చెప్పుటకు మేము సిగ్గుపడటంలేదు.

ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు మేము ఈ వర్తమానమును వింటుండగా, వచ్చి మాతో కలిసి వినవలెనని నేను ప్రపంచమును ఆహ్వానించగోరుచున్నాను: సిగ్గుపడుట 65-0711.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

వర్తమానమును వినుటకు ముందు చదువవలసిన లేఖనములు:

పరిశుద్ధ. మార్కు 8:34-38