
ప్రియమైన ఆనందభరితమైన వధువా,
మనము జీవిస్తున్న దినమును మరియు ఘడియను కనుగొనడానికి ప్రార్థనలో మరియు విన్నపములలో మనము మన ముఖములను పరలోకము తట్టునకు త్రిప్పుకొనియుంచాము.
ముందెన్నడూ లేని విధంగా, ప్రపంచ వ్యాప్తంగా, మనము కలిసి పరలోక స్థలములలో కూర్చొనియున్నాము, ఆయనయొక్క బలిష్ఠుడైన వర్తమానికుడైన దూత ద్వారా దేవుడు మనతో మాట్లాడి మరియు ఆయనయొక్క వాక్యమును బయలుపరచుటను మనము వినుచున్నాము. అతడు ఆయనయొక్క వధువునకు ఆయనయొక్క వాక్యమును బయలుపరచడానికి తండ్రి పంపించినటువంటి భూలోక వర్తమానికుడైన దూతయైయున్నాడు.
గాబ్రియేలు దేవునియొక్క ఎన్నుకోబడినవారికి, యూదులకు దూతయైయున్నాడు. కానీ ఆయనయొక్క అన్య వధువుకైతే, మెల్కీసెదెకు తానే వచ్చి మరియు విలియమ్ మారియన్ బ్రెన్హామ్ అనే పేరుగల మానవ గుడారములోనుండి మాట్లాడినాడు, తద్వారా ఆయన మాట్లాడి మరియు ఆయనయొక్క ప్రియమైన వధువునకు ఆయనయొక్క వాక్యమంతటినీ బయలుపరచగలుగుటకై యున్నది.
కాలముయొక్క అంతమువరకు ప్రతి దినములోని ప్రతి నిమిషము, ఆయనయొక్క ఆత్మీయ ఆహారమును, దాచబడిన మన్నాను, వధువు ఆమెయొక్క వ్రేళ్ళమీదనే కలిగియుండునట్లు ఆయన దానిని రికార్డు చేపించాడు, దాచిపెట్టాడు, మరియు భద్రపరిచాడు.
దేవునియొక్క స్వరము ఆయనయొక్క వాక్యమును మనకు బయలుపరచడాన్ని మనము వినుచుండగా మన అంతరంగము ఎంతటి అభిషేకముతో నింపబడినది కదా. మనము తేటగా చూసి మరియు దానియొక్క అర్థమును గ్రహించునట్లు ఆయన ఆయనయొక్క వాక్యమును ఏ విధంగా విప్పుతాడు కదా. అది సరిగ్గా మనం జీవిస్తున్న ఘడియనే బయలుపరచుచున్నది, మనము ఎవరమైయున్నామని మరియు అతి త్వరలో ఏమి జరుగనైయున్నదని మనకు చెప్పుచున్నది; త్వరలో జరుగనైయున్న మన ఎత్తబడుట గురించి చెప్పుచున్నది.
మనము ఆయనతో పెండ్లి విందులో ఉండగా భూమి మీద ఏమి జరుగును అనేది కూడా ఆయన తన వధువునకు బయలుపరచుచున్నాడు. ఆయన తనయొక్క ఎన్నుకోబడినవారి గ్రుడ్డి కన్నులను ఏ విధంగా తెరుస్తాడు కదా, వారు ఆయనయొక్క అన్య వధువు నిమిత్తము ఆయనచేత గ్రుడ్డివారిగా చేయబడిన ప్రజలైయున్నారు.
నా స్నేహితులారా, మనము ఈ లోకముతో ఎంతో విసిగిపోయి మరియు ఆయనయొక్క రాకడ మనల్ని తీసుకెళ్ళిపోవుటకు పరితపించుచున్నామని నాకు తెలుసు, అయితే సరిగ్గా ఇప్పుడు సరిగ్గా మన కన్నుల యెదుట జరుగుచున్నదానియందు మనము ఆనదించుదాము.
మనం మన చేతులను, మన హృదయములను, మన స్వరములను పైకెత్తి మరియు ఆనందించుదాము. అతి త్వరలో ఆయన మన కొరకు ఏమి చేయనైయున్నాడు అనేదానికై ఎదురుచూడటం మాత్రమే కాదు గానీ, ఆయన సరిగ్గా ఇప్పుడు ఏమి బయలుపరచుచున్నాడు మరియు మన కొరకు ఏమి చేస్తున్నాడు అనేదాని గురించి ఆనందించుదాము.
మనము ఆయనతో మరియు ఆయనయొక్క వాక్యముతో ఐక్యమగుచున్న ఆయనయొక్క ముందుగా నిర్ణయించబడిన వధువైయున్నామని ఆయన మనకు చెప్పుచున్నాడు. మనము ఆయనయొక్క స్వరముతో, ఆయనయొక్క వాక్యముతో, ఆయనయొక్క దూతతో నిలిచియుండుట ద్వారా, ఆయనయొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉన్నామని, ఆయన మరలా మరలా మనకు నిశ్చయతను ఇస్తున్నాడు. మనము ఎవరమైయున్నామని ఎరుగుటలో మరియు గుర్తించుటలో ఆయన మనకు విశ్వాసమును అనుగ్రహించాడు:
ఆయనయొక్క వాక్యము శరీరములో జీవించుచున్నది.
మనము భయపడటానికి ఏదియు లేదు; చింతించడానికి ఏదియు లేదు; బాధపడటానికి ఏదియు లేదు. నాకు అది ఎలా తెలుసు? దేవుడు ఆలాగున చెప్పాడు! కావున మనము ఆనందించుదాము, సంతోషముగా ఉందాము, కృతజ్ఞత కలిగియుందాము; సజీవ వాక్యము మనలో జీవించుచు నివసించుచున్నది. మనము ఆయనయొక్క అతీతమైన రాజ సంతానమైయున్నాము.
సమయము సమీపించియున్నదని మరియు ఆయనయొక్క వాక్యమునకు నమ్మకముగాను విశ్వాసనీయముగాను ఉంటూ మనల్ని మనము సిద్ధపరచుకొనియున్నామని ఎరిగియుండుటకు ప్రభువు కూడా ఉత్సాహభరితుడైయుంటాడని నేను నిజముగా నమ్ముచున్నాను.
ఆ చిన్న అబ్బాయి మొట్టమొదటిసారి అద్దములో చూసుకున్నట్లే, మనము ఆయనయొక్క వాక్యములోనికి చూస్తున్నాము, మనము ఎవరమన్నది చూస్తున్నాము. ప్రభువా…అది నేనే. నేను నీయొక్క సజీవ వాక్య వధువునైయున్నాను. నేను నీవు ఎన్నుకున్నదాననైయున్నాను. నేను నీలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావు, మనము ఒక్కటైయున్నాము.
మనము ఉత్సహించకుండా ఎలా ఉండగలము మరియు భూమి మీద నివసించినట్టి అత్యంత సంతోషకరమైన ప్రజలుగా కాకుండా ఎలా ఉండగాలము? మనకు ముందున్న పరిశుద్ధులు మరియు ప్రవక్తలందరూ ఈ దినములో జీవించి మరియు ఈ వాగ్దానములను చూడగోరారు. అయితే దేవుని కృప ద్వారా, ఆయన మనల్ని ఇక్కడ ఉంచాడు.
మనము వేచియుండలేము:
బర్! మై! ఫ్యూ! ఇంకో మాటలో చెప్పాలంటే, శత్రువు బంధించబడినప్పుడు, పాపముయొక్క అంతము వచ్చియున్నది, నిత్యమైన నీతి తీసుకొనిరాబడుట వచ్చియున్నది, సాతానుడు అగాధములో ముద్రవేయబడియున్నాడు, మరియు సముద్రము జలముతో నిండియున్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఆమేన్! దేవునికి మహిమ! అది వచ్చుచున్నది, సహోదరుడా, అది వచ్చుచున్నది!
ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, వధువుకు దేవుని స్వరమైయున్న, దేవుని దూత: గాబ్రియేలు దానియేలును దర్శించడానికి గల ఆరు కారణాలు 61-0730E అనే వర్తమానమును మనకు అందించుటను వినడానికి, ప్రపంచవ్యాప్తంగా మనము కూడుకొనుచుండగా ఎటువంటి అభిషేకము చోటుచేసుకుంటుంది కదా.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్