
భూమికి ఉప్పైయున్న ప్రియమైనవారలారా,
ఓ ప్రియమైన వధువా, పరలోక స్థలములలో కూర్చొని, వాక్యముయొక్క సన్నిధిలో, పరిపక్వము చెందుతూ, మనము ఎవరమని, మనము ఎక్కడ నుండి వచ్చామని, మరియు మనము ఎక్కడికి వెళ్ళుచున్నామనేదానిని గుర్తిస్తూ మనము ఎటువంటి సమయమును కలిగియుంటున్నాము కదా.
మన హృదయలోతుల నుండి, ఇప్పుడు మనము దేవునియొక్క కుమారులము మరియు కుమార్తెలమై యున్నామని, ఎరుగుట. మనము అవుతాము అని కాదు గాని, మనము ఇప్పుడు అయ్యున్నాము. మనము దేవుని తలంపులయొక్క గుణలక్షణములైయున్నాము.
సాతానుడు మనపై దాడి చేసి, మరియు మన పొరపాట్లను, మన గతమును, మరియు మన అనుదిన వైఫల్యాలను మనకు చూపించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు; వాడి అబద్ధాలతో మన మనస్సులోను మరియు మన ఆత్మలోను మనలను కృంగదీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మనము కేవలం వాడికి గుర్తు చేస్తూ ఇట్లు చెప్తాము, “జగత్తుపునాదికి ముందే, దేవుడు, నన్ను చూశాడు; అవును నన్ను చూశాడు మరియు నన్ను విమోచించుటకు ఆయన యేసును పంపాడు, సాతానా అది నిజము.” ఫాట్!
“ఇప్పుడు సాతనా, నన్ను విడిచి వెళ్ళు, ఎందుకనగా ఆయన కుమారునియొక్క రక్తము నా కొరకు మాట్లాడుచున్నది. నేను పాపము చేయలేను. నా పొరపాట్లు, అవును నా అనేక పొరపాట్లు, అవి దేవునికి అసలు కనిపించవు. ఆయనకు వినబడే ఒకేఒక్కటి ఆయనను ఆరాధిస్తూ మరియు స్తుతించుచున్న నా స్వరము మాత్రమే, మరియు ఆయన చూసే ఒకేఒక్కటి నా ప్రాతినిధ్యమును మాత్రమే.”
తూర్పు మరియు పడమరనుండి, ఉత్తరము మరియు దక్షిణమునుండి ఆయన వధువు కొరకు టేపులో ఆయన అనుగ్రహించిన వాక్యము క్రింద మన ప్రాతినిథ్యము మనలను సమకూర్చుచున్నది. ఆయన ఘనపరిచేది దానిని మాత్రమే; ఏలయనగా అది ఆయన ఏర్పాటు చేసిన మార్గమైయున్నది.
తరువాత ఆయన ఏమి చెప్పబోవుచున్నాడో మరియు ఏమి బయలుపరచనున్నాడో? ఆయన మన ప్రవక్త ద్వారా అనేకసార్లు మాట్లాడి మరియు మన నూతన గృహము ఎలా ఉంటుందో చెప్పడాన్ని మనము విన్నాము, కానీ ఈసారి దాని గురించి మనము ఇంతకుముందెన్నడూ వినని విధంగా అది ఉండబోవుచున్నది.
ఆ దైవికమైన నిర్మాణకుడు తన ప్రియురాలి కొరకు దీనిని రూపొందించాడు. చూశారా? ఓ, దైవీకమైన జీవమునకు కర్తయైన—ఆ దైవీకమైన దేవునిచేత, దైవీకముగా ఎన్నుకొనబడిన ఒక దైవీకమైన గుణలక్షణము కొరకు దైవీక స్వభావము, ఒక దైవీకమైన నిర్మాణకుడు దానిని నిర్మాణము చేసియుండగా, అది ఎటువంటి స్థలముగా ఉంటుందికదా! ఆ పట్టణము ఎలా ఉంటుంది కదా! దాని గురించి ఆలోచించండి.
మనము అస్సలు ఊరకే ఉండలేము. మన ఉత్సాహము మరియు మన ఎదురుచూపులు శిఖరపు ఎత్తులోనున్నవి. దేవుడు నేరుగా మనతో మాట్లాడి మరియు మనము నిత్యత్వమంతా ఆయనతో బ్రతుకునట్లు ఆయన ఇప్పుడు మన నూతన గృహమును రూపొందిస్తూ నిర్మాణిస్తున్నాడని చెప్పుటను వినడానికి మన హృదయములు వేగముగా కొట్టుకొనుచున్నవి.
మనము ఇంకేమి వింటామో, ముందు నిర్ణయము, ప్రాతినిథ్యము, యుగములు, ఎనిమిదవ దినము, పరిశుద్ధ పర్వతము, పిరమిడ్లు, మరియు పరిశుద్ధ సమాజముగా కూడుకొనడం గురించి ఆయన మనకు చెప్తుండగా, ఆదివారమునాడు మనకు ఏమి బయలుపరచబడుతుందో?
సరిగ్గా ఇప్పుడు ఏమి జరుగుచున్నదో దానిని మనము అర్థము చేసుకోగలమా? మన నూతన గృహము ఎలా ఉంటుందో ఆయన మనకు చెప్పగలుగునట్లు దేవుడు ప్రపంచమంతటినుండి ఆయన వధువును సమకూర్చుచున్నాడు. ఆయన మనకు ప్రతీ చిన్న వివరమును చెప్పబోవుచున్నాడు. మనము ఎటువంటి ఒక మహిమకరమైన సమయమును కలిగియుంటాము కదా.
మరో వైపు, మన పోరాటములు ఇంతకన్నా కష్టంగా ఎప్పుడూ లేవు. సాతానుడు ముందెన్నడూ లేని విధంగా మనపై దాడి చేయుచున్నాడు. వాడి దాడులు తగ్గినట్లుగాని లేదా వెళ్ళిపోయినట్లుగాని ఎన్నడూ అగుపించడంలేదు.
అయితే దేవునికి మహిమ, ఆయన వాక్యములో మన విశ్వాసము ఎప్పటికంటెనూ అధికముగా ఉన్నది. మనము కదల్చబడలేనట్లుగా, మనము ఎవరమన్నది ఎరిగియుండుటలోని విశ్వాసము, మన అంతరాత్మలో లోతుగా లంగరువేయబడియున్నది.
మనము భయపడటానికి ఏదియు లేదు; మనము చింతించడానికి ఏదియు లేదు. తండ్రి మనపట్ల పూర్తి బాధ్యతను కలిగియున్నాడు. ఆయన మన ప్రతీ అడుగును నడిపిస్తూ నిర్దేశిస్తాడు. ఆయన మనలను తన అరచేతిలో పట్టుకున్నాడు. సాతానుడు కేవలం ఒక మోసగాడు మాత్రమే, మరి వాడి అంతము సమీపమైనది మరియు వాడు దానిని ఎరిగియున్నాడు. భయపడేది వాడే, దేవునియొక్క పలుకబడిన వాక్యపు వధువుతో వాడు వ్యవహరిస్తున్నాడని వాడికి తెలుసు మరియు వాడు ప్రతీసారి ఓడించబడ్డాడు.
మనము వాక్యమైయున్నాము. ఆదినుండి మనము ఆయనలో ఉండియున్నాము. మనము ఏదో ఒక రోజు ఉండబోవుచున్నాము కాదు, మనము ఇప్పుడు ఉన్నాము. మనము వాక్యమైనయెడల, అప్పుడు మనము వాక్యమును పలుకగలము, కేవలం మనము నమ్మగలిగితే చాలు...మరియు మనము నమ్ముచున్నాము.
నీవు ఒక విశ్వాసివైనా అయ్యుంటావు (వాక్యముగా) లేదా నీవు ఒక సందేహించువాడవైనా అయ్యుంటావు (వాక్యము కానివాడిగా). ఒక్క వాక్యమునైనా నమ్మనటువంటి ఒక్క అణువైనా మన శరీరములలో లేదు. విషయం అదే! మనము వాక్యమైయున్నామని: సాతానుడికి మనము ఋజువు చేశాము. మనము పాదము క్రిందనున్నట్టి చర్మము కావచ్చును, కానీ అయినను మనము శరీరములో భాగమైయున్నాము!!!
కావున ఆ అబద్ధికుడు మనలో ఒకరి వెంటపడినప్పుడు, ప్రపంచమంతటినుండి వధువు కూడివచ్చి మరియు మనము వాడిని వాక్యముతో ఫాట్ ఫాట్ మని కొడతాము.
వ్యాధి మనలో ఒకరిమీదికి వచ్చినప్పుడు, మనము కలిసి కూడివచ్చి మరియు వాడిని ఫాట్ మని కొడతాము! మనలో ఒకరు నిరుత్సాహపడి మరియు దిగులుపడునప్పుడు, మనమంతా ఏమి చేస్తాము? వాడిని ఫాట్ మని కొడతాము!
వధువా, మనము ఇంటికి వెళ్ళుచున్నాము. సమయము వచ్చినది. వధువు తనను తాను సిద్ధపరచుకున్నది. మనము ఓడలో ఉన్నాము. ఆయన తలుపును మూసివేసాడు మరియు మనము సురక్షితముగా లోపల ఉన్నాము. వధువు ఆ మధ్యదారిగుండా నడిచి వచ్చి మరియు పెండ్లి కుమారునితో ఐక్యమగుటకు సంగీతమును మనము వినగలుగుచున్నాము.
1000 సంవత్సరాలు మనము మన హనీ మూన్ లో ఉంటాము, పిదప మనము ఒకరితో ఒకరము ఆయనతో కలిసి మన భవిష్యత్తు గృహముకు వెళ్తాము.
స్నేహితులారా, దానిని తప్పిపోకండి. దేవుని ద్వారా ఏర్పాటు చేయబడి మరియు నిర్ధారించబడిన ఒకేఒక్క మార్గము కలదు: అది టేపులే. అది అగ్నిస్తంభము మాట్లాడుచు మరియు ఆయన వధువును నడిపించుటయైయున్నది.
మీరేమి చేస్తున్నాగాని, ఈ ఆదివారము మీ యెదుట మరియు మీ కుటుంబము యెదుట ఆ స్వరమును ఉంచుకోండి. వినుట వలన, వాక్యమును వినుట వలన విశ్వాసము కలుగును, మరియు వాక్యము ప్రవక్తయొద్దకు వస్తుంది. మన దినమునకు టేపులద్వారా తన వధువుతో మాట్లాడుచున్న ప్రవక్త పరిశుద్ధాత్మయే అయ్యున్నాడు.
వధువులోని భాగము ఏకముగా కూడుకొని, దేవుడు తన బలిష్ఠుడైన దూత ద్వారా మాట్లాడి మరియు: పరలోక పెండ్లికుమారుడు మరియు భూలోక పెండ్లికుమార్తె యొక్క భవిష్యత్తు గృహము 64-0802 గురించి మనందరికీ చెప్పడాన్ని, అందరూ ఒకేసారి వినుచుండగా, ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M. గంటల సమయమప్పుడు మీరు మాతో చేరడానికి మిమ్మల్ని స్వాగతించుచున్నాము.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్