నీటిబుగ్గ నుండి త్రాగే ప్రియమైన వారలారా,
మనము ఎటువంటి క్రిస్మస్ ను మరియు నూతన సంవత్సరమును కలిగియున్నాము కదా. దేవుడు తన వధువుకు పంపిన దేవుని బహుమతులను మనము స్వీకరించి మరియు వాటిని తెరచినాము. మన మొట్టమొదటి కానుక చుట్టబడిన ఆ అతి గొప్ప క్రిస్మస్ కానుకయైయున్నది. దేవుడు తననుతానే మానవ శరీరములో చుట్టుకొని మరియు ఆ మూటను లోకమునకు పంపించాడు. అది ఆయనయొక్క వధువును పునరుద్ధరించడానికి ఆయనయొక్క మొట్టమొదటి గొప్ప కానుకయైయున్నది.
పిదప దేవుడు ఆయనయొక్క వధువు కొరకు మరొక గొప్ప మూటను పంపించాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన మనతో నేరుగా మాట్లాడగలుగునట్లు మరొకసారి శరీరములో వచ్చి మరియు తనను తాను బయలుపరచుకున్నాడు. తన వధువు మరియు తాను ఒక్కటవ్వాలని ఆయన కొరియున్నాడు.
మరియు ఇప్పుడు, స్నేహితులారా, నన్ను తప్పుగా అర్థంచేసుకోకండి. నేను నిత్యత్వమునకు-బద్ధుడనైయున్న వ్యక్తినైయ్యుండి ఏదో ఒక రోజు తీర్పులో మీ యెదుట నిలబడతానని ఎరిగియుండి, నా హృదయములో గౌరవముతో దీనిని చెప్పుదును గాక: వేలాదిమంది ప్రజలు తమ కానుకను తప్పిపోవుచున్నారు. చూశారా? వారు దానిని గ్రహించలేకపోతున్నారు. మరియు వారు చూసి, మరియు, “ఓ, అతడు కేవలం ఒక మనిషి మాత్రమే” అని అంటారు. అది నిజమే. ప్రజలను విడిపించినది మోషేనా లేక దేవుడా? అది మోషేలో ఉన్న దేవుడైయున్నాడు. చూశారా? వారు విమోచకుని కొరకు మొర్రపెట్టారు. మరియు దేవుడు వారికి ఒక విమోచకుడిని పంపినప్పుడు, అది ఒక మానవుడి ద్వారాయైయున్నది గనుక, దానిని చూడటంలో వారు విఫలమయ్యారు, అయితే అది ఆ మనిషి కాదు, అది ఆ మనిషిలో ఉన్న దేవుడైయున్నాడు.
ఈ రోజు, మరొకసారి, వేలాదిమంది ప్రజలు తమ కానుకను తప్పిపోతూ మరియు, “మీరు టేపులను వినాల్సిన అవసరము లేదు, ఇప్పుడు అభిషేకించబడిన ఇతరులు ఉన్నారు” అని అంటున్నారు, మరది సత్యమే, కానీ ఆ వ్యక్తి గుండా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును పలుకుతున్నట్టి దేవునిచేత నిర్ధారించబడిన స్వరము అది మాత్రమేనని చూడటంలో వారు విఫలమవుతున్నారు. ఆ స్వరము దేవునియొక్క ఊరీము తుమ్మీమము అయ్యున్నది, ఈ దినమునకు ఆయనయొక్క అంతిమమైయున్నది.
మనము ఆయన స్వరమును వింటున్నప్పుడు మనము నిజముగా దేవునియొక్క నీటిబుగ్గ నుండి త్రాగుచున్నాము, దానికి ఎటువంటి పంపుకొట్టడం, ఎటువంటి లాగడము, ఎంటువంటి అతుకులు వేయడము, ఎటువంటి సవరణలు చేయడము అవసరము లేదు; పలుకబడిన ప్రతీ మాట మీద మనము కేవలం నమ్మికయుంచి విశ్రాంతి పొందుచున్నాము.
టేపులలో ఉన్న ఆ స్వరమును వినుట ద్వారా, స్వయంగా యేసు ప్రకారముగా, మనము మన దినములో పరిశుద్ధాత్మయొక్క నిజమైన ఋజువును పొందుకున్నాము.
కావున పరిశుద్ధాత్మయొక్క అసలైన ఋజువు అదే! ఆయన నాకు ఇంతవరకు తప్పైనదానిని ఎన్నడూ చెప్పలేదు. అది, “అది పరిశుద్ధాత్మయొక్క ఋజువైయున్నది, అది వాక్యమును నమ్మగలవారైయున్నారు.” మీరు దానిని పొందుకోవచ్చును.
ప్రతి దినములోని ప్రతి నిమిషము మనము దానినుండి త్రాగగల ఒక ఊటను దేవుడు మనకు ఏర్పాటుచేశాడు. అది ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది. అది నిలువ ఉండి పాడైపోయినదేదో కాదు, అది ఆయనయొక్క తరిగిపోని, స్వయం-సమృద్ధి గల ఊటయైయున్నది; మీరు కేవలం ప్లే ను నొక్కవలసియున్నారు.
దేవునియొద్ద నుండి వచ్చిన ఒక కానుక గురించి మాట్లాడుతున్నాను, ఈ కానుక నిజంగా ఎంత గొప్పదో మీరు ఊహించగలరా? కేవలం సుళువుగా ప్లే ను నొక్కి మరియు టేపులలో ఉన్న ఆయనయొక్క స్వరమును వినడం ద్వారా, మరి అది మాత్రమే...మీకు ఒక వడపోత సాధనము, ఒక వడగట్టే జాలి, లేదా మరేదైనా అవసరంపడని ఏకైక స్వరము ఈ ప్రపంచంలో అది మాత్రమేయైయున్నది. మీరు కేవలం విని, నమ్మి, మరియు ప్రతీ మాటకు ఆమేన్ అని పలుకవలసియున్నారు.
నిత్యజీవమును పొందుకొనుటకు, మరియు ఇంకా ముఖ్యంగా, ఆయనయొక్క వధువుగా ఉండుటకు, దేవుడు తానే ఈ మార్గమును, ఆయనయొక్క ఏకైక మార్గమును ఏర్పాటుచేశాడు. మనము కేవలం ఆయన రొమ్మున ఆనుకొని మరియు ఆయనయొక్క ఊట చెప్పేదానిని, ఆయనయొక్క స్వరమును, ఎల్ షద్దాయ్ ఆయనయొక్క వధువుతో మాట్లాడుటను వినుచు మన బలమును పొందుకోవచ్చును.
ఈ సంవత్సరము ఆయన మనకొరకు, అనగా ఆయనయొక్క ప్రియమైన వధువు కొరకు వచ్చునట్టి సంవత్సరమైయ్యుండును గాక. మనము గొప్ప ఎదురుచూపుతో కనిపెడుతూ మరియు వేచియుంటున్నాము. ఎవరు ప్రత్యక్షమవ్వడాన్ని చూచుటకు మనము పరితపించామో ఇప్పుడు ఇక ఏదో ఒక రోజు మనము వారిని చూస్తాము. మన పెండ్లి విందుకు పిలువబడి, కనురెప్పపాటున, మనము ఇక్కడ నుండి బయటకు వెళ్తామని మనము గ్రహిస్తాము.
ప్రభువా, ఆ విందు నిమిత్తము, వేల మైళ్ళ వరకు ఆ గొప్ప బల్ల పరచబడియుండటాన్ని మేము చూస్తుండగా, పోరాటములో-గాయపడిన యోధులు, బల్ల ఎదురుగా ఒకరినొకరు చూసుకొనుచుండగా, మా చెంపల మీదుగా ఆనంద భాష్పములు కారుచుండగా…రాజు ఆయనయొక్క సౌందర్యముతో, పరిశుద్ధతతో బయటకు వస్తాడు, ఆ బల్ల ప్రక్కగా నడుస్తూ మరియు తన స్వంత చేతులతో మా కన్నులనుండి కన్నీటిని తుడిచివేస్తూ, “ఇకమీదట ఏడ్వకండి, అదంతా ముగిసిపోయినది. ప్రభువుయొక్క ఆనందములలోకి ప్రవేశించండి,” అని చెప్తాడు. తండ్రీ, మార్గాంతమునకు మేము చేరుకున్నప్పుడు, అప్పుడిక దారిలోని కష్టాలు ఏమియు కానట్టు అనిపిస్తుంది.
ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, వచ్చి మాతో కలిసి మరియు ఈ దినమునకై దేవుడు ఏర్పాటుచేసిన ఊట నుండి త్రాగండి, మరియు త్రాగండి, మరియు త్రాగుతూనే ఉండండి. మీరు పూర్తిగా నిశ్చింతగా ఉండి మరియు మీరు వినే ప్రతీ మాటకు ఆమేన్ చెప్పగల ఏకైక స్థలము అది మాత్రమేయైయున్నది. అది ఆయనయొక్క వధువు త్రాగడానికి ఆమె కొరకు ఆయన ఏర్పాటుచేసిన బుగ్గబావియైయున్నది.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానము: 64-0726E బ్రద్దలైన తొట్లు
వర్తమానమును వినడానికి ముందు చదువవలసిన లేఖనములు:
కీర్తనలు 36:9
యిర్మియా 2:12-13
పరిశుద్ధ. యోహాను 3:16
ప్రకటన13వ అధ్యాయము