ఆదివారం
02 జూన్ 2024
65-0218
విత్తనము తొక్కతో వారసురాలు కాదు

ప్రియమైన అబ్రాహాముయొక్క రాజసంతానమా,

ఎవరైతే కూడుకొని, అనుసంధానము-ద్వారా వింటూ, పరలోకమునుండి పడుచున్న నూతనమైన తాజా మన్నాతో వారి అంతరాత్మలను పోషించుకుంటున్నారో, ప్రపంచవ్యాప్తంగానున్న అట్టివారికి నేను శుభములు తెలియజేయుచున్నాను. మీరు స్వయంగా యేసుక్రీస్తుయొక్క రక్తముతో కొనబడినవారు.

ప్రభువైన యేసూ, ఈ రాత్రి దైవీకమైన ధ్వని క్రిందనున్న ప్రతీ చెవి వినుటకు ఈ మాటలను అభిషేకించాలని నేను ప్రార్థిస్తున్నాను. మరియు ఎవరైనా ఇక్కడ ఉన్నయెడల, లేదా అనుసంధానము ద్వారా వింటున్నయెడల , ప్రపంచవ్యాప్తంగా వింటున్నయెడల.

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని, మనతో మాట్లాడుచున్న దేవుని స్వరముయొక్క దైవీకమైన ధ్వనిని మనము ప్రపంచమంతటినుండి వినుచు మరియు ఆలకించుచుండగా, దేవుడు మనలో ప్రతీఒక్కరి చెవులను అభిషేకించుచున్నాడు.

అదేమైనప్పటికినీ, ఎటువంటి పరిస్థితిలోనైనా, దేవునియొక్క ప్రతీ మాటను నమ్మేటటువంటి తిరిగి-జన్మించిన దేవునియొక్క అసలైన సంఘము మనమేయైయున్నాము, ఎందుకనగా అది సంకరములేనటువంటి నిజమైన దేవునియొక్క స్వరము మాట్లాడుటయైయున్నది.

దేవుడు తన వధువు సంఘమైయున్న మనలో, తననుతాను ప్రత్యక్షపరచుకొనుచున్నాడు. మనము విత్తనమును మోసుకొనిపోవువారము కాము, మనము రాజ సంతనమైయున్నాము. ఆయలో ఉన్నట్టి ఆయన జీవముయొక్క సంపూర్ణత మరలా మనలో, అనగా నిజమైన, అసలైన, వధువు సంఘములో దానినది ఉత్పత్తి చేసుకున్నది, తద్వారా దేవునియొక్క పూర్తి వాక్యమును దానియొక్క సంపూర్ణతలోను మరియు దానియొక్క శక్తిలోను అది తీసుకొనివచ్చుచున్నది.

దీని తరువాత ఇక ఎటువంటి సంఘకాలములు ఉండవు. సహోదరీ సహోదరులారా, మనము అంతమున ఉన్నాము. మనము ఇక్కడ ఉన్నాము. మనము చేరుకున్నాము. దేవునికి కృతఙ్ఞతలు!

మనము అంతమున ఉన్నాము. మనము చేరుకున్నాము. మనము ఎవరమన్నది వధువు గుర్తించినది. ఇది విత్తనపు వధువు కాలము. తొక్క అంతయు చనిపోయినది. తొక్క అంతయు ఎండిపోయినది. మనము, యేసుక్రీస్తు నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడని ప్రత్యక్షపరచిన కన్యక-జన్మయైనటువంటి దేవునియొక్క వాక్యమైయున్నాము.

మనము తాకబడము. మనలో ఎటువంటి దెబ్బ-లాటలు ఉండవు. మనము వధువుయొక్క కన్యక జన్మయైయున్నాము. స్వచ్ఛమైన కన్యక వాక్యమునకు నమ్మకంగా నిలబడవలెనని మనము దేవునిచేత ఆజ్ఞాపించబడియున్నాము. విత్తనము పరిపక్వము చెందడానికి, అది కుమారునియొక్క, పరిశుద్ధాత్మయొక్క, మనుష్యకుమారుని స్వరముయొక్క సన్నిధిలో కూర్చుండవలసియున్నది. మరియు మనకు ఒకేఒక్క మార్గము కలదు: ప్లేను నొక్కి మరియు స్వయంగా మనుష్యకుమారునియొక్క స్వరమును వినడమే.

మరియు ప్రపంచములో ఎక్కడో ఒక చోట ఎన్నుకోబడిన సంఘము ఉన్నదనియు, అది లోకపు సంగతులనుండి బయటకు లాగబడి మరియు ప్రత్యేకపరచబడినదని నేను చెప్పుచున్నాను, మరియు దేవునియొక్క నెరవేర్పుయే దానిని ఆకర్షించినది. మనము అంత్య దినములలో ఉన్నాము.

మనము దేవునియొక్క పక్షిరాజులము. మనలో ఎటువంటి రాజీపడేతత్వము లేదు. మనము తాజా మన్నాను మాత్రమే తినగలము. మనము శాలలోని దూడలవలె ఉన్నాము. మనము కేవలం మనకొరకు ఏర్పాటుచేయబడి నిలువచేయబడిన ఆహారమును మాత్రమే తింటాము.

ప్రపంచవ్యాప్తంగా ఆ తాజా మన్నాను కోరుతున్న దేవునియొక్క పక్షిరాజులను మనము చూస్తున్నాము. వారు దానిని కనుగొనేవరకు దానిని వెతుకుతూనే ఉంటారు. వారు ఎంతో ఎత్తునకు ఎగురుతారు. ఈ లోయలో ఏదీ లేనియెడల, అతడు ఇంకాస్త పైకి ఎగురుతాడు. దేవునియొక్క స్వరమునుండి వారికి తాజాగా దేవునియొక్క వాక్యము కావలసియున్నది. వారి నిత్యమైన గమ్యస్థానం దానిపై విశ్రాంతినొందుచున్నది. శరీరము ఎక్కడ ఉన్నదో, పక్షిరాజులు అక్కడ పోగవుచున్నవి.

ఆయన చేసిన అదే కార్యములు చేయడానికి ఆయనయొక్క ఆత్మ మన మీదికి వచ్చియున్నది. ఇది మరలా గింజను ఉత్పత్తి చేయుటయైయున్నది. మనము దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిదానిని తీసుకొని మరియు అది ఆ విధంగా లేదని చెప్పునటువంటి అబ్రాహాముయొక్క విశ్వాసపు రాజసంతానమైయున్నాము. మనము దేవునియొక్క ఒక్క మాటను కూడా సందేహించలేము లేదా దానిని స్థానభ్రంశము చేయలేము, ఏలయనగా అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యునదని మనము నాముచున్నాము. యేసుక్రీస్తు నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటేరీతిగా ఉన్నాడు.

ప్రియమైన దేవా, లోకములోని ఏదో ఒక బుద్ధిహీనత కొరకు, మేము దానిని తృణీకరించకుందుము గాక, అయితే ఈ రాత్రి మేము మా పూర్ణహృదయముతో ఆయనను స్వీకరించుదుము గాక. ప్రభువా, నాయందు ఒక మంచి ఆత్మను, అనగా జీవాత్మను కలుగజేయుము, తద్వారా నేను నీ మాటలన్నిటినీ విశ్వసించి మరియు నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న, వాక్యమైయున్న యేసును స్వీకరించి, మరియు ఈ కాలమునకు కేటాయించబడిన భాగమును నమ్ముటకైయున్నది. ప్రభువా, దానిని అనుగ్రహించుము. యేసు నామములో నేను దీనిని అడుగుచున్నాను.

ఆయన మనకు పక్షిరాజు ఆహారమును; దేవుని వాగ్దానమును ఇచ్చుచుండగా వచ్చి అంత్య-కాలమునకు నిర్ధారించబడిన దేవుని స్వరమును వినేందుకు మిమ్మల్ని ఆహ్వానించడానికి నేను ఇష్టపడుచున్నాను. ఆయనయొక్క వధువుగా ఉండుటకు దేవునియొక్క ఈ వాక్యములో కన్యక విశ్వాసము అవసరమైయున్నది.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

 

సమయము:
12:00 P.M. జఫర్సన్ విల్ కాలమానం ప్రకారము

వర్తమానము:
విత్తనము తొక్కతో వారసత్వము పొందనేరదు 65-0218

లేఖనములు:
పరిశుద్ధ. మత్తయి 24:24
పరిశుద్ధ. లూకా 17:30
పరిశుద్ధ యోహాను 5:24 / 14:12
రోమా 8:1
గలతీ 4: 27-31
హెబ్రీ 13:8
1 యోహాను 5:7
ప్రకటన 10
మలాకీ 4

 


 

అయితే, “నేను నా తండ్రి ఏకమైయున్నాము,” అని మరియు ఈ ఇతర సంగతులను చెప్పే విషయానికి మీరు వస్తే, అప్పుడు ఆ పొట్టు దానినుండి వెనుకకు లాక్కుంటుంది. కానీ నిజమైన, అసలైన వధువు సంఘము దేవునియొక్క సంపూర్ణ వాక్యమును, దానియొక్క సంపూర్ణతలో మరియు దానియొక్క శక్తిలో తీసుకొనివస్తుంది, ఏలయనగా ఆయన నిన్నా, నేడు, మరియు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు.

65-0218 - "విత్తనము తొక్కతో వారసత్వము పొందనేరదు"

గౌరవనీయులైన. విలియమ్ మారియన్ బ్రెన్హామ్

 

యేసుక్రీస్తు నిన్నా, నేడు, మరియు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు, ఆయన చేసిన అవే కార్యములను చేయుటకు ఒక ఆత్మ వధువు మీదికి వచ్చియున్నది. చూశారా? అది విత్తనము మరలా ఉత్పత్తి చేయబడటమైయున్నది.

65-0218 - "విత్తనము తొక్కతో వారసత్వము పొందనేరదు"

గౌరవనీయులైన. విలియమ్ మారియన్ బ్రెన్హామ్