ఆదివారం
02 ఫిబ్రవరి 2025
61-0730M
దానియేలునకు గాబ్రియేలు యొక్క ఉపదేశములు

ప్రియమైన లక్ష్యముగల వారలారా,

ఏడు సంఘకాలములను మనము అధ్యయనము చేసియుండగా మనము ఎటువంటి ఒక అద్భుతమైన శీతాకాలమును కలిగియుంటున్నాము కదా, మరియు పిదప యేసుక్రీస్తుయొక్క ప్రత్యక్షతల గ్రంథములో దేవుడు మనకు ఇంకా ఎక్కువ బయలుపరచుచున్నాడు. ప్రకటనలోని మొదటి మూడు అధ్యాయాలు ఏ విధంగా సంఘకాలములైయున్నవని, మరియు పిదప 4 మరియు 5వ అధ్యాయములలో ఏ విధంగా యోహాను కొనిపోబడ్డాడని జరుగనైయున్న సంగతులను మనకు చూపిస్తున్నాడు.

ప్రకటన 6వ అధ్యాయము నుండి 19వ అధ్యాయము వరకు జరిగే సంగతులను చూడటానికి ఏ విధంగా యోహాను మరలా భూమి మీదకు విడిచిపెట్టబడ్డాడు అనేదానిని, 6వ అధ్యాయములో ఆయన మనకు బయలుపరిచాడు.

దేవుని స్వరము తనయొక్క బలమైన ఏడవ దూత ద్వారా మాట్లాడి మరియు తర్వాత ఏమి బయలుపరచబడనైయున్నదో మనకు చెప్తుండగా ఈ ఆదివారము వధువు ఎంతగా ఆశీర్వదించబడుతుంది కదా.

ఇప్పుడు మనము దానియేలు డెబ్బది వారములయొక్క గొప్ప అధ్యయనమును ప్రారంభించబోవుచున్నాము అని ప్రకటించడానికి నేను ఎంతో ఉత్సాహభరితుడనగుచున్నాను. మనము ఏడు ముద్రలలోనికి; ఏడు బూరలలోనికి; మూడు శ్రమలోనికి; సూర్యునిలోని స్త్రీ వద్దకు; ఎర్రని దయ్యమును వెళ్ళగొట్టుటయొద్దకు; ఒక లక్షా నలభై-నాలుగు వేలమంది ముద్రించబడుటలోనికి వెళ్ళడానికి ముందు ఆ మిగతా వర్తమానమును అది ముడివేస్తుందని ప్రవక్త చెప్పాడు; అంతయు ఈ సమయం మధ్యలోనే జరుగుతుంది.

దానియేలు గ్రంథము మనము జీవించుచున్న కాలమునకు మరియు సమయమునకు ఖచ్చితమైన క్యాలెండరైయున్నది, మరియు అది ఎంత క్లిష్టముగా అగుపించినా గాని, దేవుడు దానిని విడమరచి మరియు మనకు దానిని సామాన్యముగా చేస్తాడు.

మరియు నేనిప్పుడు దానికొరకే ఎదురుచూస్తున్నానని దేవునికి తెలుసు, అదేమిటనగా ఈ ఉదయం ఇక్కడున్నవారికి, మరియు బయట ఈ టేపులు వెళ్ళే ప్రదేశములలోను, ప్రపంచవ్యాప్తంగా, నేను ఆయన ప్రజలకు ఆదరణ కలుగజేసి మరియు ఏమి సమీపించియున్నదో వారికి చెప్పి, మనము అంతమున ఉన్నామని వారికి చెప్పవలెనని ఎదురుచూస్తున్నాను.

మనము ఆ దినము కొరకు మరియు ఆ గడియ కొరకు పరితపిస్తూ మరియు ప్రార్థన చేస్తున్నట్టి దేవునియొక్క ఎన్నుకోబడిన ప్రజలమైయున్నాము. మరియు మన కన్నులు పరలోకము తట్టునకు చూస్తున్నవి, మరియు మనము ఆయనయొక్క రాకడ కొరకు చూస్తున్నాము.

మనమందరము దానియేలు వలె ఉందాము, మరియు వాక్యమును చదువుట ద్వారా మరియు ఆయనయొక్క స్వరమును వినుట ద్వారా, ప్రభువుయొక్క రాకడ త్వరగా సమీపించుచున్నదని, మనము అంతమున ఉన్నామని; మనము ఎరిగియుండగా ప్రార్ధనలోను యాచనలోను మన ముఖములను పరలోకము తట్టునకు త్రిప్పి ఉంచుదాము.

తండ్రీ మేము ప్రతి భారమును, సుళువుగా చిక్కులబెట్టు ప్రతి పాపమును, మరియు ప్రతి చిన్న అవిశ్వాసమును ప్రక్కన పెట్టుటకు మాకు సహాయము చేయుము. మా సమయము పరిమితి కలిగియున్నదని ఎరిగియుండి, మేమిప్పుడు ఉన్నత పిలుపుయొక్క గురియొద్దకే పరిగెత్తుదుము గాక.

వర్తమానము బయలువెళ్ళినది. ఇప్పుడు సమస్తము సిద్ధంగా ఉన్నది; మేము వేచియుండి మరియు విశ్రాంతినొందుచున్నాము. సంఘము ముద్రించబడియున్నది. దుష్టులు ఇంకా దుష్ట కార్యములు చేయుచున్నారు. సంఘములు మరింత సంఘ విధానములోనికి మారుచున్నవి, అయితే నీ పరిశుద్ధులు నీకు సమీపముగా వచ్చుచున్నారు.

అరణ్యములో కేక వేయుచున్న ఒక స్వరమును మనము కలిగియున్నాము, అది ప్రజలను తిరిగి అసలైన వర్తమానమునొద్దకు పిలచుచున్నది; తిరిగి దేవునియొక్క అసలైన కార్యముల యొద్దకు పిలచుచున్నది. ఈ సంగతులు జరుగుచున్నాయని ప్రత్యక్షత ద్వారా మనము గ్రహించుచున్నాము.

ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, దానియేలు గ్రంథముయొక్క మా గొప్ప అధ్యయనమును ప్రారంభించగా, దేవుడు తన వాక్యమును మాకు బయలుపరచుచుండగా, వచ్చి మాతో చేరండి.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

61-0730M – దానియేలుకు గాబ్రియేలుయొక్క సూచనలు