
ప్రియమైన ఆత్మ సంబంధమైన హవ్వా,
ఈ రోజు నా ఉత్తరమును దేవునియొక్క ఆటంబాంబుతో ప్రారంభించనివ్వండి; .22 తుపాకీ కాదు గాని, యేసుక్రీస్తుయొక్క వధువు కొరకైన ఒక అణుబాంబు.
ఇప్పుడు, మీరు గనుక వాటిని వ్రాసుకొనగోరితే; మంచిది, అవి మీ అందరికీ తెలుసు: యేసు, యోహాను 14:12; మరియు యోవేలు, యోవేలు 2:38; పౌలు, రెండవ తిమోతి 3; మలాకీ, 4వ అధ్యాయము; మరియు ప్రత్యక్ష్యపరచువాడైన యోహాను, ప్రకటన 10:17, 1-17. చూడండి, ఇప్పుడు సరిగ్గా ఏమి జరుగునో అదియే!
గమనిక మరియు హెచ్చరిక: మీరు నమ్ముతున్నయెడల క్రింద ఇవ్వబడిన కొటేషన్ మీకు కాదు.
“మనము దేవునియొక్క ప్రవక్తకు అతిగా ప్రాముఖ్యతను ఇస్తున్నాము.” “మీరు కేవలం ప్రవక్త చెప్పిన దానినే వింటున్నయెడల మీరు వధువు కాలేరు.” “సంఘములో టేపులు ప్లే చేయడం తప్పు.” “దీపం ముందుకు ఇవ్వబడినది; ఈ రోజు పరిచర్యను వినడమే ప్రాముఖ్యమైన విషయము.” “అందరూ ఒకేసారి ప్లేను నొక్కడమనేది ఒక సంఘశాఖయైయున్నది.”
సంఘమునకు, అదేమిటి? రూపుదాల్చిన వాక్యము మరలా ఆయనయొక్క ప్రజల మధ్యన శరీరధారియగుట! చూశారా?
కబూం…కావున ప్లేను నొక్కడం వలన, ఆయన తన వాక్యమును బయలుపరుస్తుండగా, రూపుదాల్చిన వాక్యము నేరుగా మనతో మాట్లాడుటను మనము వినగలము.
మరియు అది మీరు వినగలిగేంత ప్రాముఖ్యమైన స్వరమేమీ కాదు కదా? అని కొందరు అంటారు. అలాంటి వారి కొరకే ఈ కొటేషన్.
మరియు వారు దానిని అసలు నమ్మరు.
ప్రభువు మనకు ఆయనయొక్క వాక్య ప్రత్యక్షతను, మనము ఎవరమన్నదాని ప్రత్యక్షతను ఇచ్చిన కొలది, ఆ ప్రత్యక్షతకు వెలుపటనున్నవారందరూ దూరంగా వెళ్తారు.
నన్ను దానిని చెప్పనివ్వండి, నిజంగా, తద్వారా మీరు…అది లోతుంగా నాటబడుతుంది. ఇది అర్థం అవ్వాలని నేను కోరుతున్నాను. ఈనాడు మీతో సమస్య అదే, చూడండి, మీరు వాక్యమును ఎరుగరు! చూశారా?
ఈ వర్తమానమును ప్రసంగించడానికి మనుష్యులను అభిషేకించాడు, అయితే ఒకే ఒక్క సంపూర్ణత ఉన్నది: అది వాక్యమే. ఒక సేవకుడు చెప్పినదైనా, లేదా ఎవరు మాట్లాడినదైనా మీరు వినప్పుడు, అతడు చెప్పేది సరిగ్గా దేవునియొక్క ప్రవక్త ఇదివరకు చెప్పినదే అని నమ్మగల విశ్వాసము మీకు ఉండవలసియున్నది. వారి వాక్యము, వారి ప్రత్యక్షత, వారి అనువాదము విఫలమవ్వవచ్చును; అయితే టేపులలో ఉన్న దేవుని స్వరము ఎన్నటికీ విఫలమవ్వదు.
ప్లేను నొక్కడం ద్వారా దేవుడు సామాన్యతలో ఉండటను గురించి మాట్లాడండి…ఆయన దానిని మరలా చెప్తాడు.
వారు ఆయనను అనగా, వాగ్దానము చేయబడిన వాక్యము ద్వారా, శరీరములో ప్రత్యక్షపరచబడిన సజీవమైన వాక్యమును వారు తప్పిపోతున్నారు. ఈ కార్యములు చేయబడునని వాక్యము వాగ్దానము చేసినది. అంత్య దినములలో ఈ విధంగా ఉంటుందని, వాగ్దానము చేయబడినది.
ఆయనయొక్క ఉరుమును వినండి. ఒక ఉరుము అనగా దేవునియొక్క స్వరమైయున్నది. విలియమ్ మారియన్ బ్రెన్హామ్ గారు ఈ తరమునకు దేవునియొక్క స్వరమైయున్నాడు.
ఆ—ఆ వధువు ఇంకను ఒక ఉజ్జీవమును పొందుకోలేదు. చూశారా? ఎటువంటి ఉజ్జీవము సంభవించలేదు, వధువును కుదుపడానికి ఇంకను దేవునియొక్క ప్రత్యక్షత అక్కడ లేదు. చూశారా? ఇప్పుడు మనము దాని కొరకు ఎదురుచూస్తున్నాము. ఆమెను మరలా మేల్కొల్పడానికి, ఆ తెలియబడని ఏడు ఉరుములు అవసరమవుతాయి, చూడండి. అవును, ఆయన దానిని పంపుతాడు. ఆయన దానిని వాగ్దానము చేసాడు. ఇప్పుడు గమనించండి.
మీరు కోరినయెడల మీరు దానిని మలచగలరు, కానీ ఏడు ఉరుములు వధువునకు ప్రత్యక్షత వలన కలుగు ఉత్తేజమును మరియు ఎత్తబడు విశ్వాసమును దయచేస్తాయి, అది పరిశుద్ధాత్మ దేవుని ప్రవక్త ద్వారా మాట్లాడుటవలన మాత్రమే వచ్చును. అది సరిగ్గా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుచున్నది. దేవుడు ఆయనయొక్క వధువును వాక్యముతో ఉత్తేజపరిచాడు.
అది మాత్రమే కాదు, ఏమి చేయాలో ఆయన ఇదివరకే మన శత్రువుకు చెప్పియున్నాడు.
నీవు వారి మీద నీ చేతులను వేయవద్దు. వారు ఎక్కడికి వెళ్తున్నారో వారికి తెలుసు, ఏలయనగా వారు నా నూనెతో అభిషేకించబడ్డారు. మరియు నా నూనెతో అభిషేకించబడుటను బట్టి, వారు ఆనందపు ద్రాక్షారసమును కలిగియున్నారు, ఎందుకనగా ‘నేను వారిని మరలా లేపబోవుచున్నాను’ అనే నా వాగ్దాన వాక్యమును వారు ఎరిగియున్నారు. దానికి హానీ కలిగించవద్దు! వారిని పాడుచేయుటకు ప్రయత్నించవద్దు.
ఆయన శత్రువుకు వాడి మురికి చేతులను మన మీద వేయకూడదని చెప్పాడు. అయితే వ్యాధి ఇంకను మనపై దాడి చేయవచ్చా? అవును. మనము ఇంకను సమస్యలను కలిగియుంటున్నామా? అవును. అయితే మనము ఏమి చేయాలో కూడా ఆయన మనకు చెప్పాడు.
అది లోతుగా ఉన్నది. దానిని నెమ్మదిగా మరలా మరలా చదవండి.
ఒక వాక్యముకంటే ముందు, అది ఒక తలంపైయున్నది. మరియు ఒక తలంపు సృష్టించబడవలసియున్నది. మంచిది. కావున, దేవుని తలంపులు, ఒక వాక్యము ద్వారా పలుకబడినప్పుడు అవి సృష్టిగా మారతాయి. అది ఎప్పుడనగా ఆయన దానిని—దానిని ఒక తలంపుగా, ఆయనయొక్క తలంపుగా, నీకు ప్రదర్శించినప్పుడు, మరియు అది నీకు బయలుపరచబడినప్పుడై యున్నది. పిదప, నీవు దానిని పలికేవరకు అది ఇంకను ఒక తలంపేయైయున్నది.
ఆయన ఆలోచనలు పలుకబడినప్పుడు సృష్టిగా మారాయి. పిదప, ఆయనయొక్క ఆలోచనలు ప్రదర్శించబడి మరియు వాక్యముగా మనకు బయలుపరచబడ్డాయి. ఇప్పుడు మనము దానిని పలికేవరకు అది ఇంకను మనలో ఉన్న ఒక ఆలోచనేయైయుంటుంది. కావున మనము దానిని పలుకుతాము…మరియు దానిని నమ్ముతాము.
నేను అబ్రాహాముయొక్క రాజ సంతానమైయున్నాను. నేను క్రీస్తుయొక్క వధువునైయున్నాను. ఆయనయొక్క వధువుగా ఉండుటకు జగత్తుపునాది వేయబడకముందే నేను ఎన్నుకోబడ్డాను మరియు ముందుగా నిర్ణయించబడ్డాను, మరి ఏదియు దానిని మార్చజాలదు. బైబిలు గ్రంథములో ఉన్న ప్రతీ వాగ్దానము నాదే. అది నా కొరకైన ఆయనయొక్క వాక్యమైయున్నది. నేను ప్రతీ వాగ్దానమునకు వారసుడనైయున్నాను. నా వ్యాధులన్నిటినీ స్వస్థపరచు ప్రభువైన దేవుడు ఆయనే. నాకు అవసరమున్న ప్రతీది నాదే, దేవుడు ఆలాగు చెప్పాడు.
దేవుడు సామాన్యతలో ఉండుట: వినుటవలన, వాక్యమును వినుటవలన విశ్వాసము కలుగుతుంది. వాక్యము ప్రవక్త యొద్దకు వస్తుంది.
అందరూ వారి ఆలోచనలను, వారి ఊహలను, వారి వర్తమానమును ఋజువు చేసుకోడానికి “కొటేషన్లను” ఉపయోగించగోరుతున్నారు. మరియు వారు సరియే, నేను కూడా అలా చేస్తాను, అందునిమిత్తమే దీనిని చెప్పడానికి నేను మీకు కొటేషన్లనే ఇస్తుంటాను: టేపులతో నిలిచియుండండి. ఆ స్వరమును వినండి. ఆ స్వరము దేవుని స్వరమైయున్నది. ఇంకెవరైనా చెప్పేది కాదు గాని, టేపులలో ఉన్న ప్రతీ మాటను మీరు నమ్మవలసియున్నారు. అదియే మీరు వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరమైయున్నది.
ఇతరులు మిమ్మల్ని వారి పరిచర్య నొద్దకు, వారి సంఘమునకు, వారి అనువాదము నొద్దకు, వారి ప్రత్యక్షత నొద్దకు నడిపించుకోడానికి కొటేషన్లను ఉపయోగిస్తారు. “మీ సంఘకాపరితో నిలిచియుండండి.” (మంచిది, అది నాకు కూడా ఇష్టమే, ఎందుకనగా మేము నిలిచియుంటాము, అయితే కేవలం వేరే సంఘకాపరితోయైయున్నది.) “ఆయన మాత్రమే ప్రత్యేకమైనవాడు కాడు.” “సంఘములో టేపులను ప్లే చేయమని ఆయన ఎన్నడూ చెప్పలేదు.”
దానికి ఎటువంటి వ్యక్తిగత అనువాదమును ఇవ్వకండి. కనీసం ఊరకే సరసోక్తులు చెప్పేదియైనా కాదు గాని, ఒక స్వచ్ఛమైన, సంకరములేనిదానిని ఆయన కోరుచున్నాడు. నా భార్య వేరే ఎవరో ఒక పురుషుడితో సరసమాడటాన్ని నేను కోరుకోను. మరియు మీరు దానిని కాకుండా, ఎటువంటి హేతువులకైనా చెవి యొగ్గినప్పుడు, మీరు వింటున్నారు, మీరు సాతానుడితో సరసమాడుతున్నారు. ఆమేన్! అది మీకు భక్తిపూర్వకమైన అనుభూతి కలిగించడంలేదా? మీరు సంకరము లేనివారిగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. సరిగ్గా అక్కడే ఆ వాక్యముతో నిలిచియుండండి. సరిగ్గా దానితోనే నిలిచియుండండి. మంచిది.
నేనును నా యింటివారునుయైతే, మేము ప్లేను నొక్కి మరియు ఆయనయొక్క ఏడవ దూత వర్తమానికుడి గుండా మాట్లాడుతున్నట్టి రూపము దాల్చిన దేవుని వాక్యమును వెంబడిస్తాము. మేము దానికి మా వ్యక్తిగత అనువాదమును జతచేయము; మేము ఎటువంటి హేతువాదముతో సరసమాడము లేదా దానికి చెవియెగ్గము. అది టేపులలో పలుకబడినట్లుగానే మేము ఆ వాక్యముతో నిలిచియుంటాము. అది సామాన్యతలో ఉన్న దేవుడైయున్నాడు.
ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, మనము: మూడవ ముద్ర 63-0320 వింటుండగా మనము ఎటువంటి ఒక మహిమకరమైన సమయమును కలిగియుంటాము కదా. ఈ దినమునకైన వాక్యము కొరకు ప్రపంచ వ్యాప్తంగా మేము కూడుకొనుచుండగా మాతో చేరమని మిమ్మల్ని ఆహ్వానించడానికి నేను ఇష్టపడుతున్నాను.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానమును వినడానికిముందు చదువవలసిన లేఖనములు:
పరిశుద్ధ. మత్తయి 25:3-4
పరిశుద్ధ. యోహాను 1:1, 1:14, 14:12, 17:17
అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము
I తిమోతి 3:16
హెబ్రీ 4:12, 13:8
I యోహాను 5:7
లేవీయకాండము 8:12
యిర్మియా 32వ అధ్యాయము
యోవేలు 2:28
జెకర్యా 4:12
దానిని మరలా ఒకసారి స్పష్టపరచడానికి నన్ను ఈ అవకాశమును తీసుకోనివ్వండి. నేను ఐదు-మడతల పరిచర్యకు విరుద్ధంగా లేను. నేను ఐదు-మడతల పరిచర్యను నమ్ముతాను. ఒక దైవసేవకుడు చెప్పేదానిని వినడం తప్పని నేను భావించను. దేవుడు మిమ్మల్ని ఎక్కడైతే పెట్టాడో అట్టి మీ సంఘకాపరి చెప్పేదానిని మీరు వినాలని నమ్ముతాను. నేను చెప్పేది ఏమిటంటే, దేవుడు మన దినములో ఒక ప్రవక్తను పంపినాడని నేను నమ్ముతాను. దేవుడు ఆయనయొక్క ప్రవక్తకు ఆయనయొక్క వాక్యమును బయలుపరిచాడు. నేను తప్పైయుండవచ్చును, మీ సంఘకాపరి తప్పైయుండవచ్చును, కానీ (ఈ వర్తమానము సత్యమని మరియు సహోదరుడు బ్రెన్హామ్ గారు దేవునియొక్క ప్రవక్తయని మనము నమ్ముతున్నామని మనము చెప్పుకుంటున్న యెడల) అప్పుడు టేపులలో చెప్పబడినది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నదని మనము తప్పక అంగీకరించవలసియున్నాము. మీరు దానిని నమ్మకపోతే, అప్పుడు మీరు ఈ వర్తమానమును నమ్మడంలేదన్నట్లే. కావున, అదియే మీరు వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరము అని నేను నమ్ముతున్నాను. నేను చెప్పేదానిని మీరు వినవలసిన అవసరంలేదు, ఇంకెవరైనా చెప్పేదానిని మీరు వినవలసిన అవసరంలేదు, కానీ టేపులలో ఉన్న ఆ స్వరమును మాత్రం మీరు తప్పక వినవలసియున్నారు.