ఆదివారం
16 ఫిబ్రవరి 2025
61-0806
దానియేలు యొక్క డెబ్బదివ వారము

ప్రియమైన వేచియుంటూ మరియు ఎదురుచూస్తున్న వారలారా,

ముందెన్నడూ లేని విధంగా వధువు మధ్యన ఒక ఉత్సాహము ఉన్నది. మనం గొప్ప ఎదురుచూపుతో ఉన్నాము; మన జూబిలి సంవత్సరము సంభవించనైయున్నది. ఈ దినము రావడం కోసం వధువు ఎంతో కాలం వేచియున్నది. అన్యజనుల కాలముయొక్క ముగింపు వచ్చియున్నది మరియు మన ప్రభువుతో నిత్యత్వముయొక్క ఆరంభము త్వరలో ప్రారంభమవుతుంది.

వాక్యమును వినుట ద్వారా మనం జీవిస్తున్న కాలమును మనం గ్రహిస్తున్నాము. సమయము అయిపోయినది. ఎత్తబడుటకు సమయం సమీపించియున్నది. మనము చేరుకున్నాము. పరిశుద్ధాత్మ వచ్చి మరియు తన వధువునకు గొప్ప, లోతైన, రహస్యమైన సంగతులన్నిటినీ బయలుపరిచాడు.

మనం దేవుని కొరకు కనిపెడుతూ, ఒత్తిడిలో ఉన్నాము; మనల్ని మనం సిద్ధపరచుకొనుచున్నాము. మనం ఈ లోక సంగతులన్నిటినీ విసిరివేశాము. ఈ జీవితముయొక్క ఐహిక విచారములను మనము లెక్కచేయము. మన విశ్వాసము ముందెన్నటి కంటెను ఎంతో ఎక్కువ ఎత్తునకు చేరుకున్నది. ఆయన వచ్చి మరియు ఆమెను తీసుకుపోగలుగునట్లు, పరిశుద్ధాత్మ ఆయనయొక్క ఎన్నుకోబడిన యువతికి ఎత్తబడు విశ్వాసమును ఇచ్చుచున్నాడు.

ఈ అరవై-తొమ్మిది వారములు పరిపూర్ణముగా ఉన్నాయి; యూదులు వెళ్ళడమనేది పరిపూర్ణముగా ఉన్నది; సంఘకాలము పరిపూర్ణముగా ఉన్నది. మనం అంత్యకాలములో ఉన్నాము, అంత్యకాలము, లవొదికయ సంఘకాలము, దానియొక్క ముగింపులో ఉన్నాము. నక్షత్ర వర్తమానికులందరూ వారి వర్తమానమును ప్రసంగించారు. అది బయటకు వెళ్ళియున్నది. మనం కేవలం సులభంగా సాగిపోతున్నాము.

మనము ఎటువంటి ఒక నమ్మలేని నిజమైయున్న కాలములో జీవిస్తున్నాము కదా. శత్రువు ముందెన్నడూ లేని విధంగా ప్రతి ఒక్కరిపై దాడి చేస్తుండగా ఇది అత్యంత కష్టమైన కాలమైయున్నది. వాడు కలిగియున్న వాటన్నిటినీ మనపైకి విసురుతున్నాడు. వాడి సమయం అంతమగుచున్నదని వాడికి తెలుసు గనుక, వాడు ఒత్తిడిలో ఉన్నాడు.

అయితే అదే సమయములో, మనము మండెన్నడూ ఇంత సతోషముగా లేము.

• మనం ముందెన్నడూ ప్రభువునకు ఇంత దగ్గరగా లేము.
• పరిశుద్ధాత్మ మన శరీరములోని ప్రతి కణమును నింపుతున్నాడు.
• ఆయనయొక్క వాక్యము కొరకు మన ప్రేమ ఇంత ఎక్కువగా ఎప్పుడూ లేదు.
• మనకున్న ఆయనయొక్క వాక్య ప్రతక్షత మన అంతరాత్మను నింపుచున్నది.
• మనము ప్రతీ శత్రువును వాక్యముతో ఓడిసున్నాము.

మరియు, మనము ఎవరమన్నదాని విషయంలో ముందెన్నడూ ఇంత నిశ్చయతను కలిగిలేము:

• ముందుగా నిర్ణయినబడి
• ఎన్నుకోబడి
• ఎంపిక చేసుకోబడిన
• రాజ సంతానమైయున్నాము
• ప్రియాతి ప్రియమైన
• నిత్యత్వపు వాసులమైయున్నాము, తెల్లని-వస్త్రములను ధరించిన, శ్రీమతి. యేసు అయ్యున్నాము, టేపును వింటున్న, వెలిగింపబడిన, పవిత్రమైన కన్యకయైయున్నాము, ఆత్మ నింపుదల గలిగిన, తిరుగులేనివారమైయున్నాము, కుమారులుగా స్వీకరించబడినవారము, సంకరములేని, కన్యక వాక్య వధువైయున్నాము.

తర్వాత వచ్చేది ఏమిటి? రాయి వచ్చుచున్నది. మనం ఎదురుచూస్తూ, వేచియుంటూ మరియు ప్రతి దినము ప్రతి నిమిషము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆయన రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవడంకంటే మనకు ప్రాముఖ్యమైనది ఏదియు లేదు.

అది ఇక, “మేము అలా ఆశిస్తున్నాము కాదు”, మేము ఎరిగియున్నాము. ఇక ఎటువంటి సందేహాలు లేవు. ఒక్క క్షణములో, కనురెప్పపాటులో అది అయిపోతుంది, మరియు మనం మన ప్రియులందరితో మరియు ఆయనతో మన పెండ్లి విందులో ఆవలి గట్టున ఉంటాము.

మరియు అది ప్రారంభము మాత్రమే...మరియు ఇక అంతము లేదు!!

ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, ఆయనయొక్క వధువును నడిపించడానికి ఆయన పంపినట్టి ఆయనయొక్క బలమైన దూత, మాట్లాడి, దేవునియొక్క రహస్యములను బయలుపరుస్తుండగా, దేవుడు అతనిగుండా మాట్లాడుచుండగా, వచ్చి ఆ పెండ్లి విందుకై సిద్ధపరచుకోండి.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

వర్తమానం: 61-0806 – దానియేలుయొక్క డెబ్బదియవ వారము