
ప్రియమైన అతీతమైన ఆత్మసంబంధమైన రాజసంతానపు వధువా,
ఇక వేచియుండడమనేది లేదు, ఇక వెతుకులాడటమనేది లేదు, మనము చేరుకున్నాము! మనము అతీతమైన ఆత్మసంబంధమైన రాజసంతానపు వధువైయున్నాము. రాజ సంతానపు కుమారునికి ఆత్మసంబంధమైన సంతానమైయున్నాము. భవిష్యత్తులో రాబోయే ఏదో ఒక గుంపు కాదు; రాబోయే తర్వాతి తరం కాదు; మనము అంత్య దినములో జీవిస్తున్నాము, మనము యేసుక్రీస్తు భూమి మీదకి తిరిగి వచ్చుటను చూసే తరమైయున్నాము.
ఈ దినము, ఈ లేఖనము నెరవేరినది!
అదే సువార్త, అదే శక్తి, నిన్నటి దినమున ఉన్న అదే మనుష్యకుమారుడు, ఈనాడు ఉన్నాడు, మరియు నిరంతరము ఉంటాడు.
ఈ దినము, ఈ లేఖనము నెరవేరినది!
ఆరిజోనా, క్యాలిఫోర్నియా, టెక్సాస్, అమెరికాయందంతటలో మరియు ప్రపంచ వ్యాప్తంగా టెలిఫోన్-ద్వారా ఈ టేపును వింటున్న స్నేహితులారా; తూర్పు ప్రాంతమునకు వచ్చి మరియు శరీరంలో ప్రత్యక్షపరచుకున్న దేవునిగా తననుతాను నిర్ధారించుకున్న అదే దేవుని కు-మా-రు-డు, ఇక్కడ ఈ పశ్చిమ ప్రాంతమున, ఈ రాత్రి సంఘములో తననుతాను గుర్తింపజేసుకుంటున్న అదే దేవుని కు-మా-రు-డై యున్నాడు, ఆయన నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. కుమారునియొక్క సాయంకాలపు వెలుగు వచ్చియున్నది.
ఈ దినము, ఈ లేఖనము నెరవేరినది!
ఆయనయొక్క దినములలో వేదిక మీద నిలుచొని మాట్లాడుచు, ఆ కాలముయొక్క వాగ్దాన వాక్యముతో తననుతాను గుర్తింపజేసుకున్న మెస్సీయా స్వరము, ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా తన వధువుతో టేపుల ద్వారా మాట్లాడుచున్న అదే మెస్సీయ స్వరమైయ్యున్నది, మనతో ఈలాగు చెప్పుచున్నది: నేను నిన్నా, నేడు మరియు నిరంతరం ఒక్కటేరీతిగా ఉన్నాను. నేను మీకు దేవుని స్వరమునైయున్నాను. మీరు నా వాక్యముతో నిలిచియున్న నాయొక్క ఆత్మసంబంధమైన రాజసంతానపు వధువైయున్నారు.
ఈ దినము, ఈ లేఖనము నెరవేరినది!
ఈనాడు ప్రజల మధ్య ఎంతటి గందరగోళము ఉన్నదంటే వారు దేవునియొక్క సత్యమును చూడలేకపోవుచున్నారు. దానికి కారణమేదనగా దేవుని వాక్యమునకు మానవ-కల్పితమైన అనేక అనువాదములు ఉన్నాయి. ఆయన వాక్యమును అనువదించడానికి దేవునికి ఎవరును అక్కరలేదు. ఆయనే తన స్వంత అనువాదకుడు. ఆయన తన వాక్యమును అనువదించడానికి తన వధువునకు ప్రకటన 10:7 దినములయొక్క దూత ప్రవక్త స్వరమును పంపించాడు. అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యైయున్నది.
ఈ దినము, ఈ లేఖనము నెరవేరినది!
మీరు ఇట్లంటారు, “యేసు భూమిమీద ఉన్నప్పుడు నేను అక్కడ ఉన్నట్లయితే, నేను ఫలానా-మరియు-ఫలానా కార్యము చేసియుండేవాణ్ణి.” సరి, అది మీ కాలము కాదు. అయితే, ఇది మీ కాలమైయున్నది, ఇది మీ సమయమైయున్నది. మీరు ఏ స్వరమును దేవునియొక్క స్వరమని చెప్పుచున్నారు?
మీకు ఏ స్వరము అత్యంత ప్రాముఖ్యమైన స్వరమైయున్నది?
ఈ దినము, ఈ లేఖనము నెరవేరినది!
దయ్యము మునుపెన్నడూ లేని విధంగా ఆయనయొక్క వధువు మీద దాడి చేయుచున్నాడు. మీకు ఒక వ్యాధి ఉన్నదని లేదా ఏదో ఒక విధమైన అనారోగ్యమున్నదని మిమ్మల్ని ఆలోచింపజేస్తాడు, లేదా మీ కుటుంబముపై దాడి చేస్తుంటాడు. కొన్నిసార్లు మీరు పైకి, చుట్టూ లేదా ఎటు వైపునకు కూడా చూడలేనంత చీకటిగా మారునట్లు దేవుడు పరిస్థితులను అనుమతిస్తాడు. పిదప ఆయన వచ్చి మరియు దానిగుండా మీ కొరకు మార్గమును కలుగజేస్తాడు, తద్వారా “నేను హాగరు సంతానమును కాను, నేను శారా సంతానమును కాను, నేను మరియ సంతానమును కూడా కాను, నేను దేవునియొక్క అతీతమైన ఆత్మసంబంధమైన అబ్రాహాముయొక్క రాజసంతానమైయున్నాను. నేను నా కొరకైన దేవునియొక్క వాగ్దాన వాక్యమును తీసుకుంటాను, అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నడై యున్నది. నేను కదిలించబడను. అది ఏ విధంగా కనిపించినప్పటికీ, దయ్యము ఏమి చెప్పినప్పటికీ లెక్క లేదు. నాకు ఏది అవసరమున్నను, నేను దేవుడిని ఆయనయొక్క వాక్యము వద్ద తీసుకుంటాను,” అని మీరు చెప్పుటకైయున్నది.
ఈ దినము, ఈ లేఖనము నెరవేరినది!
దేవుని స్వరము పలికినది. మీకు అవసరమైన ఆత్మీయ ఆహారమంతటిని నేను నిలువచేసాను. ఆ టేపులలో ఉన్నదానినే చెప్పండి. నేను మీకు దేవునియొక్క స్వరమునైయున్నాను. నా మాటలకు ఎటువంటి అనువాదము అవసరం లేదు. సణుగుకోవద్దు లేదా పోట్లాడ వద్దు, ఒకరినొకరు ప్రేమించుకోండి, అయితే నా వాక్యముతో నిలిచియుండండి.
ఈ దినము, ఈ లేఖనము నెరవేరినది!
దిగులుగా ఉండకండి. చింతించకండి. సాతానుడిని మీ సంతోషమును మీ వద్దనుండి దొంగిలించనీయకండి. మీరు ఎవరన్నది, మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారన్నది జ్ఞాపకము చేసుకోండి, ఆ గొప్ప వివాహ విందులో ఉండటము ఏ విధంగా ఉంటుంది కదా. ఆయన కేవలం మీ కొరకే నిర్మించిన ఆ అందమైన పట్టణములో జీవించుట. అక్కడ మీరు ఆయనతో మరియు ముందుగా వెళ్ళినవారందరితో నిత్యత్వమంతా ఉంటారు.
ఇక ఏ వ్యాధి ఉండదు. ఇక ఏ విచారము ఉండదు. ఇక మరణము ఉండదు. ఇక ఎటువంటి పోరాటములు ఉండవు. కేవలం ఆయనతో నిత్యజీవం. అప్పుడు మనము ఇట్లంటాము:
ఈ దినము, ఈ లేఖనము నెరవేరినది!
మనము దిగులుగా ఉండి ఇట్లనవద్దు, “నాకు ఈ స్థలముపై విరక్తి కలిగినది, నేను ఇక్కడినుండి వెళ్ళిపోగోరుచున్నాను.” మనము ఇట్లందాము: “ఆయన ఇప్పుడు ఏ నిమిషమునైనా, నా కొరకు వచ్చుచున్నాడు…మహిమ! నేను వేచియుండలేకపోవుచున్నాను. నేను నాకు ప్రియులైనవారందరినీ చూడబోవుచున్నాను. వారు సరిగ్గా నా యెదుటనే ప్రత్యక్షమవ్వబోవుచున్నారు, సామాప్తమైనదని, మనము చేరుకున్నామని, అప్పుడు నేనెరుగుదును.
అప్పుడు, కనురెప్పపాటున ఒక్క క్షణములోనే, ఆవలి వైపున మనమందరము కలిసి ఉంటాము.
మనము సంతోషించి మరియు ఆనందించుదాము, ఏలయనగా గొర్రెపిల్ల మరియు ఆయన వధువుయొక్క వివాహము, సమీపించినది...ఆయనయొక్క వధువు తననుతాను సిద్ధపరచుకున్నది.
మీరు ఆనందించి, మరియు మాతోపాటు గొర్రెపిల్ల వివాహములో ఉండగోరినయెడల, వచ్చి ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు మేము దీనిని వినుచుండగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి:
ఈ దినము, ఈ లేఖనము నెరవేరినది 65-0219
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
చదువవలసిన లేఖనములు:
పరిశుద్ధ. యోహాను 16వ అధ్యాయము
యెషయా 61:1-2
పరిశుద్ధ. లూకా 4:16