
ప్రియమైన సంకరములేని స్వచ్చమైన వాక్య వధువా,
మనము ఆయనయొక్క ప్రియమైన చిన్న యువతియై యున్నాము; సంకరము చేయబడని, ఏ మనుష్యునియొక్క సంఘసంస్థ చేతగానీ, ఏ మానవ-కల్పిత సిద్ధాంతము చేత గానీ తాకబడని వారమైయున్నాము. మనము సంకరము చేయబడని స్వచ్చమైన, వాక్య వధువైయున్నాము! మనం గర్భవతియైన దేవుని కుమార్తెయైయున్నాము.
మనం ఆయనయొక్క పలుకబడిన వాక్యపు పిల్లలమైయున్నాము, అది ఆయనయొక్క అసలైన వాక్యమైయున్నది! దేవునిలో ఎటువంటి పాపము లేదు, తద్వారా మనము ఆయన స్వంత రూపములో ఉన్నాము గనుక, మనలోనూ ఎటువంటి పాపము లేదు. మనమెట్లు పడిపోగలము? అది అసాధ్యము….అసాధ్యము! మనము ఆయనలో, ఆయనయొక్క అసలైన వాక్యములో భాగమైయున్నాము.
ఎటువంటి సందేహము లేకుండా మనము దీనిని ఎలా తెలుసుకోగలము? ప్రత్యక్షత. పూర్తి బైబిలు గ్రంథము, ఈ వర్తమానము, దేవునియొక్క వాక్యము, అంతయూ ప్రత్యక్షతయే. ఆ విధంగానే మనము ఈ స్వరానికి మరియు ఇతర స్వరాలకి తేడాను తెలుసుకుంటాము, ఎందుకనగా అది ఒక ప్రత్యక్షతయైయున్నది. మరియు మన ప్రత్యక్షత సరిగ్గా వాక్యానుసారంగా ఉన్నది, అది వాక్యానికి వ్యతిరేకంగా లేదు.
మరియు ఈ బండ మీద” (వాక్యము ఏమైయున్నదనే ఆత్మీయ ప్రత్యక్షత మీద) “నేను నా సంఘమును కట్టుదును; మరియు పాతాళలోక ద్వారములు దానిని ఎన్నడూ కుదిపివేయజాలవు.” ఆయన భార్య వేరొక పురుషుని చేత శోధించబడదు. “నేను నా సంఘమును కట్టుదును, మరియు పాతాళ లోక ద్వారములు దానిని కుదిపివేయజాలవు.”
మనం కేవలం, ఆయనయొక్క వాక్యమునకు మాత్రమే నమ్మకంగాను మరియు విశ్వాసనీయంగాను ఉంటాము. మనం ఎన్నడూ వేరొక పురుషునిచేత చరపబడి వ్యభిచారము చేయము. మనం ఆయనయొక్క కన్యకయైన వాక్య వధువులాగా ఉండిపోతాము. మనము ఏ ఇతర వాక్యము వైపు చూడము, దానిని వినము లేదా దానితో పరాచికాలు ఆడము.
అది మన హృదయ లోతులలో ఉన్నది. మనము ఎన్నడూ వేరొక భర్తను కలిగియుండము, కానీ దేవుడు, ఒక మానవునిగా, ఇమ్మానియేలుగా, వచ్చిన యేసుక్రీస్తు అనే మన ఒక్క భర్తను కలిగియున్నాము. ఆయన భార్య వేలకొలది వేలకొలదిగా ఉంటారు. వధువు వాక్యము నుండి రావాలసియున్నదని అది చూపిస్తుంది. “ఒక్క ప్రభువైన యేసు, మరియు ఆయనయొక్క అనేకులైన వధువు.”
ఇది అందరి కొరకు కాదని, కేవలం ప్రవక్తయొక్క గుంపు వారికేనని మనము అర్థము చేసుకోవాలి. ఆయనయొక్క స్వంత అనుచరులకే. ఈ వర్తమానము వారికి మాత్రమే, ఎవరినైతే కాయమని పరిశుద్ధాత్మ ఆయనకు ఇచ్చాడో ఆ చిన్న మందకు మాత్రమేయైయున్నది.
ఆయన మనకు ఏమి చెప్తాడో దానికై దేవుడు ఆయనను బాధ్యుడిగా ఎంచుతాడు, మరియు ఆయన క్రీస్తు నొద్దకు నడిపించినవారిని అనగా ఆయా దేశములలో ఆయన ద్వారా మార్పుచెందిన మనలను, దానిలోని ప్రతీ మాటను నమ్ముటకును మరియు ఎన్నడూ రాజీపడకుండా ఉండునట్లు దేవుడు మనలను బాధ్యులనుగా ఎంచుతాడు.
మనము ఆయనయొక్క ఎన్నిక చేయబడినవారమని ఆయన మనతో చెప్పుటను మనం కూర్చుని వినడమనేది మనకు ఎంత అద్భుతమైన విషయం కదా. ఆయనయొక్క మొదటి వధువు, మరియు ఆయనయొక్క రెండవ వధువు, ఆయనను ఎలా నిరుత్సాహపరిచారు కదా; కానీ, ఆయనయొక్క గొప్ప అంత్య-కాల వధువైయున్న మనము ఆయనను ఎన్నడూ నిరుత్సాహపరచము. మనము అంతము వరకు ఆయనయొక్క నమ్మకమైన, విశ్వాసనీయమైన, కన్యక వాక్యపు వధువుగా ఉండిపోతాము.
ఆయన వాక్యము పట్ల మనకున్న విశ్వాసము దినదినము అధికముగా పెరుగుచున్నది. మనము ఆయనయొక్క ప్రతీ వాక్యమును వినుచు మరియు లోబడుచు, ఆయనయొక్క స్వరము మనతో మాట్లాడుటను వినుచు, మన బైబిలు గ్రంథములను చదువుకొనుచు, ప్రార్థన చేసుకొనుచు మరియు దినమంతయు ఆయనని ఆరాధించుచు మనల్ని మనము సిద్ధపరచుకొనుచున్నాము.
ఆయన అతిత్వరలో వస్తున్నాడని మనము ఎరిగియున్నాము. ఇప్పుడు ఏ నిమిషమైనా కావచ్చును. నోవహు వలె, ఆయన నిన్న వస్తాడేమోనని మనము ఆశపడ్డాము; బహుశా రేపు ఉదయము; మధ్యాహ్నము, సాయంత్రము వస్తాడేమోనని ఆశపడుచున్నాము, అయితే ఆయన వచ్చుచున్నాడని మనము ఎరిగియున్నాము. దేవునియొక్క ప్రవక్త మరియు ఆయనయొక్క వాక్యము ఎటువంటి పొరపాట్లు చేయరు, ఆయన వచ్చుచున్నాడు. ఇది 7వ దినమని మనము భావిస్తున్నాము, మరియు మేఘములు అలుముకొనుటను మరియు పెద్ద పెద్ద వర్షపు చినుకులు పడుటను మనము చూడగలుగుచున్నాము; సమయము ఆసన్నమైనది.
గొప్ప ఎదురుచూపుతో కనిపెడుతూ, మనము ఓడలో క్షేమంగాను మరియు భద్రంగాను ఉన్నాము. ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు మేము: వివాహము మరియు పరిత్యాగము 65-0221M అను వర్తమానమును వింటుండగా దేవునియొక్క స్వరము మమ్మల్ని ఆధరించుటను మేము ఆలకించుచుండగా వచ్చి మాతో చేరండి.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానమును వినుటకు ముందు చదవవలసిన లేఖనములు:
పరిశుద్ధ. మత్తయి 5:31-32 / 16:18 / 19:1-8 / 28:19
అపొస్తలుల కార్యములు 2:38
రోమా 9:14-23
మొదటి తిమోతీ 2:9-15
మొదటి కోరింథీ 7:10-15 / 14:34
హెబ్రీ 11:4
ప్రకటన 10:7
ఆదికాండము 3వ అధ్యాయము
లేవీయకాండము 21:7
యోబు 14:1-2
యెషయా 53
యెహేజ్కేలు 44:22