ఆదివారం
12 జనవరి 2025
61-0108
Revelation, Chapter Four Part III

ప్రియమైన నిత్యత్వపు వారలారా,

మనయొక్క యుద్ధపు తలపాగాను తీసివేసి మరియు ఆత్మసంబంధమైన ఆలోచనను ధరించుటకు సమయమైనది, ఎందుకనగా దేవుడు ఆయనయొక్క వధువునకు ఆయనయొక్క వాక్యమును గూర్చిన మరి ఎక్కువ ప్రత్యక్షతను ఇచ్చుటకు సిద్ధపడుచున్నాడు.

ఆయన మనకు గతంలోని మర్మములన్నిటియొక్క ముసుగును తొలగిస్తుంటాడు. భవిష్యత్తులో ఏమి జరుగబోవుచున్నదో ఆయన మనకు చెప్తాడు. బైబిలు గ్రంథములో ఉన్న ఇతరులందరూ కేవలం ఏమి చూసారో లేదా ఏమి విన్నారో, ఆయన తనయొక్క ఆ వాక్యమును గూర్చిన ప్రతీ చిన్న వివరమును మరియు దానియొక్క అర్థమును మనకు బయలుపరుస్తాడు.

మనము బైబిలు గ్రంథములోని గురుతులను విని మరియు వాటిని గ్రహించబోవుచున్నాము: జీవులు, గాజువంటి సముద్రము, సింహము, దూడ, మనుష్యుడు, పక్షిరాజు, కరుణాపీఠము, కాపలాకాయువారు, పెద్దలు, స్వరములు, మృగము, జీవులు.

మనము పాత నిబంధనలోని కాపలాదారుల గురించి అంతా విని మరియు గ్రహిస్తాము. యూదా: తూర్పు కావలి; ఎఫ్రాయిము: పశ్చిమ కావలి; రూబేను: దక్షిణ కావలి; దాను: ఉత్తర కావలి.

ఆ గోత్రములను దాటకుండా ఏదియు ఆ కరుణాపీఠముయొక్క చుట్టుప్రక్కలకు రానేరదు. సింహము, మనుష్యునియొక్క తెలివి; ఎద్దు: పనిభారము గలది; పక్షిరాజు: దాని వేగము.

ఏ విధంగా పరలోకము, భూమి, మధ్యలో-ఉన్నదానంతటి, మరియు చుట్టూ ఉన్నదానంతతికి, కాపలాదారులు ఉన్నారు కదా. మరియు దాని మీద అగ్ని స్తంభము ఉన్నది. ఆ గోత్రములను దాటకుండా ఏదియును ఆ కరుణాపీఠమును తాకలేదు.

ఇప్పుడు క్రొత్త నిబంధనలో కాపలాదారులు ఉన్నారు: మత్తయి, మార్కు, లూకా, యోహాను, నేరుగా ముందుకు వెళ్ళుచున్నారు. తూర్పు ద్వారము సింహముచేత కాయబడుచున్నది, ఉత్తర ద్వారము ఎగురుచున్న పక్షిరాజుచేత కాయబడుచున్నది, యోహాను, సువార్తికుడు. పిదప ఈ వైపున ఉన్న వైద్యుడు, లూకా, మనుష్యుడు.

నాలుగు సువార్తలు సరిగ్గా అవి చెప్పినదానిని నిర్ధారించుటకు ప్రతి లేఖనమును కలిగియుండి పెంతెకొస్తు ఆశీర్వాదమును కాయుచున్నవి. మరియు ఇప్పుడు ఈనాడు యేసుక్రీస్తు నిన్నా, నేడు, మరియు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడని, ఆ నాలుగు సువార్తలతో కలిసి అపొస్తలుల కార్యములు నిర్ధారించుచున్నవి.

దేవునియొక్క అసలైన అభిషేకించబడిన వ్యక్తి మాట్లాడినప్పుడు, అది దేవునియొక్క స్వరమైయున్నది! మనము అసలు ఈ విధంగా కేకలు వేయగోరుచున్నాము, “ప్రభువు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు!”

దాని నుండి దూరంగా వెళ్ళుటకు దారే లేదు. నిజానికి, మనము దాని నుండి దూరంగా వెళ్ళలేము, ఎందుకనగా అది మననుండి దూరంగా వెళ్ళదు. మన విమోచనా దినమువరకు మనము ముద్రించబడియున్నాము. రాబోవునవియైనను, ఉన్నవియైనను, ఆపదలైనను, ఆకలియైనను, దప్పికయైనను, మరణమైనను, లేదా ఇంకేదియును, క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరదు.

మన దినమునకైన ఈ వెలుగును చూడటానికి, ఈ స్వరమును స్వీకరించడానికి, ఈ వర్తమానమును నమ్మడానికి, పరిశుద్ధాత్మను పొందుకొని మరియు దానిలో నడవడానికి, జగత్తు పునాది వేయబడకముందే మన పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథములో పెట్టబడ్డాయి. గొర్రెపిల్ల వధించబడినప్పుడు, గొర్రెపిల్ల పేరు అక్కడ పెట్టబడిన అదే సమయములో మన పేర్లు కూడా ఆ గ్రంథములో పెట్టబడ్డాయి. మహిమ!!

కావున, ఏదియు ఈ వర్తమానము నుండి మనల్ని వేరు చేయలేదు. ఏదియు ఆ స్వరము నుండి మనల్ని వేరు చేయలేదు. ఏదియు ఈ వాక్యముయొక్క ప్రత్యక్షతను మనదగ్గర నుండి తీసివేయలేదు. అది మనది. దేవుడు మనల్ని పిలిచాడు మరియు మనల్ని ఎన్నుకున్నాడు మరియు మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. ప్రతీది మనకు చెందియున్నది, అది మనదే.

దీనంతటినీ పొందుకోడానికి ఒకే ఒక్క మార్గమున్నది. మీరు వాక్యమనే ఉదక స్నానముచేత కడుగబడవలసియున్నది. మీరు దానిలోనికి ప్రవేశించుటకుముందు మీరు వాక్యమును వినవలసియున్నారు. మరియు మీరు దేవుడిని సమీపించగల ఒకే ఒక్క మార్గమున్నది, అది విశ్వాసము ద్వారానేయైయున్నది. మరియు వినుటవలన, అనగా అతిపరిశుద్ధ స్థలములోనుండి ఈ కాలముయొక్క వర్తమానికుడిలోనికి ప్రతిబింబించబడుచున్న దేవుని వాక్యమును వినుటవలన విశ్వాసము కలుగుతుంది.

కావున, ఇక్కడ, సంఘకాలపు దూత ఇక్కడున్న ఈయన ఎవరన్నదానిని ఆ నీటిలోనికి ప్రతిబింబిస్తున్నాడు, ఆయనయొక్క కనికరమును, ఆయనయొక్క మాటలను, ఆయనయొక్క తీర్పును, ఆయనయొక్క నామమును ప్రతిబింబిస్తున్నాడు. అదంతయు ఇక్కడ ప్రతిబింబించబడినది మరి దానిని నమ్ముటచేత మీరు వేరుచేయబడతారు. మీకు అది అర్థమైనదా?

టేపులను వినడం ఆపకండి, కేవలం వాటితో నిలిచియుండండి. వాక్యముతో దానిని పరిశోధించి మరియు అది సరియో కాదో చూడండి. అది ఈ దినమునకై దేవుడు ఏర్పాటు చేసిన మార్గమైయున్నది.

ఈ చలికాలము ప్రపంచ వ్యాప్తంగా మేము కూడుకొని మరియు దేవుని స్వరము ముందెన్నడూ లేని విధంగా ఆయనయొక్క వధువునకు ఆయనయొక్క వాక్యమును బయలుపరచుటను వింటుండగా వచ్చి మాతో చేరండి. ప్లేను నొక్కి మరియు ఆయన స్వరమును వినుటకంటె మరి గొప్ప అభిషేకము లేనే లేదు.

నా హృదయలోతులనుండి, నేను దీనిని చెప్పగలను: మీలో ప్రతి ఒక్కరితో కలిసి నేను వారిలో ఒకడినని చెప్పగలుగుచున్నందుకు నేనెంతగానో సంతోషిస్తున్నాను.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

వర్తమానము: 61-0108 – ప్రకటన గ్రంథము, నాలుగవ అధ్యాయము భాగము III

సమయము: 12:00 P.M. జఫర్సన్విల్ కాలమానం