
ప్రియమైన పునరుద్ధరించబడిన వారలారా,
మనము ఎవరమైయున్నాము, ఎక్కడనుండి వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాము, మనము ఎవరికి వారసులమైయున్నాము, మరియు ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనే దానిని దేవునియొక్క స్వరము మనతో చెప్పడాన్ని వినుటకు నేను ఎన్నడూ అలసిపోను.
దేవునికి ఆత్మసంబంధమైన బల్యర్పణలను, తమ జిహ్వా ఫలములను అర్పిస్తూ, ఆయన నామమునకు స్తుతి చెల్లిస్తున్న, ఒక ఆత్మసంబంధమైన యాజకత్వము, ఒక రాజసంతానపు దేశము.” ఎటువంటి ఒక—ఎటువంటి ఒక జనము కదా! ఆయన వారిని కలిగియున్నాడు.
మన ఏకైక ఆదరణ మరియు సమాధానము దేవునియొక్క వాక్యము మనతో మాట్లాడటాన్ని వినుట ద్వారా మాత్రమే కలుగుతుంది, పిదప మన జిహ్వా ఫలముల ద్వారా ఆత్మసంబంధమైన అర్పణలను అర్పించుట చేత, ఆయన నామమునకు స్తుతి చెల్లిస్తూ తిరిగి తండ్రితో మాట్లాడటం ఎటువంటి విషయం కదా.
ఈ ప్రపంచమంతా మూలుగుచున్నది. ప్రకృతి మూలుగుచున్నది. మనము ప్రభువుయొక్క రాకడ కొరకు మూలుగుచు వేచియున్నాము. ఈ లోకము మన కొరకు ఏమియు కలిగిలేదు. మనము బయలుదేరి మరియు కాలమనే తెరకు ఆవల, మనకొరకు వేచిచూస్తూ, ఇదివరకే అక్కడ ఉన్నటువంటి వారందరితో, మరియు ఆయనతో కలిసి మన వివాహ విందునకు మరియు భవిష్యత్తు గృహమునకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము.
మనము లేచి మరియు మనల్ని మనము కుదుపుకుందాము! మన స్పృహను గిచ్చుకుందాము, సరిగ్గా ఇప్పుడు ఏమి జరుగుతుందో మరియు కనురెప్పపాటున ఏమి జరుగబోవుచున్నదో దాని విషయమై మేల్కొందాము.
దేవునియొక్క స్వరము మాట్లాడి మరియు ఆయనయొక్క వధువునకు ఆయనయొక్క వాక్యమును బయలుపరచుటను వినడానికి ప్రపంచమంతటినుండి, అందరూ సరిగ్గా ఒకే సమయములో ఐక్యమవ్వడమనేది, క్రీస్తుయొక్క వధువునకు ప్రపంచ చరిత్రలోనే ఎన్నడూ సాధ్యపడలేదు.
విశ్వాసులారా, మిమ్మల్ని మీరు ఈ విధంగా ప్రశ్నించుకోండి, ఏ స్వరము, ఏ సేవకుడు, ఏ మనుష్యుడు, క్రీస్తుయొక్క వధువును ఐక్యపరచి ఏకముగా కూడివచ్చునట్లు చేయగలడు? మీరు క్రీస్తుయొక్క వధువైయున్నయెడల, టేపులలో ఉన్న దేవుని స్వరము గాక వేరే ఏ స్వరము లేదని మీకు తెలుసు.
అవును, పరిశుద్ధాత్మ మనలో ప్రతి ఒక్కరిలోను, సంఘములోని ప్రతి కార్యాలయములోను ఉన్నాడు, అయితే ఆయన మనకు వాక్యము ద్వారా తీర్పు తీరుస్తాడని స్వయంగా దేవుడే మనకు చెప్పాడు. ఆయనయొక్క వాక్యము ఆయనయొక్క ప్రవక్త నొద్దకు వస్తుందని వధువునకు తెలుసు. ఆయనయొక్క ప్రవక్త మాత్రమే ఆయనయొక్క వాక్యమును దైవికముగా అనువదించువాడైయున్నాడు. ఆయన పలికినదానికి ఏదియు కలపబడకూడదు లేదా దానినుండి ఏదియు తీసివేయబడకూడదు. మనమందరము తీర్పు తీర్చబడేది, టేపులలో ఉన్న, ఆయనయొక్క వాక్యము ద్వారాయైయున్నది గాని, వేరే ఏ వాక్యము ద్వారానో లేదా ఆ వాక్యమునకైన ఏ అనువాదము ద్వారానో కాదు.
వధువును ఐక్యపరచడం వేరే ఏ స్వరమునకు సాధ్యము కాదు. టేపులలో ఉన్న దేవుని స్వరము మాత్రమే ఆయనయొక్క వధువును ఐక్యపరచగలదు. ఆ వాక్యము మీద మాత్రమే వధువంతయు ఏకీభవించగలదు. ఆయనయొక్క వధువు కొరకు ఆయనయొక్క స్వరమైయున్నదని దేవుడు నిర్ధారించిన ఏకైక స్వరము అది మాత్రమేయైయున్నది. ఆయనతో ఉండటానికి ఆయనయొక్క వధువు ఏక మనస్సు మరియు ఏక భావము గలవారైయుండవలసి యున్నది.
సేవకులు సేవ చేయవచ్చును, బోధకులు బోధించవచ్చును, సంఘకాపరులు సంఘకాపరత్వము చేయవచ్చును, కానీ టేపులలో ఉన్న దేవునియొక్క స్వరము మాత్రమే వారు ప్రజల ముందుంచవలసిన అత్యంత ముఖ్యమైన స్వరమైయున్నది. అది వధువుయొక్క సంపూర్ణతైయున్నది.
మీకు దానిని గూర్చిన ప్రత్యక్షత ఉన్నట్లైతే, అప్పుడు జరుగబోవుచున్నది ఇదేయైయున్నది.
ఆదాము తన స్వాస్థ్యమును, భూమిని కోల్పోయాడని బైబిలు గ్రంథము మనకు చెప్పుచున్నది. అది అతని చేతి నుండి అతడు దానిని ఎవరికైతే అమ్మివేసాడో వాని చేతికి, అనగా సాతానుడి చేతికి వెళ్ళిపోయినది. అతడు దేవుని వాక్యమందు అతని విశ్వాసమును, సాతానుడియొక్క హేతువాదములకు అమ్మివేశాడు. అతడు ప్రతీ అణువును సాతానుడి చేతులకు విడిచిపెట్టేసాడు. అతడు దానిని అతని చేతినుండి సాతానుడికి అందజేసాడు.
దేవుడు ప్రతిచోట, విశ్వమంతటికీ దేవుడైయున్నాడు, అయితే ఆయనయొక్క కుమారుడు, ఆదాము, ఈ భూమిని అతని స్వంత నియంత్రణలో కలిగియున్నాడు. అతడు పలుకగలడు, అతడు పేరు పెట్టగలడు, అతడు చెప్పగలడు, అతడు ప్రకృతిని ఆపగలడు, అతడు తాను కోరిన దేనినైనా చేయగలడు. అతడు భూమి మీద పూర్తి, సర్వాధికారమును కలిగియున్నాడు.
ఆదాము దానంతటినీ కోల్పోయాడు, కానీ దేవునికి మహిమ, అతడు కోల్పోయి మరియు విడిచిపెట్టినదంతయు మన రక్తసంబంధియగు విమోచకుని ద్వారా విమోచించబడినది, ఆయన మరెవరో కాదు గాని ఇమ్మానుయేలుగా, మనలో ఒకనిగా మారిన, సర్వశక్తిమంతుడగు దేవుడైయున్నాడు. ఇప్పుడు, అది మనదైయున్నది.
మనము ఆయనతో కూడ రాజులుగాను యాజకులుగాను ఉండి పరిపాలించునట్టి ఆయనయొక్క కుమారులము మరియు కుమార్తెలమైయున్నాము. మనము ఆయనతోను మరియు మన ప్రియులందరితోను కలిసి నిత్యజీవమును కలిగియుంటాము. ఇక ఏ వ్యాధి, ఏ బాధ, ఏ మరణము ఉండదు, కేవలం అందరము కలిసి నిత్యత్వములో ఉంటాము.
మనము దాని గురించి ఆలోచించినప్పుడు, దయ్యము మనల్ని నిరాశపరచునట్లు మనమెలా అనుమతించగలము? అది మనదే, త్వరలో మనము అక్కడికే వెళ్ళబోవుచున్నాము. ఆయన మనకు ఇవ్వగలిగే అత్యంత గొప్పదానిని ఆయన మనకు ఇచ్చాడు. ఈ భూమి మీద ఈ కొద్ది దినముల పరీక్షలు మరియు శోధనలు కేవలం కొద్ది రోజుల దూరములోనున్న మన గొప్ప విజయము చేత త్వరగా ముంచివేయబడతాయి.
మన విశ్వాసము ఇంతకన్నా గొప్పగా ముందెన్నడూ లేదు. మన సంతోషము ఇంతకన్నా ఎక్కువగా ముందెన్నడూ లేదు. మనము ఎవరమన్నది మరియు మనము ఎక్కడికి వెళ్తున్నామన్నది మనకు తెలుసు. మనము ఆయనయొక్క వాక్యముతో నిలిచియుండుట ద్వారా మనము ఆయనయొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉన్నామని మనకు తెలుసు. మనము చేయవలసిందల్లా ఏమిటంటే టేపులతో నిలిచియుండి మరియు ప్రతి మాటను నమ్మడమే; దానంతటినీ అర్థం చేసుకోవడం కాదు, కానీ ప్రతీ మాటను నమ్మడమైయున్నది…మరియు మనము నమ్ముతున్నాము!
వినుట వలన, వాక్యమును వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వాక్యము ప్రవక్త నొద్దకు వస్తుంది. దేవుడు దానిని పలికాడు. దేవుడు దానిని రికార్డు చేసాడు. దేవుడు దానిని బయలుపరిచాడు. మనము దానిని వింటాము. మనము దానిని నమ్ముతాము.
టేపులలో ఉన్న దేవునియొక్క స్వరమును వినుట ద్వారా మాత్రమే మీరు ఈ ప్రత్యక్షతను పొందుకోగలరు.
దేవుడు మనకు అనుమతిస్తే, అంతమున క్రీస్తు ఏమి చేస్తాడన్నదంతయు మనకు ఈ వారంలో, ఏడు ముద్రలలో బయలుపరచబడుతుంది. చూశారా? మంచిది. అది బయలుపరచబడుతుంది. మరియు ముద్రలు బ్రద్దలు చేయబడి మరియు మనకు విప్పబడుతుండగా, బయలుపరచబడుతుంది, అప్పుడు ఈ గొప్ప విమోచనా ప్రణాళిక ఏమిటో, మరియు అది ఎప్పుడు ఎలా జరుగబోతున్నదో మనం చూడగలుగుతాము. అదంతయు ఇక్కడ ఈ మర్మముల గ్రంథములో దాచబడియున్నది. అది ముద్రించబడియున్నది, ఏడు ముద్రలతో ఉన్నది, మరియు కావున గొర్రెపిల్ల మాత్రమే వాటిని బ్రద్దలు చేయగలడు.
ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, ప్రపంచమంతటి నుండి వధువులోని ఒక భాగము అందరూ ఒకేసారి దేవునియొక్క స్వరమును వింటూ ఉంటారు. మనము మన తీవ్రమైన ప్రార్థనలతో ఆకాశమును నింపివేస్తాము మరియు ఆయనను ఆరాధిస్తాము. మేము దీనిని వింటుండగా వచ్చి మాతో చేరమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను: ఏడు సంఘకాలములకు మరియు ఏడు ముద్రలకు మధ్య ఎడమ 63-0317E.
ఈ వారము జఫర్సన్విల్ కాలమానములోని మార్పు గురించి దయచేసి మర్చిపోకండి.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్