కూటముల యొక్క తర్జుమాలు ప్రత్యక్షంగా చేయబడుచున్నవి మరియు వాటి ఆడియో నకలు చేయుట కొరకు, ప్రతి వ్రాయుటకు, లేదా మరేవిధముగానైనా ఉత్పత్తి చేయుటకు ఉపయోగించరాదు. ప్రతి కూటము సమయంలో చెప్పబడిన వాటిని ఖచ్చితంగా అట్లే ప్రసారం చేయాలనే ఉత్తమ ఉద్దేశాలను అనువాదకులు కలిగియుంటారు, కానీ ప్రత్యక్ష తర్జుమాల సమయంలో మనుష్యరీతిగా అనివార్యమైన పొరపాట్లు మరియు తప్పిపోయిన పదాలు ఉంటాయి. కూటముల తర్జుమాలు స్వతంత్ర తర్జుమాలుగా ఉద్దేశించబడ లేదు మరియు వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగుల యొక్క సాధారణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండకపోవచ్చు.
తర్జుమా చేయబడిన ఆడియో ప్రసారము వెనుకనున్న మా ఉద్దేశ్యం ఏమిటనగా, ఇంగ్లీషు మాట్లాడలేనివారికి కూడా కూటములలో మాతోపాటు ఆరాధించే అవకాశాన్ని కల్పించడమైయున్నది. బ్రెన్హామ్ టెబర్నికల్ అనేది ప్రపంచ వ్యాప్తంగా సువార్త రంగములలోని క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె కొరకు గొప్ప భారాన్ని కలుగియున్న ఒక సువార్త-పరిచారక మనస్సుగల ఒక సంఘమైయున్నది. మా ప్రార్థనల ద్వారా, ప్రేమ కానుకల ద్వారా వారిని చేరుకొనుటకు, మరియు ఇప్పుడు, ప్రసారం మార్గము ద్వారా వాక్యము చుట్టు ఒక సహవాసము కలిగియుండుటకు ప్రభువు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మేము కృతజ్ఞులమైయున్నాము. ఈ కూటములు మీకు మరియు మీ కుటుంబాలకు ఒక ఆశీర్వాదముగా ఉంటాయని మేము నమ్ముచున్నాము.