ఆదివారం
10 ఆగస్టు 2025
65-1206
ప్రవచనము ద్వారా తేటపరచబడిన ఈ కాలపు సంఘటనలు
కూటము ఇంత సమయంలో ప్రారంభమగును:
0
రోజులు
19
గంటలు
40
నిమిషాలు
35
క్షణములు

Sun Apr 26, 2020 10:00 AM EDT

ప్రియమైన నమ్మకమైన సజీవమైన వధువా,

స్వయంగా వాక్యమైయున్న యేసు, 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చినప్పుడు, ఆయన ఏ విధంగా వస్తానని చెప్పాడో ఆయన ఆ విధంగానే వచ్చాడు, ఒక ప్రవక్తగా వచ్చాడు. ఆయన మరలా రావడానికిముందు, యేసుక్రీస్తు వ్యక్తిత్వముయొక్క పూర్తి నెరవేర్పు మరలా శరీరములో, ఒక ప్రవక్తలో వ్యక్తపరచబడుతుందని, ఆయనయొక్క వాక్యము ప్రకటిస్తుంది. ఆ ప్రవక్త వచ్చాడు, ఆయన పేరే విలియమ్ మారియన్ బ్రెన్హామ్.

టేపులలో దేవునియొక్క స్వరము నేరుగా వారితో మాట్లాడటాన్ని వినడము దేవునియొక్క పరిపూర్ణ చిత్తమైయున్నదని ఎవరైనా గుర్తించకుండా ఎలా ఉండగలరు? వాక్యము ఎల్లప్పుడూ ఆయనయొక్క ప్రవక్త యొద్దకు వస్తుందని మనకు తెలుసు; అది వేరే ఏ మార్గములోను రాజాలదు. దేవుడు మనకు ముందుగా దేని గురించియైతే చెప్పాడో అటువంటి దేవుని మార్గపు దారిగుండా అది రావలసియున్నది. అది వచ్చే ఒకే ఒక్క మార్గము అదేయైయున్నది. ఆయన దానిని ఎలా చేస్తానని వాగ్దానము చేసాడో ఆ మార్గముగుండా దేవుడు కదులుతాడు. ఆయన ఎల్లప్పుడూ చేసిన విధానములోనే దానిని చేయుటకు ఆయన ఎన్నడూ విఫలము కాడు.

వారందరూ ఒకే ఆహారమును తిన్నారు, వారందరూ ఆత్మలో నాట్యము చేసారు, వారందరూ సమస్తమును ఒకే విధంగా కలిగియున్నారు; కానీ వేరుపరచు సమయమునకు వచ్చినప్పుడు మాత్రం, వాక్యము వేరుచేసినది. ఈనాడు అది ఆ విధంగానే ఉన్నది! వేర్పాటును చేసినది వాక్యమేయైయున్నది! ఆ సమయము వచ్చినప్పుడు...

ఆ సమయము ఇప్పడు సంభవించడాన్ని మనము చూస్తున్నాము, వాక్యము వేరుచేస్తున్నది. “ఈనాడు వధువును నడిపించడానికి దేవునిచేత పిలువబడి, పరిశుద్ధాత్మతో నింపబడిన ఇతరులు ఉన్నారు. కేవలం టేపులకంటే ఎక్కువైనది మీకు అవసరమైయున్నది. సంఘమును నడిపించడానికి దేవుడు ఈనాడు వ్యక్తులను నియమించాడు,” అని వారు చెప్తుండగా, ప్రవక్తకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నదని వధువుపై నేరారోపణ చేయబడుచున్నది.

“గుంపులో నీవు ఒక్కడవే ఉన్నావని అనుకోవడానికి నీవు ప్రయత్నిస్తున్నావు. సంఘసమాజమంతయు పరిశుద్ధమైనదే!” దేవుడు ఎన్నడూ ఆ విధంగా వ్యవహరించలేదు. అతడు దానికంటే మెరుగుగా ఎరిగియుండవలసియున్నాడు. మరియు అతడు, “మంచిది, సంఘసమాజమంతయు పరిశుద్ధమైనదే. నిన్ను నీవు…” ఈనాడు, వీధి భాషలో గనుక మనము దానిని చెప్పినట్లైతే, “సముద్రతీరాన్న ఉన్న ఒకే ఒక్క గులకరాయి నీవే అన్నట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నావు" అని అన్నాడు.

మరియు దాని కొరకు దేవుడే తనను అక్కడికి పంపించాడని మోషేకి తెలుసు.

ఆయనయొక్క వధువును నడిపించడానికి; వారిని యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు వద్దకు, వర్తమానికుడైన ప్రవక్త యొద్దకు నడిపించడానికి దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులను కలిగియున్నాడు. ఏలయనగా వర్తమానము మరియు వర్తమానికుడు ఒక్కటే. అదియే ఈ దినమునకు, మరియు ఎప్పటికినీ దేవునియొక్క మార్పులేని ఏర్పరచబడిన మార్గమైయున్నది.

ఎందుకనగా వారు ఒక తప్పును విన్నారు. మోషే, దేవునిచేత నిర్ధారించబడినవాడై, మరియు వారికి వాగ్దాన దేశమునకు మార్గము చూపించడానికి ఒక నాయకుడైయుండగా, మరి వారు అంతవరకూ బాగుగానే వచ్చారు, కానీ పిదప వారు అతనితో కొనసాగలేదు…ఇప్పుడు, విశ్వాసులు దానిని చూడగలరు, కానీ అవిశ్వాసులు ఆ నిర్ధారించబడినదానిని చూడలేరు.

ఈ దినమునకైన ఈ గొప్ప అంత్య-కాల ప్రత్యక్షతను పొందుకోవడానికి మీరు ఎన్నుకోబడటం మాత్రమే కాదు గాని, దేవుడు, ఆయనయొక్క దాచబడిన ఆహారపు టేపుల మార్గము గుండా, తనయొక్క ప్రియమైన వధువుతో గూడార్థముగా మాట్లాడుచున్నాడు.

అలాగైతే నీవు ఒక దేవుని కుమారుడవైతే లేదా ఒక దేవుని కుమార్తెవైతే, నీవు అన్నివేళలా దేవునిలో ఉండియున్నావు. అయితే నీవు ఏ సమయములో మరియు ఏ గర్భములో నాటబడతావన్నది ఆయన ఎరిగియున్నాడు. కావున ఇప్పుడు నీవు ఒక ప్రాణిగా చేయబడ్డావు, ఒక దేవుని కుమారుడవైయున్నావు, ఈ గడియయొక్క నిజమైన మరియు సజీవమైన దేవుడిని, ఈ సమయములో బయలువెళ్ళుచున్న వర్తమానమును నిర్ధారించుటకు ఈ గడియయొక్క సవాలును ఎదుర్కోవడానికి ప్రత్యక్షపరచబడిన దేవుని కుమారుడవు లేదా కుమార్తెవైయున్నావు. అది నిజము! జగత్తుపునాది వేయబడకముందే నీవు అక్కడ చేయబడ్డావు.

ఆయనయొక్క వధువునకు ఎటువంటి ఒక గూడార్థమైన ప్రేమ లేఖ కదా, మహిమ!!! జగత్తుపునాది వేయబడకముందే ఆయన మనల్ని ఎరిగియుండి మరియు ఎన్నుకోవడం మాత్రమే కాదు గాని, ఈ దినమున ఆయనయొక్క ప్రత్యక్షపరచబడిన కుమారులు మరియు కుమార్తెలుగా ఉండుటకు ఆయన మనల్ని ఎన్నుకున్నాడని ఇక్కడ మనకు చెప్పుచున్నాడు. ఆదినుండి ఉన్నటువంటి పరిశుద్ధులందరికి పైగా ఆయన మనల్ని ఈనాడు భూమి మీద ఉంచాడు, ఎందుకనగా మనము ఈ గడియయొక్క నిజమైన మరియు సజీవమైన దేవుడిని, ఈ సమయములో బయలువెళ్ళుచున్న వర్తమానమును నిర్ధారించుటకు ఈ గడియయొక్క సవాలును ఎదుర్కుంటామని ఆయన ఎరిగియున్నాడు.

ఆదినుండి మనము ఒక కణముగా, ఒక వాక్యముగా, ఒక గుణలక్షణముగా, దేవునిలో ఉండియున్నాము, కానీ ఇప్పుడు క్రీస్తుయేసుతో కూడ కలిసి పరలోక స్థలములలో కూర్చొనియున్నాము, ఆయనయొక్క వాక్యమువలన, ఆయనయొక్క వాక్యము ద్వారా ఆయనతో సహవాసము చేయుచున్నాము; ఏలయనగా మనము ఆయనయొక్క వాక్యమైయున్నాము, మరియు అది మన అంతరాత్మలను పోషించుచున్నది.

దేవునియొక్క సంకరములేని వాక్యము తప్ప, మనము మన జీవితములలోనికి దేనిని జొప్పించలేము, మరియు జోప్పించము కూడా. అది ఈ దినము కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గమైయున్నదని మనము గుర్తించి మరియు నమ్ముచున్నాము.

ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, ఒకే ఒక్క స్వరమును, టేపులలో ఉన్న దేవుని స్వరమును మేము వినుచుండగా, మీరు వచ్చి మాతో చేరడాన్ని మేమెంతగానో ఇష్టపడతాము, మీరు వినే ప్రతి మాటకు, మీరు ఆమేన్ చెప్పవచ్చును.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

వర్తమానము: ప్రవచనము ద్వారా తేటపరచబడిన ఆధునిక సంగతులు 65-1206

వర్తమానమును వినడానికిముందు చదువవలసిన లేఖనములు:

ఆదికాండము 22
ద్వితియోపదేశకాండము 18:15
కీర్తనలు 16:10 / 22:1 / 22:18 / 22:7-8 / 35:11
యెషయా 7:14 / 9:6 / 35:7 / 50:6 / 53:9 / 53:12 / 40:3
ఆమోసు 3:7
జెకర్యా 11:12 / 13:7 / 14:7
మలాకీ 3:1 / 4:5-6
పరిశుద్ధ. మత్తయి 4:4 / 24:24 / 11:1-19
పరిశుద్ధ. లూకా 17:22-30 / 24:13–27
హెబ్రీ 13:8 / 1:1
పరిశుద్ధ. యోహాను 1:1
ప్రకటన 3:14-21 / 10:7